Vastu Tips: వాస్తు ప్రకారం ఏ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది? ఈ రెండు రోజులు ధరిస్తే మాత్రం మీ కష్టాలు తీరినట్టే
16 December 2024, 8:27 IST
- Vastu Tips: వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎరుపు రంగు చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరి జీవితం పై ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు, అగ్ని, జీవితానికి ఎరుపు రంగు ముడిపడి ఉంది.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం ఏ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది?
వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి సమస్యల నుంచైనా గట్టెక్కచ్చని చాలా మంది నమ్ముతారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఎరుపు రంగు చాలా శక్తివంతమైనది. ప్రతి ఒక్కరి జీవితం పై ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు, అగ్ని, జీవితానికి ఎరుపు రంగు ముడిపడి ఉంది.
లేటెస్ట్ ఫోటోలు
శుక్రవారం, మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి రోజు. ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అలాగే ఇల్లంతా కూడా ధనం కలిగి ఉంటుంది. మంగళవారం నాడు ఎరుపు రంగు బట్టలు వేసుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా రోజంతా మంచి జరుగుతుంది.
మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటే ఎలాంటి మార్పులు వస్తాయి?
మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం వలన మన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. దాంతో సంతోషంగా ఉండొచ్చు. సమస్యలు లేకుండా హాయిగా ఉండొచ్చు. మన దుస్తులు రంగు ద్వారా కూడా ఇలా రోజుని బట్టి ఫలితం వస్తుంది.
సానుకూల శక్తి
సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోవడానికి ఎరుపు రంగు దుస్తులను ఈ రెండు రోజులు వేసుకుంటే మంచిది. సానుకూల శక్తి లేకపోతే అస్సలు జీవించడానికి అవ్వదు. కుజుడుకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామికి ఇష్టమైన రంగు. ఎరుపు రంగు దుస్తులను మంగళవారం నాడు ధరించడం వలన స్వేచ్ఛగా ఉండొచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి సంతోషంగా ఉండవచ్చు. ఎరుపు బట్టలు వేసుకుంటే ఎవరి హృదయాలునైనా గెలుచుకోవచ్చు.
ప్రోత్సాహం, ఆయుధానికి, ధైర్యానికి ఎరుపు రంగు చిహ్నం
ఎరుపు రంగు ఎప్పుడూ కూడా పూర్తి ధైర్యాన్ని అందిస్తుంది. ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటే ఎవరి ముందు తలవంచకుండా చాలా ధైర్యంతో ఏదైనా ఎదుర్కోవచ్చు. అనుకున్న దానిని సాధించొచ్చు.
హనుమంతుని అనుగ్రహంతో అనుకున్నది సాధించవచ్చు
ఎరుపు రంగు దుస్తుల్ని మంగళవారం నాడు వేసుకుంటే హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూర్తిగా కాన్ఫిడెన్స్ తో ఉండొచ్చు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా అవుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.