Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : శని ప్రభావంతో ఆ రాశివారికి ఆరోగ్యం, కుటుంబ ఇబ్బందులు ఉంటాయి
Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 29వ తేదీ 2022న కెరీర్ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (29-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. గొడవలకు, విభేదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. కొన్ని చికాకులు ఉంటాయి. పనుల్లో అలసత్వం వహిస్తారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మానసిక ఇబ్బందులు కలిగే అవకాశముంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.
వృషభ రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. శత్రుబాధలు తప్పవు. మానసికంగా ఇబ్బందులు పడతారు. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
మిధున రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని చేయడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉన్నా.. పనులు పూర్తి చేస్తారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖర్చులు తగ్గించుకుని ఆచితూచి వ్యవహరించండం మంచిది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ప్రయాణములో ఖర్చులు ఎక్కువ అవుతాయి. మిధునరాశివారు దక్షిణామూర్తిని పూజించండి.
కర్కాటక రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. విశ్రాంతి దొరుకుతుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కానీ ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. శారీరక సౌఖ్యమును పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. కర్కాటక రాశివారు శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
సింహ రాశి
ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.
కన్యా రాశి
ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. శారీరక సౌఖ్యం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు ఎక్కువ అవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
తులా రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చికాకులు, వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. స్త్రీలకు శ్రమ, ఇబ్బందులు ఉంటాయి. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉండండి. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.
వృశ్చిక రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికముగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
ధనూ రాశి
ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మీ అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. ఇష్టమైన వస్తువులు కొంటారు. శత్రువులతో జాగ్రత్తగా ఉంటే మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళనలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజించండి.
మకర రాశి
ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. శారీరక సౌఖ్యము, ప్రశాంతత దొరుకుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఆరోగ్యం, కుటుంబ వ్యవహారముల మీద, వృత్తి, వ్యాపారముల మీద ఉంటుంది. శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దత్తాత్రేయుని పూజించండి.
కుంభ రాశి
ఈరోజు మీకు మధ్యస్థము నుంచి అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఏలినాటి శని ప్రభావం వల్ల కుటుంబీకులతో ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు పెరుగుతాయి. రాబడి తగ్గుతుంది. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమయ్యే సూచన ఉంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఈరోజు దక్షిణామూర్తిని పూజించండి.
మీన రాశి
ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించండి.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Contact : 9494981000
సంబంధిత కథనం
టాపిక్