Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఆవేశపూరిత నిర్ణయాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి-today horoscope in telugu based on career and life for 27th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఆవేశపూరిత నిర్ణయాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు : ఆ రాశివారికి ఆవేశపూరిత నిర్ణయాలు, అనవసర ఖర్చులు పెరుగుతాయి

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 27, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 27వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

నేటి రాశిఫలితాలు
నేటి రాశిఫలితాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (27-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి చెడు ఫలితాలుగా ఉన్నాయి. శత్రుబాధలు అధికముగా ఉంటాయి. కాబట్టి గొడవలకు దూరంగా ఉండండి. కుటుంబములో చికాకులు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అధికముగా ఉంటాయి. అయినప్పటికీ.. ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారముల్లో చికాకులు ఉంటాయి. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. మానసిక అలసిపోతారు. బంధుమిత్రులతో బేధాభిప్రాయాలు పెరుగుతాయి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి.

మిధునరాశి

మిధున రాశి వారికి అనుకూలంగా ఉంది. ధనలాభము, సౌఖ్యము కలుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు, వృధా ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఉల్లాసము కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు పూజించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి అనుకూల ఫలితాలు ఉన్నవి. మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వస్తుంది. చేసే ప్రతి పని మీకు అనుకూలంగా ఉంటుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగుతాయి.

సింహరాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు, కొత్త పనులు ప్రారంభించేప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. వ్యాపారస్తులకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం ఇది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కన్యారాశి

కన్యా రాశి వారికి ఈరోజు మధ్యస్తము నుంచి మంచి ఫలితములు ఉన్నాయి. శారీరక శ్రమ, మానసిక శ్రమ, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రయాణములు అధికమవుతాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించండి. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించండి.

తులా రాశి

తులా రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. అధిక ఖర్చు, శారీరక శ్రమ కలుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, శత్రు భయము ఉంటుంది. కుటుంబం వల్ల మానసిక ఒత్తిడి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు, స్త్రీలకు కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్పుల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. స్నేహితులు సహాయం చేస్తారు. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుట వలన మరింత శుభ ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. సమాజంలో, కుటుంబంలో గౌరవము పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమిది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ధనలాభము కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితము కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితములు ఉన్నవి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయమిది. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. ఏలినాటి ప్రభావము చేత ఆర్థిక సమస్యలు, పనులు ఆలస్యంగా ఏర్పడుతాయి. శత్రువులతో, గొడవలకు దూరంగా ఉండండి. మానసిక ఆందోళనలు ఉంటాయి. దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే శుభఫలితాలు ఉంటాయి

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగములో చికాకులు, వ్యాపారస్తులకు అధిక శ్రమ ఉంటుంది. మీ కృషితో పట్టుదలతో ముందుకు వెళ్లి.. పనులు పూర్తి చేస్తారు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అప్పు చేయాల్సిన అవసరం రావొచ్చు. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు కష్టకాలం ఇది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. మంచి ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి అధికముగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేస్తారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్