Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారు శత్రువులతో జాగ్రత్త.. నరఘోష ఎక్కువగా ఉంటుంది
30 September 2022, 5:00 IST
- Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా?సెప్టెంబర్ 30వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
నేటి రాశిఫలితాలు
Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (30-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లేటెస్ట్ ఫోటోలు
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు నియంత్రణలో పెట్టుకోండి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య పట్ల జాగ్రత్తగా వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి.
వృషభ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పని పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. బంధు, మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. శుభ ఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకము, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.
మిధున రాశి
ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అష్టమ శని ప్రభావము వలన శారీరక, మానసిక ఇబ్బందులు ఉంటాయి. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణములో ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశముంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది.
కర్కాటక రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనుల్లో అలసట చూపిస్తారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. శుభఫలితాలు పొందాలంటే ఆవునేతితో దీపారాధన చేస్తూ లక్ష్మీదేవిని పూజించాలి.
సింహ రాశి
ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. మానసికంగా హ్యాపీగా ఉంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారస్తులకు మధ్యస్తంగా ఉంటుంది. లక్ష్మీ అష్టకాన్ని పఠించి ఆవునేతితో దీపారాధన చేస్తే మంచిది.
కన్యా రాశి
ఈరోజు మీకు మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. ధనలాభము కలుగుతుంది. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించండి. విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం మంచిది.
తులా రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రుల సహాయము పొందుతారు. లలితా సహస్రనామాన్ని ఆవునేతితో దీపాన్ని వెలిగించి పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని ఏదోరకంగా పూర్తి చేస్తారు. పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ విజయం పొందుతారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. సోదరులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. కృష్ణాష్టకం పఠించడం మంచిది.
ధనూ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికి ప్రతీ పనిని చాకచక్యంతో పూర్తి చేస్తారు. సమస్యలను పరిష్కరించడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉంటే మంచిది. బంధు వియోగం ఏర్పడే సూచన. గొడవలకు దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
మకర రాశి
ఈరోజు మీకు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఒత్తిడి అధికముగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. ఆవునేతితో దీపారాధన చేయండి.
కుంభ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావము కుంభరాశి వారిపై తీవ్రముగా ఉన్నది. కాబట్టి చేసే ప్రతీ పనిలో ఆచితూచి వ్యవహరించవలసిన సమయము ఇది. శత్రువుల వల్ల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లలితా సహస్ర నామాన్ని పారాయణం చేయడం మంచిది.
మీన రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. శత్రువర్గంతో జాగ్రత్తలు వహించాలి. మీరు పూర్తి చేద్దామనుకున్న పనులకు ఏదో రకంగా ఆటంకము కలుగుతుంది. ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మానసికంగా హ్యాపీగా ఉంటారు.ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆవునేతితో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
టాపిక్