MS Dhoni Photo : పెళ్లి కార్డుపై ధోనీ ఫొటో.. ఫ్యాన్​​- డై హార్డ్​ ఫ్యాన్​-man prints ms dhonis photo on his wedding card pic goes viral ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Man Prints Ms Dhoni's Photo On His Wedding Card, Pic Goes Viral

MS Dhoni Photo : పెళ్లి కార్డుపై ధోనీ ఫొటో.. ఫ్యాన్​​- డై హార్డ్​ ఫ్యాన్​

Sharath Chitturi HT Telugu
Jun 04, 2023 10:58 AM IST

MS Dhoni Photo : ధోనీకి ఉన్న ఫ్యాన్​ బేస్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు.. ఓ వ్యక్తి తన పెళ్లి కార్డుపై ధోనీ ఫొటో ముద్రించుకున్నాడు! ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

పెళ్లి కార్డుపై ధోని ఫొటో
పెళ్లి కార్డుపై ధోని ఫొటో (Shivsights/Twitter)

MS Dhoni Photo on wedding card : టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్​ కింగ్స్​ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీకి ఉన్న క్రేజ్​ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలే 5వ ఐపీఎల్​ కప్​ గెలవడంతో ధోనీపై ఫ్యాన్స్​ అభిమానం ఇంకాస్త పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఫ్యాన్స్​కు ధోనీ దెవుడితో సమానం! ఈ విషయాన్ని రిజువు చేస్తూ.. తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ డై హార్డ్​ ధోనీ ఫ్యాన్​ చేసిన పని.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఆ వ్యక్తి.. ధోనీ ఫొటోను తన పెళ్లి కార్డుపై ముద్రించుకున్నాడు!

ఫ్యాన్​.. డై హార్డ్​ ఫ్యాన్​..!

ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ వ్యక్తి, ధోనీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన పెళ్లి కార్డుపై ధోనీ జెర్సీ నెంబర్​ 7తో పాటు అతని ఫొటోను ముద్రించాడు. 'తాలా' అని కార్డుపై రాయించుకున్నాడు.  సాధారణంగా పెళ్లి కార్డులపై దేవుళ్ల ఫొటోలు ఉంటాయి. అంతేకాకుండా.. ఈ పెళ్లి కార్డును ధోనీకి కూడా పంపించాడు. తన ప్రత్యేకమైన రోజులో పాల్గొనాలని ఈ టీమిండియా మాజీ సారథిని ఆహ్వానించాడు.

ఇదీ చూడండి:- MS Dhoni Tears : చివరి ఓవర్​లో ధోనీ టెన్షన్.. టెన్షన్.. గెలిచాక కన్నీళ్లు

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్​ చేశాడు. "సీఎస్​కే #యెల్లోలవ్​. దీనికి ముగింపు ఉండదు. ఛత్తీస్​గఢ్​లో ఓ ధోనీ ఫ్యాన్​.. తన పెళ్లి కార్డుపై ధోనీ ఫొటోతో పాటు జెర్సీ నెంబర్​ని కూడా ముద్రించాడు. చెన్నైసూపర్​ కింగ్స్​ సారథిని పెళ్లికి పిలిచాడు," అని క్యాప్షన్​ ఇచ్చాడు.

సోషల్​ మీడియాలో వైరల్​ అయిన ఫొటోను ఇక్కడ చూడండి.

ధోనీకి సర్జరీ..

MS Dhoni latest news : ముంబైలోని ఓ ఆసుపత్రిలో గత గురువారం ధోనీకి సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతమైనందని వైద్యులు తెలిపారు. అయితే కొన్ని రోజుల పాటు ధోనీకి విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. సోమవారం.. ఐపీఎల్​ కప్​ గెలిచిన అనంతరం.. అహ్మదాబాద్​ నుంచి ముంబైకి వెళ్లిన ధోనీ.. మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం