తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Negative Energy: మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తివంతమైన మార్గాలు ఇవే

Negative energy: మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టే శక్తివంతమైన మార్గాలు ఇవే

Gunti Soundarya HT Telugu

05 August 2024, 14:00 IST

google News
    • Negative energy: ప్రతికూల శక్తి ఉండటం వల్ల మనశ్శాంతి, ఏకాగ్రత కరువవుతుంది. ఆర్థిక, వైవాహిక జీవితంలోను ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే వాటిని తొలగించుకునేందుకు ఉపయోగపడే కొన్ని శక్తివంతమైన మార్గాలు ఇవే. ఒకసారి ప్రయత్నించి చూడండి. 
నెగటివ్ ఎనర్జీని తొలగించుకునే మార్గాలు
నెగటివ్ ఎనర్జీని తొలగించుకునే మార్గాలు (pixabay)

నెగటివ్ ఎనర్జీని తొలగించుకునే మార్గాలు

Negative energy: మన చుట్టూ ప్రతికూల శక్తి ఉంటే ఏ పని చేపట్టినా అందులో వైఫల్యమే ఎదురవుతుంది. మానసిక చికాకు పెరుగుతుంది. మనసులో ఆందోళన నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి, వైవాహిక జీవితం, ఉద్యోగం ఇలా అన్నింటిలోనూ ప్రతికూల పరిస్థితులే ఎదురవుతాయి. వాటి నుంచి బయట పడేందుకు కొన్ని మార్గాలు అనుసరించడం ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మిమ్మల్ని మీరు ప్రకాశవంతులుగా చేసుకునేందుకు పాజిటివ్ ఎనర్జీ పెంచుకునేందుకు ఈ మార్గాలు అనుసరించి చూడండి.

ధ్యానం

మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించుకునేందుకు సులభమైన మార్గాలలో ఒకటి లోతైన ధ్యానం. ప్రతి రోజు 5 లేదా 50 నిమిషాల వరకు ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది మనలోని అంతర్గత స్వభావానికి శక్తులను అనుసంధానించేందుకు ఉపయోగపడుతుంది. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. ధ్యానం చేసేందుకు నిశ్శబ్దమైన ప్రదేశం ఎంచుకోవాలి. నేల మీద కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయాలి. ప్రతికూల ఆలోచనలు తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఉప్పు నీటి స్నానం

ఎప్సం సాల్ట్ లోని వైద్య లక్షణాల కారణంగా పురాతన కాలం నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. స్నానం చేసే నీటిలో ఉప్పు కలుపుకుని చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు తీయగలగుతుంది. ఉప్పు నీటి స్నానం చేయడం వల్ల రీఫ్రెష్ గా అనిపిస్తుంది. ఒక బకెట్ నీళ్ళలో కాస్త పింక్ హిమాలయన్ సాల్ట్ లేదా ఎప్సమ్ సాల్ట్ కలుపుకోవచ్చు. కొద్దిగా గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచిన తర్వాత వాటిని మీరు స్నానానికి ఉపయోగించుకోవచ్చు.

సేజ్ ఆకులు కాల్చడం

సేజ్ ఆకులు కాల్చడం అనేది పురాతన ఆధ్యాత్మిక ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న స్థలాన్ని శుభ్రపరిచేందుకు ఉపయోగపడుతుంది. ఇది ప్రతికూల శక్తుల నుంచి విముక్తి కలిగిస్తుంది. సేజ్ ఆకుల కట్ట ఒకటి తీసుకుని వెలిగించాలి. దీని ద్వారా వచ్చే పొగ ఇంటి మొత్తం వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది. ప్రతికూల ఆలోచనలు దరి చేరవు.

క్రిస్టల్ హీలింగ్

క్రిస్టల్స్ కి సూపర్ పవర్ ఉంటుందని నమ్ముతారు. ఇది మిమ్మల్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది. ప్రతికూల శక్తులను తొలగించుకునేందుకు క్రిస్టల్ క్లియర్ క్వార్ట్జ్ ఉపయోగించవచ్చు. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి చంద్రకాంతిలో ఉంచాలి. అనంతరం దీన్ని మీ చేతులు, మెడ, ఒత్తిడి కలిగించే ప్రదేశాల మీద తేలికగా మర్దన చేసుకోవడం వల్ల విశ్రాంతి భావన కలుగుతుంది.

మంత్రాలు జపించడం

ఇష్టదైవానికి సంబంధించి మంత్రాలు పఠించడం చాలా మంచిది. ఇది మీ చుట్టూ ఉన్న శక్తులను తొలగించేందుకు సహాయపడే శక్తివంతమైన మార్గం. మీరు ఏదైన దేవుడి పేరు జపించినప్పుడు ఒక స్పష్టమైన కంపనం ఏర్పడుతుంది. ఇది మీ చుట్టూ ఉన్న స్థలాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఓం, గాయత్రీ మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం వంటివి జపించడం వల్ల ప్రతికూల శక్తులను వదిలించుకోవచ్చు.

ఆడియో విజువలైజేషన్

మీలోని చెడు ఆలోచనలు దూరం చేసుకునేందుకు ఉన్న మరొక మార్గం ఆడియో విజువలైజేషన్. మెడిటేషన్ కి సంబంధించి ఆడియోలు, వీడియోలు ఇప్పుడు ఆన్ లైన్ లో సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని వినడం వల్ల మీకు ఉత్సాహవంతమైన శక్తి అనుభూతి చెందుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం