తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022 Day 8 Live Updates: రెజ్లింగ్‌లో బజరంగ్‌కు స్వర్ణం.. అన్షూకు రజతం
బజరంగ్ పునియాకు గోల్డ్
బజరంగ్ పునియాకు గోల్డ్ (PTI)

CWG 2022 Day 8 Live Updates: రెజ్లింగ్‌లో బజరంగ్‌కు స్వర్ణం.. అన్షూకు రజతం

05 August 2022, 22:47 IST

  • CWG 2022 Day 8 Live Updates: కామన్వెల్త్‌ గేమ్స్‌ ఎనిమిదో రోజు కూడా ఇండియన్ అథ్లెట్లు జోరు కొనసాగిస్తున్నారు. టేబుల్ టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో రెండు భారత జోడీలు క్వార్టర్స్ చేరగా.. రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా ఈజీగా గెలిచి క్వార్టర్స్ లో అడుగుపెట్టాడు.

05 August 2022, 22:45 IST

అన్షూ మాలిక్‌కు రజతం

21 ఏళ్ల అన్షూ మాలిక్‌ రజతాన్ని సాధించింది. మహిళల 57 కేజీల విభాగంలో నైజిరియా క్రీడాకారిణి ఒడునాయో ఫోలాసేడ్ చేతిలో 4-8 తేడాతో ఓటమి పాలైంది.

05 August 2022, 22:43 IST

రెజ్లింగ్‌లో బజరంగ్‌ పునియాకు స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. ఈ పోటీల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి గోల్డ్‌ను బజరంగ్ పునియా సాధించాడు. కెనడాకు చెందిన మెక్ నీల్‌పై 9-2 తేడాతో విజయం సాధించాడు. 21 ఏళ్ల కెనడియన్ యువకుడు.. బజరంగ్ ధాటికి తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. ఫలితంగా కామన్వెల్త్‌లో తన మూడో పతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు బజరంగ్

05 August 2022, 21:23 IST

టేబుల్ టెన్నీస్‌లో శరత్ కమల్-శ్రీజ ఆకుల జోడీ సెమీస్‌కు

కామన్వెల్త్ గేమ్స్‌లో టేబుల్ టెన్నీస్‌లో మిక్స్‌డ్ డబుల్ జోడీ శరత్ కమల్, శ్రీజ ఆకుల సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌కు చెందిన పిచ్‌పోర్డ్-హో టిన్ టిన‌్‌పై విజయం సాధించారు. మూడో గేమ్ 9-9 తేడాతో టై అయినప్పటికీ చివరకు విజయాన్ని సొంతం చేసుకున్నారు.

05 August 2022, 20:04 IST

రెజ్లింగ్ లో 4 పతకాలు ఖాయం

రెజ్లింగ్‌లో భారత్‌కు కనీసం నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. దీపక్ పునియా, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, అన్షు ఫైనల్‌కు చేరారు. దీంతో కనీసం నాలుగు రజతాలు కన్ఫార్మ్ అయ్యాయి.

05 August 2022, 20:01 IST

పతకం ఖాయం చేసిన బజరంగ్ పునియా

పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్ పునియా భారత్‌కు పతకాన్ని ఖాయం చేశాడు. టెక్నికల్ సుపరియారిటీ కారణంగా జార్జ్ రమ్‌పై విజయం సాధించాడు. ఫలితంగా భారత్‌కు కనీసం ఓ పతకాన్ని కన్ఫార్మ్ చేశాడు. మరోపక్క దీపక్ పునియా కూడా రెజ్లింగ్‌ 86 కేజీల విభాగంలో ఫైనల్ చేరాడు. కెనడాకు చెందిన మూర్‌పై విజయం సాధించాడు.

05 August 2022, 19:25 IST

Badminton: క్వార్టర్స్‌కు చేరిన పీవీ సింధు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌కు చేరింది. ప్రీ క్వార్టర్స్‌లో ఉగాండాకు చెందిన హుసినా కోబుగాబేపై 21-10, 21-9 తేడాతో విజయం సాధించింది. సునాయసంగా గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది తెలుగు తేజం.

05 August 2022, 19:18 IST

Wrestling: సెమీస్‌కు దూసుకెళ్లిన దీపక్ పునియా

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. పురుషుల 86 కేజీల విభాగంలో దీపక్ పునియా సెమీస్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో సియర్రా లియోన్ కు చెందిన షేకు కాసేగ్బామాను ఓడించి సెమీస్ చేరాడు.

