Harmanpreet suspension: హర్మన్‌ప్రీత్‌కు బీసీసీఐ క్లాస్.. రంగంలోకి ఆ ఇద్దరు-cricket news laxman and roger binny to counsel harmanpreet ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harmanpreet Suspension: హర్మన్‌ప్రీత్‌కు బీసీసీఐ క్లాస్.. రంగంలోకి ఆ ఇద్దరు

Harmanpreet suspension: హర్మన్‌ప్రీత్‌కు బీసీసీఐ క్లాస్.. రంగంలోకి ఆ ఇద్దరు

Hari Prasad S HT Telugu
Jul 28, 2023 03:20 PM IST

Harmanpreet suspension: హర్మన్‌ప్రీత్‌కు బీసీసీఐ క్లాస్ తీసుకోవడానికి సిద్ధమైంది. దీనికోసం బోర్డు ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఎన్సీఏ డైరెక్టర్ లక్ష్మణ్ లకు బాధ్యత అప్పగించారు.

హర్మన్ ప్రీత్ కౌర్, జై షా
హర్మన్ ప్రీత్ కౌర్, జై షా

Harmanpreet suspension: ఇండియన్ వుమెన్స్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కు క్లాస్ తీసుకోనుంది బీసీసీఐ. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డేలో హర్మన్ వ్యవహరించిన తీరు ఇండియన్ క్రికెట్ కు తలవంపులు తీసుకొచ్చింది. అంపైర్ల తీరును తప్పుబడుతూ స్టంప్స్ ను బ్యాట్ తో కొట్టడం, వాళ్లను పబ్లిగ్గా విమర్శించి హేళన చేసినట్లు మాట్లాడటంపై ఇప్పటికే ఐసీసీ సీరియస్ అయింది.

ఆమెను రెండు వన్డేలపాటు నిషేధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బీసీసీఐ కూడా హర్మన్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ క్రికెటర్లు కూడా డిమాండ్ చేశారు. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ లు రంగంలోకి దిగారు. హర్మన్ తో మాట్లాడే బాధ్యతను వాళ్లకు అప్పగించినట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు.

ఈ ఘటన జరిగి ఐదు రోజులు అవుతున్నా.. ఇన్నాళ్లూ బీసీసీఐ దీనిపై స్పందించలేదు. అయితే తాజాగా శుక్రవారం (జులై 28) మీడియాతో మాట్లాడిన సెక్రటరీ జై షా.. హర్మన్ అంశంపై మాట్లాడారు. బోర్డు ఆదేశాల మేరకు రోజర్ బిన్నీ, లక్ష్మణ్.. రానున్న రోజుల్లో హర్మన్ తో మాట్లాడతారని జై షా చెప్పారు. ఆ తర్వాత బోర్డు తరఫున హర్మన్ పై ఏవైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది తేలనుంది.

ఇప్పటికే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1, లెవల్ 2 తప్పిదాలు చేసిన కారణంగా హర్మన్ కు ఐసీసీ 75 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించడంతోపాటు నాలుగు డీమెరిట్ పాయింట్లు కేటాయించడంతో ఆమెపై రెండు వన్డేల నిషేధం పడింది. దీంతో ఏషియన్ గేమ్స్ లో ఇండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్ లకు హర్మన్ దూరం కానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం