Hanuman kavacham: చెడు దృష్టిని తొలగించుకునేందుకు హనుమాన్ కవచంలోని ఈ శ్లోకం పఠించండి
18 July 2024, 9:00 IST
- Hanuman kavacham: పంచముఖి హనుమంతుడికి సంబంధించి కవచం చదవడం వల్ల చెడు దృష్టి నుంచి బయట పడతారు. ధైర్యం, శక్తి సమర్థ్యాలు పెరుగుతాయి. ప్రతికూలతల నుంచి హనుమంతుడు మీకు రక్షణగా నిలుస్తాడు.
పంచముఖి ఆంజనేయ స్వామి కవచం
Hanuman kavacham: హనుమంతుడు బలం, భక్తి, విధేయతకు ప్రతిరూపం. సప్త చిరంజీవులలో ఒకడిగా ప్రాచుర్యం పొందాడు. ఇప్పటికీ భూమి మీద ఎక్కడో ఒక చోట రామనామం జపిస్తూ ఉన్నాడని భక్తుల విశ్వాసం. తన నిజమైన భక్తులను రక్షించేందుకు ఎప్పుడు ముందుంటాడు. శ్రీరాముడి పట్ల హనుమంతుడికి ఉన్న అచంచలమైన ప్రేమ హనుమాన్ భగవంతుడు అయ్యాడు.
భయాలు, దుష్టశక్తుల పీడల నుంచి బయట పడేందుకు హనుమంతుడిని స్మరించుకోవడం వల్ల భక్తులకు ధైర్యం వస్తుందని నమ్ముతారు. తన భక్తుల మీద ఎటువంటి చెడు దృష్టి పడకుండా రక్షకుడిగా నిలుస్తాడు. హనుమంతుడికి సంబంధించిన కొన్ని స్తోత్రాలు పఠించడం వల్ల జీవితంలో భయం అనేది ఎరుగరు. అందులో పంచముఖ హనుమాన్ కవచం చాలా చక్కగా సహాయపడుతుంది.
ఇది భక్తులకు రక్షణ కవచంలా పనిచేసే శక్తివంతమైన స్తోత్రం. హనుమాన్ కవచాన్ని పఠించడం వల్ల హనుమంతుడి ఆశీస్సులతో పాటు రక్షణ లభిస్తుంది. పంచముఖి హనుమాన్ గురించి వివరించే ఈ స్తోత్రం చాలా పెద్దది. అయినప్పటికీ ఇందులోని నాలుగు పంక్తులు ఎల్లపుడూ పఠించడం వల్ల ఎటువంటి చెడు దృష్టి మీ మీద ఉండదు. పంచముఖి హనుమాన్ శక్తి సామర్థ్యాలను ఈ శ్లోకం వివరిస్తుంది. హనుమంతుడు తన ఆయుధాలతో ఎలా అండగా నిలుస్తాడు అనేది వెల్లడిస్తుంది.
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశమంకుశపర్వతం |
ముష్టిం కౌమోదకీం వృక్షం ధారయన్తం కమణ్డలుమ్ ॥
భిందిపాలం జ్ఞానముద్రాం దశభిర్మునిపుంగవం|
ఏతాన్యాయుధజాలాని ధారయన్తం భజామ్యహమ్ ॥
ఇది చాలా శక్తివంతమైన శ్లోకం. ఇందులో పంచముఖి హనుమాన్ తన భక్తులను ఏ విధంగా సంరక్షిస్తాడు అనేది ఉంటుంది. ఒక్కో పంక్తి అర్థం గురించి తెలుసుకుందాం.
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశమంకుశపర్వతం |
ఇది హనుమంతుడి వద్ద ఉన్న అనేక ఆయుధాల గురించి వివరిస్తుంది. ప్రతి ఆయుధానికి ప్రతీకాత్మక అర్థం ఉంటుంది. ఖడ్గం లేదా కత్తి బలం, అజ్ఞానం భ్రమలను తొలగించే శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. త్రిశూలం వినాశనానికి దారి తీసే చెడును తొలగించేందుకు సూచిస్తుంది. అలాగే ఖట్వంగా అనేది భౌతిక మరణ భయాన్నితొలగించేందుకు సహాయపడుతుంది. శక్తి , వివేకం, సామర్థ్యం, మనసున నియంత్రించి సరైన దిశలో నడిపించేందుకు అవసరమైన పాశ, అంకుశ, పర్వత కూడా ఉన్నాయి.
ముష్టిం కౌమోదకీం వృక్షం ధారయన్తం కమణ్డలుమ్
ఈ పంక్తి హనుమాన్ చేతిలో ఉన్న వస్తువుల గురించి వివరిస్తుంది. ముష్టి అంటే పిడికిలి. బిగించిన పిడికిలి బలం, రక్షణకు చిహ్నం. కౌమోదకి అంటే దుష్టశక్తుల పైన తన అధికారాన్ని చూపించడం. ఇక వృక్షం తన భక్తులను అన్ని రకాల చెడుల నుంచి ఎలా ఆశ్రయం ఇవ్వగలదో చెబుతుంది. కమండలం లేదా నీటికుండ స్వచ్ఛత, ఆధ్యాత్మిక జ్ఞానానికి చిహ్నం.
భిందిపాలం జ్ఞానముద్రాం దశభిర్మునిపుంగవం
ఈ పంక్తి హనుమంతుడు అనే చేతిలో పట్టుకున్న ఆయుధాల గురించి తెలుపుతుంది. భింది పాలెం అంటే గొడ్డలి ఎటువంటి ప్రతికూలతలనైన, చెడు శక్తులనైనా గొడ్డలితో నరికి వేయగలరని ఇది సూచిస్తుంది. తన భక్తులను ప్రభావితం చేసే చెడు శక్తులను ఆపేందుకు దీన్ని చిహ్నంగా భావిస్తారు.
ఏతాన్యాయుధజాలాని ధారయన్తం భజామ్యహమ్
ఇది ప్రాథమికంగా పంచముఖి హనుమంతుడి లక్షణాల గురించి, అతని చేతిలో ఉన్న అనేక ఆయుధాలు భక్తులను ఎలాంటి దుష్టశక్తుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయో తెలుపుతుంది. చివరి పదం 'భజామ్యహం' భక్తి భావాన్ని సూచిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్