తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India Vs Pakistan Live Updates: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇండియా..
ఇండియాను గెలిపించిన జడేజా, హార్దిక్ పాండ్యా
ఇండియాను గెలిపించిన జడేజా, హార్దిక్ పాండ్యా (AFP)

India vs Pakistan Live Updates: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇండియా..

28 August 2022, 23:37 IST

India vs Pakistan Live Updates: ఆసియా క‌ప్‌లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ 147 రన్స్ చేసింది. హార్దిక్, భువనేశ్వర్ చెలరేగారు.

28 August 2022, 23:43 IST

India vs Pakistan Live Updates: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ఇండియా.. 5 వికెట్లతో గెలుపు

ఆసియాకప్ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ ను 5 వికెట్లతో చిత్తు చేసింది టీమిండియా. 148 రన్స్ టార్గెట్ ను మరో 2 బాల్స్ మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. హార్దిక్ పాండ్యా సిక్స్ తో మ్యాచ్ ను గెలిపించాడు.

28 August 2022, 23:37 IST

India vs Pakistan Live Updates: 6 బాల్స్‌ 7 రన్స్‌.. గెలుపు బాటలో ఇండియా

పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా గెలవాలంటే చివరి ఓవర్లో 7 రన్స్ అవసరం. 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ ను ఇండియా వైపు మలుపు తిప్పాడు.

28 August 2022, 23:36 IST

India vs Pakistan Live Updates: 12 బాల్స్‌లో 21 రన్స్‌.. ఇండియాకు సవాలే

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ హోరాహోరీగా నడుస్తోంది. ఇండియా గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 21 రన్స్ అవసరం

28 August 2022, 23:11 IST

India vs Pakistan Live Updates: రంజుగా సాగుతున్న మ్యాచ్‌.. టార్గెట్‌ 24 బాల్స్‌లో 41 రన్స్‌

ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ రంజుగా సాగుతోంది. ఇండియా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంకా 24 బాల్స్‌లో 41 రన్స్‌ చేయాల్సి ఉంది. జడేజా, పాండ్యా క్రీజులో ఉన్నారు.

28 August 2022, 23:00 IST

India vs Pakistan Live Updates: కష్టాల్లో టీమిండియా.. సూర్యకుమార్‌ కూడా ఔట్‌

పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సూర్యకుమార్‌ (18) కూడా ఔటయ్యాడు. దీంతో 89 రన్స్‌ దగ్గర 4వ వికెట్‌ కోల్పోయింది. విజయానికి ఇంకా 34 బాల్స్‌లోనే 59 రన్స్‌ అవసరం.

28 August 2022, 22:57 IST

India vs Pakistan Live Updates: 14 ఓవర్లలో ఇండియా 89/3.. విజయానికి ఇంకా 59 రన్స్‌

పాకిస్థాన్ పై ఇండియా పోరాడుతోంది. 148 రన్స్ చేజింగ్ లో 14 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లకు 89 రన్స్ చేసింది. విజయానికి ఇంకా 6 ఓవర్లలో 59 రన్స్ అవసరం.

28 August 2022, 22:49 IST

India vs Pakistan Live Updates: 13 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా 83/3

పాకిస్థాన్‌పై చేజింగ్‌లో ఇండియా 13 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లకు 83 రన్స్‌ చేసింది. జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులో ఉన్నారు.

28 August 2022, 22:36 IST

India vs Pakistan Live Updates: 10 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 62/3

పాకిస్థాన్‌పై 148 రన్స్‌ చేజింగ్‌లో ఇండియా తడబడుతోంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లకు 62 రన్స్‌ చేసింది. ఇప్పటికే సీనియర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (0), రోహిత్‌ శర్మ (12), విరాట్ కోహ్లి (35) ఔటయ్యారు.

28 August 2022, 22:30 IST

India vs Pakistan Live Updates: టీమిండియాకు షాక్‌.. విరాట్ కోహ్లి కూడా ఔట్‌

టీమిండియాకు పెద్ద షాక్‌ తగిలింది. మంచి ఫామ్‌లో కనిపించిన విరాట్ కోహ్లి 35 రన్స్‌ చేసి ఔటయ్యాడు. నవాజ్‌ బౌలింగ్‌లో కోహ్లి ఇఫ్తికార్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

28 August 2022, 22:25 IST

India vs Pakistan Live Updates: రోహిత్‌ శర్మ ఔట్‌.. 8 ఓవర్లలో ఇండియా 50/2

పాకిస్థాన్‌పై 148 రన్స్‌ చేజింగ్‌లో ఇండియా రెండో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ 12 రన్స్‌ చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 8 ఓవర్లలో 2 వికెట్లకు 50 రన్స్‌ చేసింది.

