తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cwg 2022 Day 11 Live Updates: 22 గోల్డ్ మెడల్స్.. నాలుగోస్థానంతో ముగించిన ఇండియా
ఇండియాకు చివరి రోజు మూడో బ్యాడ్మింటన్ గోల్డ్ అందించిన సాత్విక్, చిరాగ్ జోడీ
ఇండియాకు చివరి రోజు మూడో బ్యాడ్మింటన్ గోల్డ్ అందించిన సాత్విక్, చిరాగ్ జోడీ (AP)

CWG 2022 Day 11 Live Updates: 22 గోల్డ్ మెడల్స్.. నాలుగోస్థానంతో ముగించిన ఇండియా

08 August 2022, 20:39 IST

CWG 2022 Day 11 Live Updates: కామన్వెల్త్ గేమ్స్ 2022ను నాలుగో స్థానంతో ముగించింది ఇండియా. మొత్తం 61 మెడల్స్ సాధించింది. అందులో 22 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 2018లో 66 మెడల్స్ తో మూడోస్థానంలో నిలవగా.. ఈసారి 5 మెడల్స్ తక్కువగా వచ్చాయి. 

08 August 2022, 20:39 IST

CWG 2022 Day 11 Live Updates: నాలుగోస్థానంలో ఇండియా

కామన్వెల్త్ గేమ్స్ 2022 మెడల్స్ టేబుల్లో ఇండియా 61 మెడల్స్ తో నాలుగోస్థానంలో నిలిచింది. చివరి రోజు 4 గోల్డ్ మెడల్స్ రావడంతో మొత్తం పసిడి పతకాల సంఖ్య 22కి చేరింది.

08 August 2022, 18:36 IST

CWG 2022 Day 11 Live Updates: ఫైనల్లో చిత్తుగా ఓడిన మెన్స్ హాకీ టీమ్

కామన్వెల్త్ గేమ్స్ హాకీలో గోల్డ్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందనుకున్న మెన్స్ హాకీ టీమ్ సిల్వర్ తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఏకంగా 0-7 గోల్స్ తేడాతో చిత్తుగా ఓడింది. 

08 August 2022, 17:52 IST

CWG 2022 Day 11 Live Updates: ఇండియాకు మూడో బ్యాడ్మింటన్ గోల్డ్ మెడల్

బ్యాడ్మింటన్ లో కామన్వెల్త్ గేమ్స్ చివరి రోజు ఇండియాకు మూడో గోల్డ్ మెడల్ వచ్చింది. పురుషుల డబుల్స్ లో ఇండియాకు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఫైనల్లో ఇంగ్లండ్ కు చెందిన బెన్ లేన్, సీన్ వెండీలపై 21-15, 21-13తో గెలిచారు.

08 August 2022, 17:33 IST

CWG 2022 Day 11 Live Updates: బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ లో ఇండియా లీడ్

కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ లోనూ ఇండియాకు మరో గోల్డ్ మెడల్ వచ్చేలా ఉంది. పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి జోడీ 21-15తో తొలి గేమ్ గెలిచింది. రెండో గేమ్ లోనూ ఆధిక్యంలో కొనసాగుతోంది.

08 August 2022, 17:28 IST

CWG 2022 Day 11 Live Updates: హాకీ ఫైనల్లో వెనుకబడిన ఇండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న పురుషుల హాకీ ఫైనల్ తొలి క్వార్టర్ లో ఇండియా 0-2తో వెనుకబడింది. ఆస్ట్రేలియా తరఫున నేథన్, బ్లేక్ చెరొక గోల్ చేశారు.

08 August 2022, 16:35 IST

CWG 2022 Day 11 Live Updates: గోల్డ్ మెడల్ గెలిచిన లక్ష్యసేన్

కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో కూడా ఇండియాకు గోల్డ్ మెడల్ దక్కింది. ఫైనల్లో లక్ష్యసేన్ 19-21, 21-9, 21-16 తేడాతో మలేషియా ప్రత్యర్థి యాంగ్ పై గెలిచి పసిడి అందుకున్నాడు.

08 August 2022, 16:25 IST

CWG 2022 Day 11 Live Updates: మూడో గేమ్ లోనూ ఆధిక్యంలో లక్ష్యసేన్

బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్ అందించేలా ఉన్నాడు లక్ష్యసేన్. ఫైనల్లో తొలి గేమ్ ఓడినా తర్వాత పుంజుకున్న అతడు రెండో గేమ్ గెలిచాడు. మూడో గేమ్ లో 11-7తో ఆధిక్యంలో ఉన్నాడు.

