తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu : శత్రువర్గంతో జాగ్రత్త.. అనవసర విషయాలకు దూరంగా ఉండండి

Today Rasi Phalalu : శత్రువర్గంతో జాగ్రత్త.. అనవసర విషయాలకు దూరంగా ఉండండి

01 October 2022, 5:00 IST

google News
    • Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? అక్టోబర్ 1వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
రాశిఫలాలు
రాశిఫలాలు

రాశిఫలాలు

Today Rasi Phalalu: నేటి రాశిఫలాలు (1-10-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లేటెస్ట్ ఫోటోలు

2025లో యాపిల్​ లవర్స్​కి పండగే! ఐఫోన్​తో పాటు సూపర్​ కూల్​ గ్యాడ్జెట్స్​ వచ్తేస్తున్నాయి..

Dec 23, 2024, 01:13 PM

Meenakshi Chaudhary: ఈ ఏడాది హీరోయిన్‌గా ఆరు సినిమాలు చేసిన మీనాక్షి చౌద‌రి - అందులో హిట్స్ ఎన్నంటే?

Dec 23, 2024, 11:48 AM

Jupiter Transit: కోట్ల రూపాయలు ఇవ్వడానికి గురు వస్తున్నాడు.. ఈ రాశుల వారి దశ తిరగబోతోంది.. సంపదతో ఫుల్లు ఖుష్

Dec 23, 2024, 10:42 AM

TG New Ration Cards : కొత్త రేషన్ కార్డులకు ఎవరు అర్హులు.. ఇవిగో మార్గదర్శకాలు!

Dec 23, 2024, 10:34 AM

Somavathi Amavasya: ఈ ఏడాది చివరి అమావాస్య, ఆ రోజు వీటిని దానం చేస్తే సంపద కలుగుతుంది

Dec 23, 2024, 09:24 AM

దేశంలో అత్యంత ఖరీదైన స్టాక్స్​ ఇవి- ఒక్క షేరు కొనాలంటే రూ. లక్షలు కావాల్సిందే!

Dec 23, 2024, 06:04 AM

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. పనుల్లో చికాకులు, ఒత్తిడి ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసికంగా ఇబ్బంది పడతారు. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వహించడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృషభ రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శారీరక శ్రమ కొంత అధికముగా ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

మిధున రాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా ఉండదు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని ప్రభావం చేత శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు, వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణములో ఖర్చులు ఎక్కువ అవుతాయి. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది.

కర్కాటక రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ఉత్సాహముతో ముందుకు సాగుతారు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లడం మంచిది. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

సింహ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

కన్యా రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉన్నది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణ సూచన. మీ అవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. శత్రువులపై విజయము పొందుతారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాలపై శ్రద్ధ వహించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

తులా రాశి

ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కుటుంబముతో ఉల్లాసముగా టైం స్పెండ్ చేస్తారు. మీకు ప్రయాణములు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. సంతానము వలన సంతోషము ఉంటుంది. అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిత్రులు సహాయము చేస్తారు. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, వ్యాపారస్తులకు శ్రమ ఎక్కువగా ఉంటే మంచిది. ప్రయాణములు అనుకూలిస్తాయి. మీ అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. కుటుంబములో చికాకులు ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

ధనూ రాశి

ఈరోజు మీకు మధ్యస్తమునుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. ఏలినాటి శని ప్రభావము చేత చికాకులు కలుగుతాయి. బాధలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళనలు ఉంటాయి. వ్యాపారస్తులకు చికాకులు కలుగుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చికాకులు ఎక్కువ అవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

కుంభ రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చికాకులు ఏర్పడతాయి. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. ఏలినాటి శని ప్రభావము కుంభరాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయం ఇది. శత్రువుల వల్ల కలిగే బాధలు ఎక్కువగా ఉంటాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

మీన రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండండి. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

తదుపరి వ్యాసం