28 August 2022, 22:15 IST

India vs Pakistan Live Updates: పవర్‌ ప్లేలో ఇండియా 38/1

పాకిస్థాన్‌పై టీమిండియా 148 రన్స్‌ చేజింగ్‌లో పవర్‌ ప్లే ఆరు ఓవర్ల ఆట ముగిసింది. ఇందులో ఇండియా వికెట్‌ నష్టానికి 38 రన్స్‌ చేసింది. విరాట్ కోహ్లి, రోహిత్‌ శర్మ క్రీజులో ఉన్నారు.

28 August 2022, 22:07 IST

India vs Pakistan Live Updates: విరాట్‌ కోహ్లి సిక్స్‌.. టీమిండియా 23/1

విరాట్‌ కోహ్లి సిక్స్‌ కొట్టాడు. హరీస్‌ రవూఫ్‌ వేసిన నాలుగో ఓవర్లో కోహ్లి కీపర్‌ తల మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు. దీంతో టీమిండియా 4 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 23 రన్స్‌ చేసింది.

28 August 2022, 22:01 IST

India vs Pakistan Live Updates: మూడు ఓవర్లలో ఇండియా 15/1

పాకిస్థాన్‌పై 148 రన్స్‌ చేజింగ్‌తో బరిలోకి దిగిన ఇండియా మూడు ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 15 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ డకౌటడయ్యాడు.

28 August 2022, 22:01 IST

India vs Pakistan Live Updates: కేఎల్ రాహుల్ డకౌట్.. తొలి ఓవర్లోనే షాక్

చేజింగ్ లో ఇండియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి బంతికే డకౌటయ్యాడు. నసీమ్ షా బౌలింగ్ లో రాహుల్ క్లీన్ బౌల్డయ్యాడు.

28 August 2022, 21:29 IST

India vs Pakistan Live Updates: చెలరేగిన భువీ, హార్దిక్‌ పాండ్యా.. ఇండియా టార్గెట్‌ 148

ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్‌లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 42 బాల్స్‌లో 43 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

28 August 2022, 21:07 IST

India vs Pakistan Live Updates: ఆరు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌

మిడిల్‌ ఓవర్లలో పాకిస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోతోంది. 112 రన్స్‌కే 6 వికెట్లు కోల్పోయింది. ఆసిఫ్‌ అలీ 9 రన్స్‌ చేసి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.

28 August 2022, 20:56 IST

India vs Pakistan Live Updates: హార్దిక్‌ ఆన్‌ ఫైర్‌.. ఐదు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయింది. హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఒకే ఓవర్లో రెండు కీలకమైన వికెట్లు తీసి ఇండియా పైచేయి సాధించేలా చేశాడు హార్దిక్‌ పాండ్యా.

28 August 2022, 20:53 IST

India vs Pakistan Live Updates: నాలుగో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్‌

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 96 రన్స్‌ దగ్గర నాలుగో వికెట్‌ పడింది. డేంజరస్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 43 రన్స్‌ చేసి ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్యానే ఈ వికెట్‌ కూడా తీశాడు.

28 August 2022, 20:41 IST

India vs Pakistan Live Updates: మూడో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్‌

ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 87 రన్స్‌ దగ్గర మూడో వికెట్‌ పడింది. ఇఫ్తికార్‌ అహ్మద్‌ 28 రన్స్‌ చేసి ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా వికెట్‌ తీసుకున్నాడు.

28 August 2022, 20:39 IST

India vs Pakistan Live Updates: 12 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్‌ 87/2

పాకిస్థాన్‌ మెల్లగా దూకుడు పెంచుతోంది. 12 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లకు 87 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ఇంకా క్రీజులో ఉన్నాడు.

28 August 2022, 20:10 IST

India vs Pakistan Live Updates: పవర్‌ ప్లేలో పాకిస్థాన్‌ స్కోరు 43/2

పవర్‌ ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్‌ 2 వికెట్లు కోల్పోయి 43 రన్స్‌ చేసింది. ఓపెనర్‌, కెప్టెన్‌ బాబర్‌ ఆజంతోపాటు ఫఖర్‌ జమాన్‌ ఔటయ్యారు. భువనేశ్వర్‌, అవేష్‌ ఖాన్‌ చెరొక వికెట్ తీసుకున్నారు.

28 August 2022, 20:08 IST

India vs Pakistan Live Updates: రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

పాకిస్థాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఫఖర్‌ జమాన్‌ (10) ఔటయ్యాడు. అవేష్‌ ఖాన్‌ వికెట్ తీసుకున్నాడు.