05 August 2022, 19:10 IST

సెమీస్‌కు దూసుకెళ్లిన సాక్షి మాలిక్

రియో ఒలింపిక్స్ కాంస్య పతక గ్రహీత సాక్షి మాలిక్ కామన్వెల్త్ 2022లో సెమీస్‌కు దూసుకెళ్లింది. మహిళల 62 కేజీల విభాగంలో ఈ రెజ్లర్ క్వార్టర్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన కెల్సీ బార్న్స్ పై 10-0 తేడాతో విజయం సాధించింది.

05 August 2022, 17:20 IST

Athletics: లాంగ్ జంపర్ యాన్సీ సోజన్ నిష్క్రమణ

అథ్లెటిక్స్ భారత లాంగ్ జంపర్ యాన్సీ సోజన్ పోరు ముగిసింది. లాంగ్ జంప్ ఫైనల్లో ఈమె 6.25 మీటర్లు దూకి 13వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఈ కేరళ అథ్లెట్ కామన్వెల్త్ పోటీల నుంచి నిష్క్రమించింది.

05 August 2022, 16:34 IST

Athletics: అథ్లెటిక్స్ 4X400 రిలే ఫైనల్‌లో భారత పురుషుల జట్టు

భారత అథ్లెట్లు సరికొత్త ఆసియా రికార్డును సృష్టించారు. 4X400 రిలే జట్టు 3.00.25 సెకన్లతో అదిరిపయే రికార్డును కైవసం చేసుకున్నారు. పురుషుల రిలే జట్టు ఈ ఘనతతో ఫైనల్‌ పోటీకి అర్హత సాధించింది.

05 August 2022, 15:45 IST

CWG 2022 Day 8 Live Updates: దీపక్‌ పూనియా కూడా క్వార్టర్స్‌లోకి..

అటు మరో ఇండియన్‌ రెజ్లర్‌ దీపక్‌ పూనియా కూడా క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. పురుషుల 86 కేజీల కేటగిరీలో న్యూజిలాండ్‌ ప్రత్యర్థిపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన దీపక్‌ను రిఫరీ విజేతగా తేల్చాడు.

05 August 2022, 15:27 IST

CWG 2022 Day 8 Live Updates: క్వార్టర్‌ఫైనల్లో బజరంగ్‌ పూనియా

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇండియన్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా తొలి రౌండ్‌లో సులువుగా గెలిచాడు. పురుషుల 65 కేజీల విభాగంలో అతడు నౌరుకు చెందిన లోవె బింగామ్‌పై 4-0తో గెలిచి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు.

05 August 2022, 14:33 IST

CWG 2022 Day 8 Live Updates: శరత్‌, శ్రీజా జోడీ కూడా క్వార్టర్స్‌లో..

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మరో మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ శరత్‌ కమల్, ఆకుల శ్రీజా జోడీ కూడా ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించింది. మలేసియాకు చెందిన లియాంగ్‌ చీ, యో యింగ్‌పై 3-1 గేమ్స్‌ తేడాతో శరత్‌, శ్రీజా జోడీ విజయం సాధించింది.

05 August 2022, 14:30 IST

CWG 2022 Day 8 Live Updates: టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో మనికా, సత్యన్‌

కామన్వెల్త్‌ గేమ్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ కేటగిరీలో మనికా బాత్రా, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్‌ చేరింది. నైజీరియా జోడీ ఒమటాయో, ఒజోమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 11-7, 11-6, 11-7 తేడాతో మనికా, సత్యన్‌ జోడీ గెలిచింది.

05 August 2022, 12:51 IST

CWG 2022 Day 8 Live Updates: 20 మెడల్స్‌తో ఏడో స్థానంలో ఇండియా

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఏడు రోజులు ముగిసే సమయానికి ఇండియా 20 మెడల్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇందులో ఆరు గోల్డ్‌ మెడల్స్‌, ఏడు సిల్వర్‌, ఏడు బ్రాంజ్‌ మెడల్స్‌ ఉన్నాయి. గోల్డ్‌ మెడల్స్‌లో మూడు వెయిట్‌లిఫ్టింగ్, ఒకటి లాన్‌ బౌల్స్‌, ఒకటి పవర్‌ లిఫ్టింగ్‌, ఒకటి టేబుల్‌ టెన్నిస్‌లలో వచ్చాయి.

