Krishna Mukunda Murari November 23rd Episode: కృష్ణ ధ్యాసలో మురారి - రివర్స్ గేమ్ మొదలుపెట్టిన ముకుంద
Krishna Mukunda Murari November 23rd Episode: నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో మురారి ఎప్పుడూ కృష్ణ ధ్యాసలోనే ఉండటం ముకుంద తట్టుకోలేకపోతుంది. మురారిపై సీరియస్ అవుతుంది.
Krishna Mukunda Murari November 23rd Episode: కృష్ణను వదిలిపెట్టి అమెరికా వెళ్లడానికి మురారి మనసు అంగీకరించదు. అమెరికా వెళ్లమని కృష్ణనే సలహా ఇవ్వడంతో వెళ్లాలని ఫిక్స్ అవుతుంది. కృష్ణ అలా ఎందుకు చెప్పిందో తెలియక ముకుంద, భవానీ తెగ కంగారు పడతారు. అమెరికాలో తనకు ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టర్‌ను కృష్ణతో మాట్లాడించాలని మురారి అనుకుంటాడు.
కానీ భవానీ అందుకు ఒప్పుకోదు. ట్రీట్‌మెంట్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడొద్దని మురారిలో ధైర్యాన్ని నింపుతుంది కృష్ణ. భవానీ ముందే కృష్ణ ధైర్యంగా మాట్లాడటం చూసి రేవతి హ్యాపీగా ఫీలవుతుంది.
మురారికి ఇష్టమైన వంట...
ఆ తర్వాత కృష్ణ వంట చేస్తోండగా మురారి అక్కడికి వస్తాడు. కృష్ణ ఎగ్ కర్రీ చేస్తుంది. ఎగ్‌ఫ్రై అంటే తనకు చాలా ఇష్టమని మురారి అంటాడు. అతడి మాట విని కృష్ణ షాక్ అవుతుంది. గతం గుర్తురాకముందు కూడా ఈ కర్రీని మీరు ఇష్టంగా తినేవారని అతడితో అంటుంది.
ఎగ్‌ఫ్రైతో పాటు ఇంకా ఏమంటే ఇష్టమని మురారిని అడుగుతుంది కృష్ణ. కానీ ఇదొక్కటే తనకు గుర్తుందని మురారి అంటాడు. వంట చేయడంలో కృష్ణకు హెల్ప్ చేస్తానని మురారి చెబుతాడు. కానీ మురారి చేయడానికి పనులేం లేకపోవడంతో నన్ను చూస్తూ ఉండండి చాలు అని కృష్ణ చెబుతుంది.
అదే నేను కర్రీ చేస్తాను చూడండి అంటూ మాట మార్చేస్తుంది. కృష్ణను చూస్తుంటే నా మనిషే అనిపిస్తుందని మురారి అనుకుంటాడు. కృష్ణ కూడా అలా భావించే తనతో చనువుగా ఉంటుందా అని ఆలోచిస్తాడు మురారి.
కృష్ణ కంగారు...
కర్రీ చేస్తోండగా వేడి ఆయిల్ కృష్ణ ముఖంగా పడబోతుండగా మురారి తన చేయి అడ్డం పెడతాడు. అతడి చేయి కాలుతుంది. దాంతో కృష్ణ కంగారు పడుతుంది. నా మీద నూనె పడుతుందనే మీరు చేతులు అడ్డం పెట్టారు కదా...నేనంటే మీకు ఎందుకు అంత అభిమానం అని మురారిని అడుగుతుంది కృష్ణ. తెలియదని బదులిస్తాడు మురారి. ఆ తర్వాత తనకు ఆకలిగా ఉందని కృష్ణకు చెబుతాడు మురారి.
మురారి చేతులు కాలడంతో అతడికి తానే స్వయంగా అన్నం తినిపిస్తుంది కృష్ణ. ఆమె ప్రేమ చూసి మురారి కరిగిపోతాడు. అన్నం తినిపించే సమయంలో కృష్ణ కళ్లల్లోకి చూస్తూ అలాగే ఉండిపోతాడు మురారి.
రేవతి హ్యాపీ...
