Goddess lakshmi devi: జాతకంలో ఈ గ్రహం బలంగా లేకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కష్టమే
Goddess lakshmi devi: నవగ్రహాలలో లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహం శుక్రుడు. జాతకంలో ఈ గ్రహం బలంగా లేకపోతే అమ్మవారి అనుగ్రహం పొందలేరు. శుక్రుడి స్థానం బలంగా ఉండేందుకు పాటించాల్సిన కొన్ని చర్యలు ఉన్నాయి. అవేంటంటే..
Goddess lakshmi devi: ప్రతి ఒక్కరూ జీవితంలో సంపద, శ్రేయస్సు కోరుకుంటారు. నవగ్రహాలలో లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహం ఒకటి ఉంది. ఈ గ్రహం బలహీనంగా మారినప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. మీ ప్రేమ జీవితం కూడా చెడిపోతుంది. ఒకరి జీవితంలో సంపద, శ్రేయస్సు, విలాసానికి బాధ్యత వహించే గ్రహంగా శుక్రుడిని పరిగణిస్తారు.

జాతకంలో శుక్రుడు సరైన స్థానంలో ఉంటే జీవితం ఆనందంగా ఉంటుంది. అలాంటి జాతకం ఉన్నవారికి ఎలాంటి డబ్బు, మానసిక, శారీరక సమస్యలు ఉండవు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు బలమైన స్థానంలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతారు. అందుకే వివాహానికి ముహూర్తం చూసేటప్పుడు శుక్రుడి శుభ స్థానం తప్పకుండా చూస్తారు. శుక్రుడి ప్రభావం ప్రేమ, ఆర్థిక, వైవాహిక జీవితం మీద స్పష్టంగా ఉంటుంది. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి.
శుక్రుడు బలహీనంగా ఉన్నాడనేందుకు సంకేతాలు
జాతకంలో శుక్రుడు మీకు మేలు చేయడం లేదని తెలియజేసే కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో లేకపోతే వారికి చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆర్థిక సమస్యలు, మీ వైవాహిక జీవితంలో సమస్యలు, పరిశుభ్రత పట్ల శ్రద్ధ లేకపోవడం జరుగుతుంది. ఇంటి నుండి ఆనందం దూరమవుతుంది. అప్పుల సమస్యలతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
శుక్రుడిని బలపరిచే మార్గాలు
శుక్రుడు వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రతను ఇష్టపడతాడు. ఇలా ఉంటే మీ జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి, గోర్లు కత్తిరించుకోవాలి, మంచి కేశాలంకరణ, శుభ్రమైన జుట్టు కలిగి ఉండాలి.
శుక్రుడికి మంచి సువాసనతో ప్రత్యేక సంబంధం ఉంది. జీవితంలో శుభ్రమైన బట్టలు ధరించి, పరిమళం రాసుకుంటే శుక్రుని స్థానం బాగుంటుంది. వీలైతే శుక్రవారం తెల్లటి బట్టలు ధరించండి. ఇది శుక్రుడు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి కూడా సహాయపడుతుంది. మీ ఇంటిని మంచి సువాసన వచ్చే విధంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే లక్ష్మీ దేవిని పూజించడం చేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ నైవేద్యంగా సమర్పించి పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారు. లక్ష్మీ దేవి ఆలయాన్ని సందర్శించి శుక్రవారం ఉపవాసం కూడా చేయాలి.
పెద్దలను, మహిళలను గౌరవించాలి
చిన్నారులు, జీవిత భాగస్వాములు, తల్లులు, సోదరీమణులను గౌరవించాలి. మీరు మీ జీవిత భాగస్వామిని గౌరవించి, అతనిని/ఆమెను సంతోషంగా ఉంచినప్పుడు శుక్రుడు కూడా సంతోషిస్తాడు. అంతే కాకుండా ఇంట్లో తల్లిని, చెల్లెళ్లను, ఆడపిల్లలను గౌరవించడం, వారిని సంతోషంగా ఉంచడం వల్ల కూడా శుక్రుని స్థానం మెరుగుపడుతుంది.
శుక్రుడికి ఇష్టమైన రాశులు ఇవే
జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని ఆనంద గ్రహంగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నవారికి జీవితంలో ధనానికి లోటు ఉండదని చెబుతారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే వారికి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు కూడా లభిస్తాయి. మొత్తం పన్నెండు రాశులలో మూడు రాశులకు శుక్రుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అవి ఏవంటే..
వృషభ రాశి
వృషభ రాశిని పాలించే గ్రహం శుక్రుడు. ఈ రాశి వాళ్ళు తెలివిగా చాలా చురుకైన వారిగా ఉంటారు. ఇతరులను త్వరగా ఆకర్షించగలుగుతారు. కెరీర్ లో ఒక డిఫరెంట్ ఐడెంటిటీని ఏర్పరుచుకోవడంలో సక్సెస్ అవుతారు. ఈ రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది.
తులా రాశి
తులా రాశికి కూడా శుక్రుడు అధిపతి. శుక్రుడి అనుగ్రహం వల్ల జీవితంలో అన్నీ సౌఖ్యాలు లభిస్తాయి. తెలివైనవాళ్ళు. ప్రతి పనిలో నిపుణులుగా ఉంటారు. మంచి వ్యాపారవేత్తలుగా రాణిస్తారు.
మీన రాశి
శుక్రుడికి మీన రాశి ఉన్నత రాశి. ఈ రాశి వాళ్ళు చాలా ప్రతిభావంతులు, సృజనాత్మకంగా ఉంటారు. ప్రతి రంగంలో విజయాలు సాధిస్తారు. మొండి స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని తలపెడితే అది పూర్తి చేసే వరకు నిరంతరం శ్రమిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.