Gold and silver rate today: రూ. 60 వేల దిగువకు 24 క్యారెట్ల బంగారం-gold and silver rate today 10 august 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Rate Today: రూ. 60 వేల దిగువకు 24 క్యారెట్ల బంగారం

Gold and silver rate today: రూ. 60 వేల దిగువకు 24 క్యారెట్ల బంగారం

HT Telugu Desk HT Telugu
Aug 10, 2023 09:38 AM IST

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. వెండి, ప్లాటినం ధరలు కూడా తగ్గాయి. ఆ వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Gold and silver rate today : దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. వెండి, ప్లాటినం ధరలు కూడా తగ్గాయి. ఆ వివరాలు..

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Gold and silver rate today : రూ. 100 తగ్గిన పసిడి

దేశంలో బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 100 తగ్గి, రూ. రూ. 54,950 కి చేరింది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55, 050 గా ఉంది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,49,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,495 గా కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర కూడా రూ. 100 తగ్గి రూ. 59,950 కి చేరింది. క్రితం రోజు ఇది రూ. 60,050 గా ఉంది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 5,99,500గా ఉంది.

హైదరాబాద్ లో..

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 54,950 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,950 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,300గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 54,950 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 59,950 గాను ఉంది. అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 55,000గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 60,000గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 54,950 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,950 గా ఉంది.

ఇతర నగరాల్లో..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు గురువారం ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,950 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 59,950 గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ఫెడ్​ వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

తగ్గిన వెండి ధర..

దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,350గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 73,500కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 74,000గా ఉండేది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర గురువారం కేజీకి సుమారు రూ. 600 తగ్గింది. గురువారం హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 76,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 73,500.. బెంగళూరులో రూ. 73,000గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేట్లు గురువారం భారీగా తగ్గాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 350 తగ్గి, రూ. 23,670 గా కొనసాగుతోంది. ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 23,670 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

Whats_app_banner