తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kapil Dev On India Schedule: వరల్డ్ కప్‌లో ఇండియా షెడ్యూల్ చెత్తగా ఉంది: కపిల్ దేవ్

Kapil Dev on India Schedule: వరల్డ్ కప్‌లో ఇండియా షెడ్యూల్ చెత్తగా ఉంది: కపిల్ దేవ్

Hari Prasad S HT Telugu

02 August 2023, 16:34 IST

google News
    • Kapil Dev on India Schedule: వరల్డ్ కప్‌లో ఇండియా షెడ్యూల్ చెత్తగా ఉందని అన్నాడు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. ఇండియా లీగ్ మ్యాచ్ లను ఏకంగా 9 వేదికల్లో ఆడాల్సి రావడంపై కపిల్ మండిపడ్డాడు.
కపిల్ దేవ్
కపిల్ దేవ్ (PTI)

కపిల్ దేవ్

Kapil Dev on India Schedule: వన్డే వరల్డ్ కప్ లో ఇండియా షెడ్యూల్ పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసహనం వ్యక్తం చేశాడు. అసలు ఎవరు వేశారీ షెడ్యూల్ అంటూ మండిపడ్డాడు. అయితే ఇండియా ఫైనల్ చేరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫైనల్ అడ్డంకిని అధిగమిస్తే కప్పు సొంతమవుతుందని కపిల్ అభిప్రాయపడ్డాడు.

2023 వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా లీగ్ స్టేజ్ లో ఆడే 9 మ్యాచ్ లు 9 వేదికల్లో జరగనున్నాయి. దీనిపై నిజానికి కొందరు ఇతర మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు కపిల్ కూడా అదే అంటున్నాడు. టోర్నీ సమయంలో ఇండియన్ ప్లేయర్స్ ప్రయాణించడానికి బీసీసీఐ చార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేశాడు.

"ఇండియా 11 మ్యాచ్ లు ఆడుతోంది. కానీ దాని కోసం వాళ్లు చేసే ప్రయణాలు చాలా ఉన్నాయి. అసలు ఎవరు తయారు చేశారీ షెడ్యూల్? ధర్మశాలకు వెళ్లి అక్కడి నుంచి బెంగళూరుకు, కోల్‌కతాకు.. 9 ప్రాంతాల్లో ఆడాలి" అని ది వీక్ తో మాట్లాడుతూ కపిల్ అన్నాడు. పదేళ్ల ఐసీసీ ట్రోఫీ కరువును ఈసారైనా ఇండియా తీరుస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఫైనల్ అడ్డంకిని అధిగమించాల్సి ఉందని అన్నాడు.

"ఇప్పటికీ టీమ్ బాగానే ఆడుతోంది. ఫైనల్స్, సెమీఫైనల్స్ కు చేరుతున్నారు. ఫైనల్ అడ్డంకిని అధిగమించాల్సి ఉంది" అని కపిల్ అన్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడుతుంది. వరల్డ్ కప్ వేదికల్లో ఒక్క హైదరాబాద్ మినహా మిగిలిన 9 వేదికల్లో ఇండియా ఆడాల్సి ఉంది.

తదుపరి వ్యాసం