05 August 2022, 12:26 IST

CWG 2022 Day 8 Live Updates: 8వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే

అథ్లెటిక్స్‌

వుమెన్స్‌ 100 మీ. హర్డిల్స్‌ రౌండ్‌ 1 హీట్‌ 2 - జ్యోతి యర్రాజి (మధ్యాహ్నం 3.06)

వుమెన్స్‌ లాంగ్‌ జంప్‌ క్వాలిఫయింగ్ రౌండ్‌ గ్రూప్‌ ఎ - ఆన్సీ సోజన్‌ ఎడప్పిల్లి (సాయంత్రం 4.10)

మెన్స్‌ 4x400 మీ. రిలే రౌండ్‌ 1 హీట్‌ 2: సాయంత్రం 4.19

వుమెన్స్‌ 200 మీ. సెమీఫైనల్‌ 2- హిమదాస్‌ (అర్ధరాత్రి 12.53)

టేబుల్‌ టెన్నిస్‌

మిక్స్‌డ్‌ డబుల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16 (మధ్యాహ్నం 2 నుంచి) - సత్యన్‌ జ్ఞానశేఖరన్‌/మనికా బాత్రా, శరత్‌ కమల్‌/ఆకుల శ్రీజ

వుమెన్స్‌ సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16 (మధ్యాహ్నం 3.15 నుంచి) - రీత్‌ టెన్నిసన్‌, శ్రీజా ఆకుల, మనికా బాత్రా

మెన్స్‌ డబుల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16 (మధ్యాహ్నం 3.55 నుంచి) - హర్మీత్‌ దేశాయ్‌/సనీల్‌ శెట్టి

వుమెన్స్‌ డబుల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16 (సాయంత్రం 4.30 నుంచి) - మనికా బాత్రా/దియా పరాగ్‌, ఆకుల శ్రీజ/రీత్‌ టెన్నిసన్‌

మెన్స్‌ సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 32 - శరత్‌ కమల్‌, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌, సనీల్‌ శెట్టి

బ్యాడ్మింటన్‌ (మధ్యాహ్నం 3.30 నుంచి)

వుమెన్స్‌ డబుల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16: జాలీ ట్రీసా/పుల్లెల గాయత్రి గోపీచంద్‌

మెన్స్‌ డబుల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16: సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి/చిరాగ్‌ శెట్టి

వుమెన్స్‌ సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16: పీవీ సింధు

వుమెన్స్‌ సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16: ఆకర్షి కశ్యప్‌

మెన్స్‌ సింగిల్స్‌ రౌండ్ ఆఫ్‌ 16: కిదాంబి శ్రీకాంత్‌

లాన్‌ బౌల్స్‌

వుమెన్స్‌ పెయిర్‌ క్వార్టర్‌ఫైనల్స్‌: ఇండియా vs ఇంగ్లండ్‌ - మధ్యాహ్నం 1

స్క్వాష్‌

మెన్స్‌ డబుల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 16: వేలవన్‌ సెంథిల్‌కుమార్‌/అభయ్‌ సింగ్‌ - సాయంత్రం 5.15

మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌: దీపికా పల్లికల్‌/సౌరవ్‌ ఘోషల్‌ - అర్ధరాత్రి 12 గంటలకు

హాకీ

వుమెన్స్‌ సెమీఫైనల్‌: ఇండియా vs ఆస్ట్రేలియా - రాత్రి 10.30

రెజ్లింగ్‌ (మధ్యాహ్నం 3.30 నుంచి)

మెన్స్‌ ఫ్రీస్టైల్‌ 125 కేజీ: మోహిత్‌ గ్రేవాల్‌

మెన్స్‌ ఫ్రీస్టైల్‌ 65 కేజీ: బజరంగ్ పూనియా

మెన్స్‌ ఫ్రీస్టైల్‌ 86 కేజీ: దీపక్‌ పూనియా

వుమెన్స్ ఫ్రీస్టైల్‌ 57 కేజీ: అన్షు మాలిక్‌

వుమెన్స్‌ ఫ్రీస్టైల్‌ 68 కేజీ: దివ్యా కాక్రన్‌

వుమెన్స్‌ ఫ్రీస్టైల్ 62 కేజీ: సాక్షి మాలిక్‌

    ఆర్టికల్ షేర్ చేయండి