తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు.. ఓ రాశివారిపై ఏలినాటి శని ప్రభావం ఉంది..

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు.. ఓ రాశివారిపై ఏలినాటి శని ప్రభావం ఉంది..

11 September 2022, 6:00 IST

    • Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అయితే ఈ వారం మీ లక్ష్యాలకు అనుకూలించే అంశాలు ఏంటో.. అనుకూలించనివి ఏంటో తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఈ వారం మీకు ఎలా ఉందో చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
ఈ వారం రాశిఫలాలు
ఈ వారం రాశిఫలాలు

ఈ వారం రాశిఫలాలు

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏం కొనాలో తెలుసుకోండి.. ఇవి కొంటె మీ లైఫ్ మారిపోతుంది

May 10, 2024, 10:38 AM

Lord Shiva: పరమేశ్వరుడికి ప్రియమైన రాశులు ఇవే.. వీరికి ఎప్పుడు శివయ్య అనుగ్రహంతో విజయం తథ్యం

May 10, 2024, 10:15 AM

ఇది శని భగవానుడు ఇస్తున్న రాజ యోగం.. ఈ రాశులకు డబ్బు, జీవితంలో ప్రశాంతత!

May 10, 2024, 06:00 AM

మే 10, రేపటి రాశి ఫలాలు.. అక్షయ తృతీయ రోజు ఎవరికి ఎలా గడుస్తుందో చూసేయండి

May 09, 2024, 08:20 PM

Kubera Favorite Rasis: కుబేరుడి ఫేవరెట్ రాశులు ఇవే.. డబ్బు కష్టాలే ఉండవు వీరికి

May 09, 2024, 05:19 PM

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ధన యోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

May 09, 2024, 10:34 AM

మేష రాశిఫలం

మేషరాశివారికి ఈవారం అనుకూలంగా లేదు. జన్మ రాహు, వాక్ స్థానమునందు కుజుని సంచారము చేత ప్రతీపనియందు సమస్యలు, ఆటంకములు అధికముగా ఉండును. గొడవలకు దూరంగా ఉండడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. మేషరాశివారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరుని, శనివారం వేంకటేశ్వరుని ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశిఫలం

వృషభరాశి వారికి ఈ వారము మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మరాశిలో కుజుని సంచారము చేత మానసిక వేదనలు, ఒత్తిడులు, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. బృహస్పతి, శని అనుకూల స్థితివలన ప్రతీ పనియందు విజయాన్ని పొందుతారు. ఈ రాశివారు శనివారం దుర్గాదేవిని ఆరాధించడం వల్ల శుభఫలితాలు ఉన్నాయి.

మిథున రాశిఫలం

మిథునరాశివారికి ఈ వారము మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అప్పులు, ఖర్చులు పెరిగే స్థితి గోచరిస్తోంది. ఆరోగ్య విషయాలపై, కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించాలి. శని వక్రియై అష్టమ స్థానమునందు సంచరించడం వలన ప్రతీ పనిలో ఆలస్యము, చికాకులు ఏర్పడును. మరింత శుభ ఫలితాలను పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయడం మంచిది.

కర్కాటక రాశిఫలం

కర్కాటక రాశివారికి ఈ వారం అనుకూలమైన శుభఫలితాలు ఉన్నాయి. ఈ రాశివారు చేసే ప్రతి పనియందు విజయము, ధనలాభము కలుగును. ప్రయాణములు అనుకూలించును. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉన్నది. సోమవారం శివాభిషేకం చేసుకోవడం ద్వారా మరిన్ని శుభఫలితాలను పొందుతారు.

సింహ రాశిఫలం

సింహరాశివారికి ఈ వారం శుభఫలితాలు ఉన్నాయి. ప్రతీపని అనుకూలిస్తుంది. జన్మరాశియందు రవి సంచారం చేత ఆరోగ్య విషయాలయందు కొంత జాగ్రత్త వహించాలి. ప్రయాణములయందు కొన్ని చికాకులు ఏర్పడవచ్చు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఇది అనుకూలమైన వారం. మరిన్ని శుభఫలితాలను పొందుటకు ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించాలి.

కన్య రాశిఫలం

కన్యారాశివారికి ఈవారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. వీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. తృతీయ స్థానమునందు కేతు సంచారము వలన ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ చుట్టుపక్కల ఉన్నవారికి మంచి చేద్దామని మీరు చేసే ప్రయత్నం వలన కొన్ని ఇబ్బందులు పొందెదరు. కన్యారాశివారు మరిన్ని శుభఫలితాల కోసం బుధవారం విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తుల రాశిఫలం

తులా రాశివారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, అర్ధాష్టమ శని, లగ్నమునందు కేతువు, అష్టమ కుజుని ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చికాకులు, సమస్యలు అధికముగా ఉంటాయి. కుటుంబమునందు ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది. ప్రతీ విషయము ఆచితూచి వ్యవహరించవలసిన సమయము ఇది. తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే మంగళవారం రోజు వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామిని, శనివారం నాడు దుర్గాదేవిని పూజించాలి.

వృశ్చిక రాశిఫలం

వృశ్చికరాశివారికి ఈవారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీపనియందు విజయము సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు పొందెదరు. కుటుంబమునందు కీర్తి పొందెదరు. వృశ్చికరాశివారు మరిన్ని శుభఫలితాలను పొందడానికి మంగళ వారం నాడు విఘ్నేశ్వరుని, గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

ధనుస్సు రాశిఫలం

ధనూరాశివారికి ఈ వారం మధ్యస్థము నుంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. శారీరక శ్రమ కొంత అధికంగా ఉండును. వాదప్రతివాదాలు పెరుగును. ధనూరాశి వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వారం ఇది. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. మరిన్ని శుభఫలితాలను పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మకర రాశిఫలం

మకర రాశివారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్య విషయములయందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు చెడు ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. మకర రాశివారు మరిన్ని శుభఫలితాలను పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం, శివాలయంలో శివునికి అభిషేకం చేసుకోవాలి.

కుంభ రాశిఫలం

కుంభరాశివారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అప్పులు పెరగడం, రావలసిన ధనం సమయానికి అందకపోవడం కొంతమేరకు కలచివేస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా లేనటువంటి సమయం. ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడి ఉన్న వారం ఇది. మరిన్ని శుభఫలితాలు పొందాలి అనుకుంటే.. శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, వెంకటేశ్వరస్వామిని పూజించాలి.

మీనం రాశిఫలం

మీనరాశివారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ప్రతీ పనియందు ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. వ్యాపారులకు కలసివచ్చే వారం. మీనరాశివారికి జన్మగురు ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడులు కలుగును. ఈ రాశివారం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురువారం నాడు దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Email : www.chilakamarthy.com

Contact : 9494981000

టాపిక్