ఈ అయిదు రాశుల వారు ఎప్పుడూ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటారట. ఎందుకో తెలుసా
04 December 2024, 12:35 IST
- కొన్ని రాశుల వారు అందరిలా వ్యవహరించరు. మౌనంగా ఉంటూ వారి ఎమోషన్స్ బయటకు కనిపించనీయకుండా ప్రవర్తిస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారి ప్రవర్తన అలానే ఉంటుందట. ఇందుకు కారణం కూడా ఉందట. అదేంటో, ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.
ఈ రాశుల వారు ఎమోషన్స్ ను దాచిపెడతారట ఎందుకో తెలుసా?
మనిషిని కలిసిన కాసేపటికి ఆ వ్యక్తి ఎలాంటి వారో ఒక అంచనాకి వచ్చేయొచ్చు. మరికొందరు కాస్త ఆలస్యంగా అర్థమవుతారు. అసలు ఎంత ప్రయత్నించినా అర్థం కాని కొన్ని వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి. వారు అందరితో పాటు ఉన్నప్పటికీ వాళ్లు మనసులో ఏముందో అస్సలు బయటపెట్టరు. నిజంగా వాళ్లు సంతోషంగా ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఏదైనా అయోమయంలో ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం. స్వతహాగా వారంతా వారి రాశుల స్వభావాన్ని బట్టి అలా ప్రవర్తిస్తుంటారట. ఎమోషన్స్ పైకి కనిపించనివ్వకుండా దాచుకుంటూ సీక్రెట్ గా ఫీల్ అవుతుంటారట. మరి అలా సీక్రెట్ గా వ్యవహరించే రాశులవారెవరో అలా ఎందుకు చేస్తారో తెలుసుకుందాం. అందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.
లేటెస్ట్ ఫోటోలు
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఎమోషన్స్ ఉండవని మీరనుకుంటున్నారా.. ఇంకోసారి చెక్ చేసుకోండి. వాళ్లు ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు. ప్రతి ఒక్క విషయాన్ని ఫీల్ అవుతారు కానీ, ఒక ఎమోషన్ కూడా బయటకు చూపించరు. ఈ రాశికి అధిపతి మంగళ గ్రహం. అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉండే ఈ గ్రహ ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు కూడా తమ ఫీలింగ్స్‌ను ప్రైవేట్‌గా మాత్రమే బయటపెడతారు.
వారు చాలా కూల్ గా ఉంటున్నారని అనుకోవద్దు. వాస్తవానికి వాళ్లు ఇతరులను త్వరగా నమ్మరు. వారి ముందు ఎమోషన్స్ బయటపెట్టామని అంటే వాళ్ల చేతికి ఒక సీక్రెట్ ఆయుధాన్ని ఇచ్చినట్లే. అంతర్లీనంగా ఫీల్ అయ్యే విషయాన్ని బయటపెట్టని వాళ్లు, మీతో ఒక విషయం పంచుకుంటున్నారంటే అది కచ్చితంగా పెద్ద విషయమే లైట్ తీసుకోవద్దు.
కర్కాటక రాశి:
ఈ రాశి వారి మనస్సు రాతిని పోలి ఉంటుంది. చుట్టుపక్కల ఏం జరుగుతున్నా చాలా స్థిరంగా ఉంటారు. శని అధిపతి అయిన ఈ రాశి వారు గ్రహ ప్రభావంతో చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. స్థిరంగా ఉంటూ పబ్లిక్‌లో ఎక్కువగా ఎమోషన్ ను బయటకు చూపించడానికి ఇష్టపడరు. సమస్యలను తొక్కిపట్టి పని మీద మాత్రమే ధ్యాస పెడతారు. మీరు కర్కాటక రాశి వారితో తిరుగుతుంటే మాత్రం ఫీలింగ్స్ రాబట్టడానికి త్వరపడకండి. వారికి నచ్చిన టైంలో చెప్పినప్పుడు మాత్రమే వినండి. అలా చేయడమే వారికి సేఫ్ ఫీలింగ్ తెచ్చిపెడుతుంది.
కుంభ రాశి:
ఈ రాశి వారు మిమ్మల్ని దూరం పెడుతున్నారని అనుకుంటున్నారా.. కాదు వారి గ్రహానుకూలతను బట్టి వారి స్వభావం అదే విధంగా ఉంటుంది. స్వతహాగా స్వేచ్ఛను ఇష్టపడుతూ ఎమోషన్ కంటే లాజిక్ కోసమే పరితపిస్తుంటారు. యురేనస్ అధిపతిగా ఉన్న ఈ రాశి వారు కొత్తదనాన్ని కోరుకుంటారు. వీరికి ఐడియాలు, కొత్త పరిష్కారాల కోసం వెదకడమే ఆసక్తి. వీరి ఫీలింగ్స్ ను బయటకు రప్పించాలని ప్రయత్నించి అలసిపోకండి. అది వారి ఇష్టంతోనే, వాళ్లకు నచ్చిన సమయంలోనే బయటకు వస్తుందని తెలుసుకోండి.
కన్య రాశి:
వీళ్లతో వచ్చిన సమస్యేంటంటే, స్వతహాగా సమస్యలను పరిష్కరించుకోగలరు. వారు ఎమోషన్ అయ్యారంటే మాత్రం ఆ సమస్యకు పరిష్కారాన్ని తారాస్థాయిలో వెదుకుతున్నారని అర్థం. వీరు ఆ సమస్య గురించి చెప్పినప్పుడు కూడా వాళ్లు ఎంతగా బాధపడుతున్నారనే దాని కంటే దాని పరిష్కారం గురించే ఎక్కువగా చర్చిస్తారు. బుధ గ్రహం అధిపతి అయిన వీళ్లు చాలా తక్కువ సమయాల్లో మాత్రమే కమ్యూనికేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు ప్రశాంత స్వభావులు అనుకుంటే తప్పే, వారు కేవలం ఎమోషన్స్ చూపించడానికి ఇష్టపడరంతే. మీరు బాగా నమకస్తులు అని ప్రూవ్ అయితే కచ్చితంగా తమ సమస్యను బయటకు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కన్యరాశి వారు.
తుల రాశి:
ప్రతి ఒక్కరినీ సంతోషంగా ఉంచాలనుకునే రాశి తుల రాశి. శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశి ప్రేమ, విలాసాలు, సంతోషాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. ఇతరులు నొచ్చుకుంటారని అనిపిస్తే వారి ఫీలింగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడనివ్వరు. వారు ఇబ్బందిపడుతున్నా బయటకు నవ్వుతూనే కనిపిస్తారు. మీకు దగ్గర వాళ్లు ఎవరైనా తుల రాశి వాళ్లుంటే బయటకు చెప్పుకోలేని ఫీలింగ్స్ ను అర్థం చేసుకొని పరవాలేదని ధైర్యం చెప్పండి.
ఇందులో మీ రాశి లేదా, మీ స్నేహితులకు సంబంధించిన వేరే రాశి ఉంటే ఈ సమాచారాన్ని వారితో షేర్ చేసుకోండి. వాళ్ల ఫీలింగ్స్ తెలుసుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్