Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో మిస్సైన వారి కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు- ఫొటో పంపిస్తే వివరాలు అందజేత-odisha coromandel train accident ap disaster management organization set up whatsapp number for missing travel ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Odisha Coromandel Train Accident Ap Disaster Management Organization Set Up Whatsapp Number For Missing Travel

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదంలో మిస్సైన వారి కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు- ఫొటో పంపిస్తే వివరాలు అందజేత

Bandaru Satyaprasad HT Telugu
Jun 03, 2023 02:11 PM IST

Odisha Train Accident : ఒడిశా కోరమాండల్ రైలు ప్రమాదంలో బాధితుల వివరాల కోసం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో మిస్సైన వారి సమాచారం కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటుచేసింది.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం
కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం (Image Source : Twitter )

Odisha Train Accident : ఒడిశా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద సంఘటన మృత్యు ఘంటికలు మోగించింది. ఈ ప్రమాదంలో 278 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారు. రైలు ప్రమాదంలోని క్షతగాత్రుల సమాచారం కోసం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ 24/7 ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఏర్పాటుచేసింది.

కంట్రోల్ రూమ్ నెంబర్లు : 1070, 112, 18004250101

ఈ ప్రమాదంలో మిస్సైన వారి సమాచారం కోసం 8333905022 నెంబర్ కు ప్రయాణికుని ఫోటో, ఇతర వివరాలు వాట్సాప్ చేస్తే, పోలీస్ శాఖతో సమన్వయ పరుచుకుని బాధితుల సమాచారం తెలియజేస్తామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఒడిశా కోరమాండల్ రైలు ప్రమాదం నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆ నెంబర్లు ఇవే

  • ఒడిశా, బాలసోర్ 06782-262286
  • విజయవాడ - 0866 2576924
  • రాజమండ్రి - 08832420541
  • సామర్లకోట - 7780741268
  • నెల్లూరు - 08612342028
  • ఒంగోలు -7815909489
  • గూడూరు -08624250795
  • ఏలూరు -08812232267

ఒడిశా బాలేశ్వర్ సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మహా విషాద ఘటనలో 278 మంది దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఏపీకి చెందిన 48 మంది ప్రయాణికుల వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు. వీరు ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో దిగాల్సి ఉందని తెలిపారు. వారి వివరాలను విజయవాడ రైల్వే స్టేషన్ లోని హెల్ప్ డెస్క్ కు పంపించారు.

రాజమండ్రికి చెందిన 21 మంది సురక్షితం

కోరమాండల్ రైలులో రాజమండ్రి వచ్చేందుకు 24 మంది ప్రయాణికులు ఎక్కినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 21 మంది సురక్షితంగా ఉన్నారని, మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ రైలులో ప్రయాణికుల వివరాల కోసం వారి బంధువులు స్థానిక రైల్వేస్టేషన్‌లోని హెల్ప్‌లైన్‌ నెంబర్లు - 08832420541, 0883-2420543 లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఒడిశా రైలు ప్రమాదంతో ఆ మార్గంలో తిరిగే పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ప్రయాణికులు రైళ్ల రాక కోసం స్టేషన్ లోనే పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు.

IPL_Entry_Point