Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలాంటి వస్తువులు కొనాలో తెలుసుకోండి
Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఇవి మీ ఇంటికి తెచ్చుకుంటే అదృష్టాన్ని తెచ్చుకుంటే.
Akshaya tritiya 2024: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మే 10 అక్షయ తృతీయ వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభ ముహూర్తం ఉదయం 5.33 గంటల నుండి 12.18 గంటల వరకు ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు, చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు. ఈ సందర్భం ఒకరి జీవితంలో సమృద్ధి, శ్రేయస్సు తీసుకొస్తుంది. అత్యంత పవిత్రమైన రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. ఈ రోజున కొన్ని కార్యకలాపాలు చేయడం మరికొన్నింటిని నివారించడం మంచిది. అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదో తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజు ఏం చేయకూడదు?
అక్షయ తృతీయ రోజు ఆర్థిక లావాదేవీలు జరపడం మానుకోవాలి. ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఈరోజు డబ్బులు ఇవ్వడం లేదా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మంచిది కాదు.
అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే వస్తువులు ఏవైనా కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల ప్రభావాలను కలిగించే లోహాలు, గాజు పాత్రలు కొనుగోలు చేయకుండా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
అక్షయ తృతీయ రోజు భవన నిర్మాణ పనులు ప్రారంభించకూడదు. అలాగే విష్ణు మూర్తికి తులసి ఎంతో ప్రీతికరమైనది. అందువల్ల అక్షయ తృతీయ రోజు తులసి ఆకులు తెంపకూడదు. తామసిక ఆహారానికి దూరంగా ఉంచాలి. మాంసం, ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇంట్లో దుమ్ము వ్యాపించకుండా చూసుకోవాలి. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
అక్షయ తృతీయ రోజు ఏం కొనుగోలు చేయాలి?
అక్షయ తృతీయ రోజు ఇంటిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఇది మంచి సమయంగా నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు శ్రేయస్సును అందించే వస్తువుల కొనుగోలు చూస్తే మీ ఇంట సిరిసంపదలు నిలుస్తాయి.
సమృద్ధిని ఆకర్షించేందుకు పవిత్ర గ్రంథాలు, ఆధ్యాత్మిక రచనలు కొనుగోలు చేస్తే మంచిది. అలాగే సంపద, శ్రేయస్సును సూచించే విగ్రహాలు లేదా బొమ్మలు, మత గ్రంథాలను ఇంటికి తీసుకురావచ్చు. ఈ పవిత్రమైన వస్తువులు మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. జీవితంలోని వివిధ అంశాలలో సమృద్ధి, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఈ పవిత్రమైన రోజున భూమి, ఇల్లు లేదా కారు కొనడం మంచిది. ఇవి కొనుగోలు చేయడం వల్ల జీవితంలో మీరు ముందుకు సాగుతున్నారని సంకేతంగా ఉంటుంది. వీటిని ఇంటికి తీసుకొస్తే మీరు మరింత అదృష్టవంతులుగా మారతారు.
అక్షయ తృతీయ రోజు మొక్కలు, పండ్లు కొనడం మంచి ఆలోచన. ఇది మీ జీవితంలో మరింత మంచి విషయాలను తీసుకొస్తుంది. మొక్కలు, పండ్లు తీసుకురావడం వల్ల ప్రకృతితో ఉన్న అనుభూతిని పొందుతారు. మీ ఇంటికి మరింత ఆనందం, శాంతి వస్తుంది.
అక్షయ తృతీయ రోజు పూర్వీకుల పేరిట చేసే దానధర్మాలు పవిత్రంగా భావిస్తారు. వీలైతే ఈరోజు గంగాజలంతో స్నానమాచరించడం మంచిది. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు, గృహప్రవేశానికి ఉత్తమమైన రోజుగా భావిస్తారు.
ఈ రోజున విష్ణు సహస్రనామం, శ్రీ సూక్తం, శ్రీరామరక్షా స్తోత్రాన్ని పఠించడం మంచిది. సంపాదన పెంపొందించుకునేందుకు అక్షయ తృతీయనాడు ఏకశిలా కొబ్బరికాయను ఎరటి వస్త్రంలో కట్టి భద్రంగా ఉంచాలి. దీన్ని డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచితే మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు.