Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేరా? మీ బడ్జెట్ లో దొరికే వీటిని కొన్నా అదృష్టమే-cant buy gold on akshaya tritiya day good luck buying these within your budget ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేరా? మీ బడ్జెట్ లో దొరికే వీటిని కొన్నా అదృష్టమే

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేరా? మీ బడ్జెట్ లో దొరికే వీటిని కొన్నా అదృష్టమే

Gunti Soundarya HT Telugu
May 08, 2024 01:49 PM IST

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేరా? అయితే మీరేం బాధపడొద్దు. ఈ వస్తువులు కొనుగోలు చేసినా బంగారం కొనట్టే లెక్క. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేరా?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేరా? (freepik)

Akshaya tritiya 2024: సనాతన ధర్మంలో అక్షయ తృతీయ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవిని ఈరోజు ఎక్కువగా పూజిస్తారు. కొందరు వ్యక్తులు బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. ఈరోజు ముఖ్యంగా షాపింగ్ చేయడం అదృష్టంగా భావిస్తారు.

ఐదు శుభ యోగాలు

వంద సంవత్సరాల తర్వాత గజకేసరి యోగంతో అక్షయ తృతీయ వచ్చింది. ఇవి మాత్రమే కాకుండా ఐదు శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. సుకర్మ యోగం రోజంతా ఉంటుంది. రవి యోగం సమయంలో బంగారం కొనుగోలు చేస్తారు. శుక్రవారం సుకర్మ యోగం రావడం చాలా అదృష్టంగా పరిగణిస్తారు. అలాగే అక్షయ తృతీయ రోజు రోహిణి నక్షత్రం ఉంది.

ఆర్థిక ఆనందాన్ని అందించే శుక్రుడు ఈ నక్షత్రానికి అధిపతి. అందుకే ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మీకు అదృష్టమే. సంవత్సరంలో అత్యంత అదృష్ట దినాలలో ఒకటిగా పరిగణిస్తారు. మృగశిర నక్షత్రం కూడా ఈరోజు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అనుకూలమైన నక్షత్రం ఇది.

బంగారం కొనలేరా?

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటె మంచిదని అంటారు. అయితే అందరూ బంగారం కొనుగోలు చేస్తే స్తోమత ఉండకపోవచ్చు. అందుకే వాటికి బదులుగా మీరు ఈ వస్తువులు కొని ఇంటికి తీసుకొచ్చినా సరే బంగారం కొన్నంత. వీటిని మీ ఇంటికి తీసుకొచ్చినా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు.

రాతి ఉప్పు కొని ఇంటికి తీసుకురండి. ఇది శుక్రుడు, చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే మీరు అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పును కొనుగోలు చేస్తే మీ సంపద పెరుగుతుంది. అలాగే మీరు ఈరోజు మట్టితో చేసిన దీపాలు, కుండలు, పాత్రలు కొనుగోలు చేసుకోవచ్చు. వీటిని కొంటె మీరు అదృష్టవంతులుగా మారతారు. సానుకూల పురోగతి ఉంటుంది.

ఆవాలు లేదా బార్లీ అక్షయ తృతీయ రోజున కొంటె చాలా మంచిది. బంగారం కొనుగోలు చేయలేని వాళ్ళు బార్లీ, పసుపు ఆవాలు కొనుగోలు చేయండి. ఇది బంగారం, వెండిని కొనుగోలు చేయడంతో సమానంగా పరిగణిస్తారు.

కత్తిపీట వంటివి కొనుగోలు చేయవచ్చు. కానీ ఈ పాత్రలు కొనుగోలు చేయాలనుకుంటే ఇత్తడి లేదా రాగిని ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు ధనంతో నిండిపోతుంది. లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పవిత్రమైన అక్షయ తృతీయ రోజున గవ్వలు కొని ఇంటికి తీసుకురండి. లక్ష్మీదేవి పాదాల దగ్గర వాటిని ఉంచి పూజించారంటే అమ్మవారి కటాక్షం నిండుగా పొందుతారు. ఇవి కొనడం వల్ల జీవితంలో ఆనందం నిండిపోతుంది. అక్షయ తృతీయ రోజు షాపింగ్ కి వెళ్ళి పొరపాటున కూడా ఖాళీ చేతులతో రాకూడదు. ఏదో ఒక వస్తువు కొనాలని చెప్తారు.

ఏం దానం చేయాలి?

అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. నీరు, ఫ్యాన్, గొడుగు, అన్నం, ఉప్పు, నెయ్యి, పంచదార, బార్లీ, నీటితో నిండిన మట్టి కుండ, పండ్లు, బట్టలు దానం చేయడం చాలా మంచిదిగా భావిస్తారు. ఇవి దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.

WhatsApp channel