Jadeja On Kapil Dev : అహంకారమా.. మాకా? కపిల్​ దేవ్​కు జడేజా కౌంటర్-cricket news ind vs wi ravindra jadeja counter to kapil dev comments over team india players ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Jadeja On Kapil Dev : అహంకారమా.. మాకా? కపిల్​ దేవ్​కు జడేజా కౌంటర్

Jadeja On Kapil Dev : అహంకారమా.. మాకా? కపిల్​ దేవ్​కు జడేజా కౌంటర్

Anand Sai HT Telugu
Aug 01, 2023 12:28 PM IST

IND vs WI : వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మాజీ ఆటగాడు కపిల్ దేవ్ సైతం.. విమర్శలు చేయగా.. తాజాగా రవీంద్ర జడేజా కౌంటర్ ఇచ్చాడు.

రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా (REUTERS)

భారత్‌లో ప్రపంచకప్‌(World Cup)కు మరో 2 నెలల సమయం మాత్రమే ఉంది. కానీ ప్రపంచకప్ సిరీస్‌కు కూడా అర్హత సాధించని వెస్టిండీస్ జట్టుతో భారత జట్టు(India Vs West Indies) ఓడిపోయింది. అంతే కాకుండా బుమ్రా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ తదితర భారత ఆటగాళ్లు గాయపడడం పెద్ద ఎదురుదెబ్బ. ఇలాంటి వాటితో చాలా మంది భారత జట్టు(Team India)పై విమర్శలు చేస్తున్నారు. ఏవేవో ప్రయోగాలు చేసి.. టీమిండియా ఓటమి పాలవుతుందని అంటున్నారు.

భారత జట్టు ప్రదర్శనపై మాజీ ఆటగాడు కపిల్ దేవ్(Kapil Dev) విమర్శలు గుప్పించాడు. భారత ఆటగాళ్లు ఐపీఎల్‌తో సహా సిరీస్‌లలో ఆడడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తారని పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లకు అహం, అహంకారం పెరిగిపోయాయని కామెంట్స్ చేశాడు. తమకే అన్నీ తెలుసని గర్వపడతారని విమర్శించాడు.

'చిన్న గాయంతో ఐపీఎల్ సిరీస్‌లో ఆడే భారత ఆటగాళ్లు చిన్న గాయంతో భారత జట్టుకు ఆడరు. ఐపీఎల్ సిరీస్‌కు ఇచ్చే ప్రాముఖ్యతను భారత జట్టుకు ఇవ్వాలి.' అని వ్యాఖ్యానించాడు కపిల్ దేవ్. ఆయన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

కపిల్ దేవ్ కామెంట్స్(Kapil Dev Comments) మీద.. స్పందించాడు రవీంద్ర జడేజా(Ravindra Jadeja). 'మేము అలాంటి వాటి కోసం వెతకం. కపిల్ దేవ్ ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. మాజీ ఆటగాడిగా కపిల్ దేవ్‌కు తన అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది. కానీ కపిల్ దేవ్ చెప్పినట్లుగా, భారత ఆటగాళ్లలో ఎవరికీ అహం లేదా అహంకారం లేదు. భారత ఆటగాళ్లంతా బాగా ఆడుతున్నారు. దానికోసం తీవ్రంగా శ్రమిస్తున్నాం.' అని జడేజా చెప్పుకొచ్చాడు.

తాము ట్రైనింగ్లో చురుకుగా పాల్గొంటున్నామని తెలిపాడు జడేజా. 'ఎవరూ దేన్నీ పెద్దగా పట్టించుకోరు. ప్రతి క్రీడాకారుడు మైదానంలో 100 శాతం ప్రదర్శన ఇస్తాడు. భారత జట్టు ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. భారత జట్టు మెరుగైన ఆటగాళ్లతో మెరుగైన జట్టుగా పని చేస్తోంది. మేం భారత్ తరఫున ఆడుతున్నాం. అది ఒక్కటే మా లక్ష్యం.' అని జడేజా కామెంట్స్ చేశాడు. జడేజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

Whats_app_banner