తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం అక్షయ తృతీయ రోజు పఠించాల్సిన స్తోత్రాలు ఇవే

Akshaya tritiya 2024: లక్ష్మీదేవి ఆశీస్సుల కోసం అక్షయ తృతీయ రోజు పఠించాల్సిన స్తోత్రాలు ఇవే

Gunti Soundarya HT Telugu

09 May 2024, 14:30 IST

google News
    • Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రాలు పఠించండి. మీ జీవితం సుఖ సంతోషాలతో, ధనంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. 
అక్షయ తృతీయ రోజు పఠించాల్సిన  మంత్రాలు
అక్షయ తృతీయ రోజు పఠించాల్సిన మంత్రాలు (freepik)

అక్షయ తృతీయ రోజు పఠించాల్సిన మంత్రాలు

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ అంటే బంగారం వెండి మాత్రమే కొనుగోలు చేయడం మాత్రమే కాదు. మహా లక్ష్మిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు కూడా పఠించాలి. పవిత్రమైన ఈరోజు పూజ చేసే సమయంలో ఈ మంత్రాలు పఠించండి. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు పొందుతారు. 

శ్రీ మహాలక్ష్మి స్తోత్రం

నమస్తే స్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే

శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే||

మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించే వాళ్ళు సకల పాపాల నుండి విముక్తులవుతారు. ధన ధాన్య సమృద్ధి పొందుతారు. శత్రు బాధలు తొలగిపోతాయి. ఇంట్లో పేదరికం, కష్టాలు తొలగిపోయి సంపదతో సంతోషంగా ఉంటారు. నిత్యం ఈ స్తోత్రం పఠించడం వల్ల మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది. అక్షయ్ అనేది సంస్కృత పదం. దీని అర్థం క్షయం లేనిది అంటే ఎప్పటికీ అంతం లేనిది. ఈరోజు ఏ శుభకార్యం చేపట్టినా దానికి అంతులేని ఫలితాలు లభిస్తాయి. 

నమస్తే గరుడారూఢే కోలాసుర-భయంకరీ

సర్వ-పాప-హరే దేవి మహాలక్ష్మీ నమో స్తు తే

కుబేర లక్ష్మీ మంత్రం

ఓం శ్రీం హీం హం కుబేర లక్ష్మీ కమలధారణ్య ధనాకర్షణే స్వాహా

ఈ కుబేర లక్ష్మీ మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.

ఓం శ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మీ

మమ గ్రిహి ధనం పూరయ పూరయ నమః

ఈ మంత్రాన్ని జపిస్తే కుబేరుడి ఆశీస్సులు లభిస్తాయి. 

 

సర్వజ్ఞే సర్వ వరదే సర్వదుష్ట భయంకరి

సర్వదుఃఖ హరే దేవీ మహాలక్ష్మి నమోస్తుతే

ఈ మంత్రం పఠించడం వల్ల సర్వ దుఖం నుంచి విముక్తి కలుగుతుంది. దుష్ట శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

 

అత్యంత రహితే దేవి ఆత్యాశక్తి మహేశ్వరి

యోగజే యోగ సంపుతే మహాలక్ష్మి నమోస్తుతే

ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. 

 

పద్మాసనాస్తితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి

పరమేసి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే

పద్మంలో కూర్చుని ఉండే లక్ష్మీదేవి నిన్ను ఎప్పుడు స్తుతిస్తాము అని అర్థం. 

అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి ఎక్కువగా కొనుగోలు చూస్తారు. ఇవి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు. అయితే బంగారం కొనుగోలు చేయాలనే నియమం ఎక్కడ లేదు. లక్ష్మీదేవిని ఆరాధిస్తే అదృష్టం వస్తుంది. బంగారం, వెండి ఆభరణాలు మాత్రమే కాకుండా భూమి, వాహనాలు, పాత్రలు, యంత్ర సామాగ్రి, ఫర్నిచర్, వస్త్రాలు వంటి వాటివి కూడా కొనుగోలు చేస్తారు. 

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నందుకు మట్టి కుండలు, విలువైన లోహాలు, కౌరీలు, బార్లీ, శ్రీ యంత్రం, దక్షిణామూర్తి శంఖం కొనుగోలు చేసే ప్రయోజనకరంగా ఉంటుంది.  కౌరీలను కొన్న తర్వాత లక్ష్మీదేవి పాదాలు వద్ద సమర్పించాలి. రెండవ రోజు వాటిలో కొంత భాగాన్ని ఎరుపు రంగు వస్త్రంలో భద్రపరిచాలి. వాటిని డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో పెట్టుకుంటే మీ సంపద ఎప్పటికీ తరిగిపోదు. 

ఇవి మాత్రమే కాదు లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందేందుకు ఆదిశంకరాచార్యులు రచించిన కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. ఈ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది. వీటితో పాటు ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 సార్లు పఠించడం వల్ల సంపద అధిదేవుడిగా భావించే కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. 

 

తదుపరి వ్యాసం