28 August 2022, 19:49 IST

India vs Pakistan Live Updates: తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్‌

పాకిస్థాన్ తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజం 10 రన్స్‌ చేసి ఔటయ్యాడు. భువనేశ్వర్‌ కుమార్‌ వికెట్‌ తీశాడు.

28 August 2022, 19:38 IST

India vs Pakistan Live Updates: తొలి ఓవర్లో పాకిస్థాన్‌ 6/0

భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్లో పాకిస్థాన్‌ 6 రన్స్‌ చేసింది. అయితే తొలి ఓవర్లోనే రెండు టీమ్స్‌ ఒక్కో రివ్యూ తీసుకున్నాయి. మహ్మద్‌ రిజ్వాన్‌ రెండుసార్లు బతికిపోయాడు. తొలిసారి పాకిస్థాన్‌ రివ్యూ సక్సెస్‌ కాగా.. రెండోసారి ఇండియా రివ్యూ ఫెయిలైంది.

28 August 2022, 19:12 IST

India vs Pakistan Live Updates: పాకిస్థాన్‌ తుది జట్టు ఇదే

బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఖుష్‌దిల్‌ షా, ఆసిఫ్‌ అలీ, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌, నసీమ్‌ షా, హరీస్ రవూఫ్‌, షానవాజ్‌ దహాని

28 August 2022, 19:10 IST

India vs Pakistan Live Updates: పాక్‌తో ఆడుతున్న టీమిండియా ఇదే

రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దినేష్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

28 August 2022, 19:04 IST

India vs Pakistan Live Updates: టాస్‌ ఇండియాదే.. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌

పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆసియా కప్‌ టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది ఇండియా. రిషబ్‌ పంత్‌ స్థానంలో దినేష్‌ కార్తీక్‌ తుది జట్టులో చోటు సంపాదించాడు. ఇక మూడో పేస్‌ బౌలర్‌గా అవేష్‌ ఖాన్‌ టీమ్‌లోకి వచ్చినట్లు కెప్టెన్‌ రోహిత్‌ చెప్పాడు.

28 August 2022, 19:00 IST

India vs Pakistan Live Updates: కోచ్‌ ద్రవిడ్‌ వచ్చేశాడు

కరోనా నుంచి కోలుకున్న హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ టీమిండియాతో చేరాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు అతడు టీమ్‌ ప్రాక్టీస్‌లో కనిపించాడు. ఇప్పటి వరకూ తాత్కాలిక కోచ్‌గా ఉన్న లక్ష్మణ్‌ నుంచి ద్రవిడ్ తిరిగి కోచ్‌ బాధ్యతలు తీసుకున్నాడు.

28 August 2022, 17:57 IST

కోహ్లి రికార్డ్ ను రోహిత్ అధిగమిస్తాడా

టీ20 క్రికెట్ లో కెప్టెన్ గా రోహిత్ ప్రస్తుతం 29 విజయాల్ని అందుకున్నాడు. అతడి కంటే ముందు ధోని 41 విజయాలు, కోహ్లి 30 విజయాలతో ఉన్నారు. కోహ్లి రికార్డ్ కు కేవలం రెండు విజయాల దూరంలోనే రోహిత్ ఉన్నాడు.

28 August 2022, 17:57 IST

ఇండియాదే ఆధిపత్యం

ఆసియా కప్ లో ఇప్పటివరకు ఇండియా, పాకిస్థాన్ 14 సార్లు తలపడ్డాయి. ఇందులో ఎనిమిది సార్లు టీమ్ ఇండియా గెలవగా ఐదు సార్లు మాత్రమే పాకిస్థాన్ విజయాన్ని సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది.

28 August 2022, 16:54 IST

రెండో టీమ్ ఇండియా ప్లేయర్ గా కోహ్లి రికార్డ్

పాకిస్థాన్ తో జ‌రుగ‌నున్న నేటి మ్యాచ్ ద్వారా టీ20 ఇంట‌ర్‌నేష‌న‌ల్ కెరీర్‌లో వంద మ్యాచ్‌ల మైలురాయిని విరాట్ కోహ్లి చేరుకోనున్నాడు. రోహిత్ శ‌ర్మ త‌ర్వాత ఈ ఘ‌న‌త‌ను సాధించిన రెండో భార‌త ప్లేయ‌ర్ గా కోహ్లి రికార్డ్‌ను సృష్టించ‌నున్నాడు.

    ఆర్టికల్ షేర్ చేయండి