మురారి ఇంట్లో కనిపించకపోవడంతో రేవతి కంగారు పడుతుంది. మురారికి కృష్ణ భోజనం తినిపిస్తున్నదని మధుకర్ చెబుతాడు. అతడి మాటలు విని సంతోషపడుతుంది. ఆ తర్వాత డాక్టర్ నంబర్ భవానీ....కృష్ణకు ఎందుకు ఇవ్వలేదా అని మురారి ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్కడికి ముకుంద వస్తుంది. తన డౌట్‌ను ముకుంద ముందు పెడతాడు మురారి.
అతడు ఎప్పుడు కృష్ణ జపం చేయడం ముకుంద తట్టుకోలేకపోతుంది. కృష్ణ ధ్యాస తప్ప నీకు మరొకటి లేదా. వాళ్లు ఎలాంటి క్రిమినల్స్ అన్నది పెద్దమ్మ చెప్పిన కూడా నమ్మవా. మా మాటలకు విలువ, గౌరవం లేదా అంటూ మురారిపై ఫైర్ అవుతుంది ముకుంద. మీకు నా మీద జాలి తప్ప మరేం లేదని అనిపిస్తుంది. మీరు నన్ను మానసిక రోగిని అయినట్లు మనిషిగా కాకుండా గాజుబొమ్మలా చూస్తున్నారని ముకుందపై కోపగించుకుంటాడు.
నన్ను మనిషిగా, స్నేహితుడిగా కృష్ణ చూస్తుంది కాబట్టే అభిమానం ఏర్పడిందని ముకుందతో చెబుతాడు మురారి. ఏ స్వార్థంతో కృష్ణ నాకు యాక్సిడెంట్ చేసిందో చెప్పమని అంటే ఎవరూ ఎందుకు చెప్పడం లేదని నిలదీస్తాడు.
ముకుంద రివర్స్ గేమ్...
మురారికి అనుమానం రావడంతో ముకుంద రివర్స్ గేమ్ ప్లే చేస్తుంది. ఎంక్వైరీలు చేయడం మాకు తెలియదా...మాకు చేతకాదా...మనం పెంచిన మొక్కను తుంచడం ఇష్టం లేక ఆగిపోయామని మురారితో వాదిస్తుంది. కృష్ణ మన ఇంటికి రావడానికి ఎందుకు టెన్షన్ పడుతుంది.
నువ్వు చదివించినందుకు కృతజ్ఞతగా ఇక్కడికి రమ్మని అన్న ఆమె ఎందుకు రాలేదు అని మురారిలో అనుమానాలు పెంచుతుంది ముకుంద. ఆమె ఎంత వాదించినా కృష్ణ తనకు ద్రోహం చేసిందంటే మురారి నమ్మలేకపోతాడు.
కృష్ణ ప్లాన్...
కృష్ణ, నందు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. వారి మాటల్ని చాటునుంచి భవానీ వింటుంది. మురారి అమెరికా వెళితే గతం గుర్తొస్తుంది. అప్పుడు మురారి పరిగెత్తుకుంటూ నాకోసం వస్తారు అని నందుతో అంటుంది కృష్ణ. ఆమె ప్లాన్ విని భవానీ షాక్ అవుతుంది. నిన్ను దూరం పెట్టినందుకు మా వాళ్లపై కోపం లేదా అని కృష్ణను అడుగుతుంది నందు.
మనసు గాయ పరిచినవాళ్లను ద్వేషించడం సహజం. కానీ ప్రేమిస్తే వాళ్లు నా మనుషుల్లా కనిపిస్తారు. ఇక నేను ఎందుకు బాధపడాలి. ముకుంద గురించే తన బాధ మొత్తం అని కృష్ణ అంటుంది. జరగని వాటికోసం, అందని వాటి కోసం ముకుంద ఆరాటపడుతుందని చెబుతుంది.
ముకుంద వెనుక మా అమ్మ భవానీ ఉందని, తాను కోరుకున్నవని జరిపించి తీరుతుందని కృష్ణకు చెబుతుంది నందు. జైలులో ఉన్న చిన్నాన్న ప్రభాకర్‌తో మాట్లాడటానికి బయలుదేరుతుంది కృష్ణ. ఆమె వెంట తాను వస్తానని మురారి పట్టుపడతాడు. అక్కడితో నేటి కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసింది.