తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shani Nakshatra Transit: శని నక్షత్ర మార్పు.. ఈ రాశుల తలరాత మారబోతుంది, లాభాలే లాభాలు

Shani nakshatra transit: శని నక్షత్ర మార్పు.. ఈ రాశుల తలరాత మారబోతుంది, లాభాలే లాభాలు

Gunti Soundarya HT Telugu

05 April 2024, 12:56 IST

google News
    • Shani nakshatra transit: శని ప్రస్తుతం ఉన్న శతభిష నక్షత్రం నుంచి రేపు పూర్వభాద్రపద నక్షత్రంలోకి మారబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశుల వారి తలరాత కూడా మారుతుంది. 
నక్షత్రం మారబోతున్న శని
నక్షత్రం మారబోతున్న శని

నక్షత్రం మారబోతున్న శని

Shani nakshatra transit: జ్యోతిష్య శాస్త్రంలో న్యాయం, కర్మల దేవుడిగా శనిదేవుడిని భావిస్తారు. శని రాశి చక్రం మార్పుతో పాటు నక్షత్ర మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇది ప్రజలపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. శని ప్రస్తుతం తన సొంత రాశి కుంభంలో కూర్చుని ఈ సంవత్సరం పొడుగునా ఇదే రాశిలో ఉంటాడు.

పంచాంగం ప్రకారం ఏప్రిల్ 6 శనివారం రోజు మధ్యాహ్నం 3:55 గంటలకు పూర్వ భాద్రపద నక్షత్రంలోకి శనీశ్వరుడు ప్రవేశిస్తాడు. హిందూ మతంలో శని దేవుని ఆరాధనకు శనివారం ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అటువంటి శనివారం రోజునే శని నక్షత్ర మార్పు అనేక ప్రయోజనాలను ఇస్తుంది. శని అనుగ్రహంతో రేపటి నుంచి కొన్ని రాశుల వారి తలరాత మారుతుంది.

మత విశ్వాసాల ప్రకారం పూర్వ భాద్రపద నక్షత్రానికి అధిపతి దేవగురువు బృహస్పతి. ఈ నక్షత్రంలో జన్మించిన వారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ నక్షత్రం కుంభ, మీన రాశులకు మేలు చేస్తుంది. మళ్ళీ అక్టోబర్ లో శని శతభిష నక్షత్రంలోకి వస్తుంది. శని నక్షత్ర మార్పు ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలిగిస్తుందో చూద్దాం.

మేష రాశి

శని కదలికను మార్చడం వల్ల మేష రాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బు ఆదా చేసుకుంటారు. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు.

కన్య

కన్యా రాశి వారికి శని నక్షత్ర మార్పు శుభ ఫలితాలు తీసుకొస్తుంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. శని, బుధ గ్రహాల స్నేహం ఈ రాశి వారికి విజయాన్ని ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కెరీర్లో ఎదుగుదలకు ఎన్నో సువర్ణ అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. బంధువులతో ఉన్న అపార్ధాలు తొలగిపోతాయి. న్యాయపరమైన విషయాల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి శుభ వార్తలు అందుతాయి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి శని అనుగ్రహం లభిస్తుంది. పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ప్రతి రంగంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు, కొత్తగా వ్యాపారాల ప్రారంభించిన వారికి అనేక ప్రాంతాల నుంచి నిధులు అందుతాయి. ప్రేమ సంబందాల్లో మాధుర్యం ఉంటుంది.

మకరం

శని నక్షత్ర మార్పుతో మకర రాశి వారు ధన లాభం పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భూమి, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరించుకుంటారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. శని దేవుని అనుగ్రహంతో చెడ్డ రోజులు ముగిసిపోయి మంచి రోజులు మొదలవుతాయి.

కుంభ రాశి

శని సంచారం కుంభ రాశి వారికి శుభ ప్రదంగా ఉంటుంది. కుటుంబం పూర్వీకుల నుంచి ఆశీర్వాదం లభిస్తుంది. శని అనుగ్రహంతో సమాజంలో మీ స్థానం, ప్రతిష్ట పెరుగుతాయి. వ్యాపార విషయంలో లాభాలు పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయం కుంభరాశి వారికి చాలా మంచిగా ఉంటుంది.

తదుపరి వ్యాసం