08 August 2022, 16:18 IST

CWG 2022 Day 11 Live Updates: రెండో గేమ్ లో గెలిచిన లక్ష్యసేన్

గోల్డ్ మెడల్ మ్యాచ్ రెండో గేమ్ లో లక్ష్యసేన్ పుంజుకున్నాడు. అతడు రెండో గేమ్‌ లోనూ 6-8తో వెనుకబడినా.. తర్వాత 21-19తో గేమ్ ఎగరేసుకుపోవడం విశేషం.

08 August 2022, 15:50 IST

CWG 2022 Day 11 Live Updates: తొలి గేమ్ లో ఓడిపోయిన లక్ష్యసేన్

కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో తొలి గేమ్ ఓడిపోయాడు లక్ష్యసేన్. అతడు మలేసియాకు చెందిన ప్రత్యర్థి యాంగ్ తో తొలి గేమ్ లో గట్టిగానే పోరాడినా.. 19-21 తేడాతో కోల్పోయాడు.

08 August 2022, 15:40 IST

CWG 2022 Day 11 Live Updates: తొలి గేమ్ లో వెనుకబడిన లక్ష్యసేన్

కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో గోల్డ్ మెడల్ పై కన్నేసిన లక్ష్యసేన్.. తొలి గేమ్ లో వెనుకబడ్డాడు. అతడు 15-17 తేడాతో ప్రత్యర్థి యాంగ్ కంటే కాస్త వెనుక ఉన్నాడు.

08 August 2022, 14:48 IST

CWG 2022 Day 11 Live Updates: గోల్డ్ గెలిచిన పీవీ సింధు

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2022లో ఇండియా గోల్డ్‌ మెడల్స్‌ సంఖ్య 19కి చేరింది. బ్యాడ్మింటన్‌ వుమెన్ సింగిల్స్‌లో పీవీ సింధు గోల్డ్‌ గెలిచింది. ఆమె ఫైనల్లో కెనడాకు చెందిన మిషెలీ లీపై 21-15, 21-13 తేడాతో సులువుగా గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్‌ సింగిల్స్‌లో సింధు గోల్డ్‌ గెలవడం ఇదే తొలిసారి.

08 August 2022, 14:45 IST

CWG 2022 Day 11 Live Updates: రెండో గేమ్ ఆధిక్యంలో పీవీ సింధు

తొలి గేమ్ గెలిచిన పీవీ సింధు.. రెండో గేమ్‌ లోనూ 11-6 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఈ గేమ్స్ లో తన తొలి సింగిల్స్ గోల్డ్ మెడల్ గెలిచే దిశగా వెళ్తోంది.

08 August 2022, 14:26 IST

CWG 2022 Day 11 Live Updates: తొలి గేమ్‌ గెలిచిన పీవీ సింధు

కామన్వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో గోల్డ్‌పై కన్నేసిన పీవీ సింధు.. తొలి గేమ్‌ గెలిచింది. మిషెలీ లీతో జరుగుతున్న ఫైనల్లో 21-15 తేడాతో ఆమె తొలి గేమ్ గెలిచి మెడల్‌ వైపు మరో అడుగు ముందుకేసింది.

08 August 2022, 14:17 IST

ఆధిక్యంలో సింధు

బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ తొలి గేమ్ లో  సింధు కెనడా ప్లేయర్ మిచెల్లీ లీపై ప్రస్తుతం 11- 8 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. 

08 August 2022, 12:49 IST

సింధు గోల్డ్ మెడల్ గెలుస్తుందా? 

కామన్వెల్త్ ఉమెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్ లో ఫైనల్ చేరిన సింధు నేడు కెనెడా ప్లేయర్ మిచెల్లే లీ తో తుది పోరుకు సిద్ధమైంది. గత కామన్వెల్త్ గేమ్స్ లో  సిల్వర్, బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న సింధు ఈ సారి గోల్డ్ మెడల్ సాధించి తన కలను నెరవేర్చుకోవాలని బరిలో దిగుతుంది.

08 August 2022, 11:59 IST

కామ‌న్వెల్త్ గేమ్స్ 11వ రోజు ఇండియా షెడ్యూల్

బ్యాడ్మింటన్

ఉమెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.20)

పీవీ సింధు

మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 2.10 )

లక్ష్య సేన్

మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3 గంటలకు)

సాత్విక్ సాయి రాజ్, చిరాగ్ శెట్టి

హాకీ సాయంత్రం (5 గంటల నుంచి ప్రారంభం)

మెన్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా

టేబుల్ టెన్నిస్

మెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35)

జి.సత్యన్

మెన్స్ సింగిల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ సాయంత్రం 4.25

ఆచంట శరత్ కమల్

    ఆర్టికల్ షేర్ చేయండి