Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేయడానికి ఆ రాశివారు కష్టడాల్సి వస్తుంది..-today horoscope in telugu based on career and life for 28th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu Based On Career And Life For 28th September 2022

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేయడానికి ఆ రాశివారు కష్టడాల్సి వస్తుంది..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 28, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 28వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (28-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. శత్రు బాధ అధికముగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. గొడవలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

వృషభ రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ, మానసిక అలసట ఉంటుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. నూతనంగా కొన్ని వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

మిధున రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. ధనపరమైన విషయాలలో లాభము పొందుతారు. కుటుంబములో కొంత ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రయాణమునందు ఖర్చులు అధికమవుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును పూజించండి.

కర్కాటక రాశి

ఈరోజు మీకు పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యము పొందుతారు. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ధనపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. మీకు ఇష్టమైన విషయాలకోసం డబ్బులు ఖర్చు చేస్తారు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉంటాయి. మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

కన్యా రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, పని ఒత్తిడి, చికాకులు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు అధికంగా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. కన్యారాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

ఈరోజు మీకు మధ్యస్తము నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఒత్తిడి అధికముగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి చేయడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేస్తారు. మానసిక ఆనందము కలుగుతుంది. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. అప్పుల ఒత్తిడి అధికముగా ఉంటుంది. మిత్రులు హెల్ప్ చేస్తారు. మహా విష్ణువును ఆరాధిస్తే మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల సమయమిది. వ్యాపారస్తులకు లాభదాయకము. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. సోదరులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. మంచి ఫలితాలకోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

ధనూ రాశి

ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ పని అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. శత్రువులకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. హ్యాపీగా ఉంటారు. శారీరక శ్రమ, చికాకులు అధికముగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి.. ప్రతి పనిని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించండి. మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబంలోని వారితో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రంగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి వ్యవహరించవలసిన సమయమిది. ఉద్యోగంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.

మీనరాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్