Gold price today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర; 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270-gold and silver prices today on 08 05 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర; 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270

Gold price today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర; 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270

HT Telugu Desk HT Telugu
May 08, 2024 10:24 AM IST

Gold price today : దేశంలో పసిడి, వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold price today : దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 100 తగ్గి.. రూ. 66,250 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,350గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 1000 తగ్గి, రూ. 6,62,500కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,625 గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 110 తగ్గింది. బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270 గా ఉంది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,380 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,22,700గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం స్వల్పంగా తగ్గినవి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,400 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,420 గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,270 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో బంగారం ధర

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,320 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,250 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,270గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,250 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,300గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,320 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,250గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,320 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధర..

దేశంలో వెండి ధరల్లో బుధవారం పెద్దగా మార్పేమీ లేదు. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,500 గా కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ. 85,000 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర ఉంది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 85,000.. బెంగళూరులో రూ. 84,100 గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు బుధవారం భారీగా పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 350 పెరిగి రూ. 26,140కి చేరింది. క్రితం రోజు రూ. 25,790 గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర(10గ్రాములు) రూ. 26,140 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel