తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని పీడ రావాలనే కోరుకోవాలట.. ఎందుకంటే

శని పీడ రావాలనే కోరుకోవాలట.. ఎందుకంటే

HT Telugu Desk HT Telugu

27 June 2023, 9:26 IST

google News
    • శని అనుగ్రహం త్వరగా ఎలా పొందాలో ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. 
శని పీడ రాకూడదని కోరుకోకూడదంట.. ఎందుకంటే
శని పీడ రాకూడదని కోరుకోకూడదంట.. ఎందుకంటే

శని పీడ రాకూడదని కోరుకోకూడదంట.. ఎందుకంటే

శనీశ్వరుడు కర్మప్రదాత. ప్రతీ మానవుడు తన జీవితంలో శని ప్రభావం చేత ఈతిబాధలను పొందాల్సిందే! అలా శని ప్రభావం ఏర్పడినప్పుడు మానవులు తమ జీవితాలలో అధ్యాత్మిక భక్తి సాధన ద్వారా ఈయొక్క బాధలను తొలగించుకోవచ్చని శాస్త్రములు తెలిపాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

లేటెస్ట్ ఫోటోలు

TG Govt Medical College Recruitment 2024 : ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 55 ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే..

Dec 17, 2024, 12:00 AM

Amritha Aiyer: అల్లరి నరేశ్ సినిమాపై ఆశలు పెట్టుకున్న హనుమాన్ హీరోయిన్.. హాట్ ఫొటోలు

Dec 16, 2024, 09:49 PM

Jupiter Transit: కొత్త ఏడాది బృహస్పతి వల్ల ఈ 3 రాశుల వారికి విపరీతంగా కలిసొస్తుంది, జీవితంలో అంతా ఆనందమే

Dec 16, 2024, 07:59 PM

12 ఏళ తర్వాత ఈ రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం.. 2025లో వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులతో ధన వర్షం!

Dec 16, 2024, 07:37 PM

Chandrababu And Pawan: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీ..నాగబాబుకు ఇచ్చే శాఖ సహా కీలక అంశాలపై చర్చ

Dec 16, 2024, 07:01 PM

Sankranthi Cock Fights : సంక్రాంతి బరిలో పందెం కోళ్లు, నెల్లూరులో పెంచి గోదావ‌రి జిల్లాల్లో అమ్మకం

Dec 16, 2024, 05:20 PM

సాధారణంగా ప్రతీ మానవుడు శనీశ్వరుని వలన ఇబ్బందికి లోనవుతాడు. ఆయన పేరు వింటే భయపడిపోతారు. తమ జాతకంలో శని ప్రభావం ఉండకూడదని కోరుకుంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే జనాల్లో ఓ రకమైన వణుకు పుడుతుంది. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే ఆయనను తప్పక ఆరాధిస్తారు.

“నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం”

భావం : నీలాంజనం అంటే నల్లటి కాటుక రూపంలో ఉండేవాడు, రవిపుత్రం అంటే సూర్యుడి పుత్రుడు, యమాగ్రజం-యముడికి సోదరుడు, ఛాయా మార్తాండ సంభూతం: ఛాయా దేవికి, మార్తాండుడు అంటే సూర్య భగవానుడికి జన్మించినవాడు, తం నమామి శనేశ్చరం: అలాంటి శనీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని అర్థం.

ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని ఎప్పుడూ శని శని అని పిలవకూడదట. శనీశ్వరా అని మాత్రమే పలకాలి. విశేషం ఏమంటే ఈశ్వర శబ్దం ఎక్కడ ధ్వనిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఉదాహరణకి శివుడిని ఈశ్వరుడు, మహేశ్వరుడు అంటాం, ఆయన అలా అనుగ్రహిస్తాడు. వేంకటేశ్వర స్వామి పేరులోనూ ఈశ్వర శబ్దం ఉంది. ఈశ్వర శబ్దం ఉంది కాబట్టే ఆయన కలియుగ దైవంగా మారి మన కోరికలను నెరవేరుస్తున్నాడు. అలాగే శనీశ్వరుడి నామంలోనూ శని, ఈశ్వరుడు అనే శబ్దం రావడంతో ఈయన కూడా శివుడిలా, వేంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి అని చిలకమర్తి తెలిపారు.

శనీశ్వరుడికి భయపడాల్సిన పనిలేదు. నవగ్రహ మండపానికి వెళ్లినప్పుడు శనీశ్వరుడికి భక్తితో నమస్మారం చేయండి. నమస్కరించడం వల్ల, శనివార నియమాల్ని పాటించడం వల్ల, నీలం లేదా నలుపు రంగు వస్తాల్ని ధరించడం వల్ల, ఆయనకు ఇష్టమైన చిమ్మిలి నివేదనం చేయడం వల్ల, శివారాధన చేయడం వల్ల తప్పక అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడి వల్ల కలిగే దోషాలు అంటే గ్రహరీత్యా ఏ గ్రహమైనాసరే మీకు యోగంతోపాటు పీడని కలిగిస్తుంది. శనీశ్వరుడు కూడా అంతే. ఆయన నివాసం ఉన్న స్థానాన్ని బట్టి జన్మ శని, ద్వాదశ శని, లేదా ద్వితీయ శనిగా కొద్దిగా కష్టాలకు గురిచేస్తాడు. ఎవరైతే శనీశ్వరుని భక్తిగా పూజించి, గౌరవిస్తారో అలాంటి వాళ్లను అనుగ్రహిస్తాడు.

అయితే ఎప్పుడు కూడా శని పీడ రావాలనే కోరుకోవాలట. ఎందుకంటే శనీశ్వరుడు కొద్దిగా పీడించాడంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్నీ మీకు అందించి వెళ్తాడు. శనీశ్వరుడి ప్రభావం కోరుకోకపోతే ఆయన ఇచ్చే యోగం, ఐశ్వర్యం కూడా రాదట. అందుకే శనీశ్వరుడు పీడించాలి, దానికి వందరెట్లు యోగాన్ని ఐశ్వర్యాన్నీకలిగించాలని భక్తిశద్ధలతో కోరుకోవాలట.

శనీశ్వరుడి ఆరాధించాలి. చక్కగా నీలిరంగు పుష్పాలతో పూజించి, శివారాధన, హనుమాన్‌, అయ్యప్ప ఆరాధనా చేయాలట. అలాగే శనివార నియమాల్ని పాటించడం వల్ల కూడా శనీశ్వరుడు అనుగ్రహిస్తాడట. కొద్ది ఇబ్బందులు ఎదురైనా అంతకు మించి ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది తెలిసిన తర్వాత శనీశ్వరుడు అంటే భయం తొలగిపోతుందని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం