Isha ambani: ఇషా అంబానీ లెహంగాపై సంస్కృత శ్లోకం.. దాని అర్థం ఏంటో తెలుసా?-isha ambani wears beautiful lehenga with sanskrit shloka ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Isha Ambani: ఇషా అంబానీ లెహంగాపై సంస్కృత శ్లోకం.. దాని అర్థం ఏంటో తెలుసా?

Isha ambani: ఇషా అంబానీ లెహంగాపై సంస్కృత శ్లోకం.. దాని అర్థం ఏంటో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Jul 13, 2024 01:10 PM IST

Isha ambani: అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో భాగంగా శివశక్తి పూజ నిర్వహించారు. ఈ పూజకు ఇషా అంబానీ ధరించిన లెహంగా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం ఈ లెహంగాపై సంస్కృత శ్లోకం కూడా ఉంది.

ఇషా అంబానీ లెహంగాపై సంస్కృత శ్లోకం
ఇషా అంబానీ లెహంగాపై సంస్కృత శ్లోకం (instagram)

Isha ambani: దేశమంతా అంబానీ ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకల గురించి మాట్లాడుకుంటుంది. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ ధరించిన దుస్తులు, ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పెళ్ళికి ముందు ముంబైలోని తమ విలాసవంతమైన నివాసం యాంటిలియాలో అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన శివశక్తి పూజలో ఇషా అంబానీ ధరించిన లెహంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆధునికతను సంప్రదాయాన్ని జోడిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన లెహంగాను ఇషా ధరించింది.

ట్రీ ఆఫ్ లైఫ్ థీమ్

హస్తకళలు, నేత పద్ధతులు అనుసరిస్తూ ప్రత్యేకంగా కనిపించే విధంగా ఇషా అంబానీ ఈ లెహంగాను తయారు చేయించారు. సంప్రదాయబద్ధంగా కనిపించే విధంగా వేదమంత్రాలు కూడా ఇందులో ఇనుమడింప చేశారు. లెహంగాలోనే ప్రతి భాగాన్ని అద్భుతమైన రీతిలో రూపొందించారు. ఢిల్లీకి చెందిన వింటేజ్ కో ఈ సాంప్రదాయమైన లెహంగాని రూపొందించింది. ఈ లెహంగాను ‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే థీమ్ తో రూపొందించారు.

ఈ లెహంగా సాంస్కృతికంగా, సమకాలీనంగా, ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు. క్లిష్టమైన ట్రీ ఆఫ్ లైఫ డిజైన్ లో నంది కూర్చున్న బొమ్మలు, ఒక వైపు ఆలయం, మరొక వైపు సామరస్యం, సమతుల్యతను సూచించే పక్షులు అక్కడక్కడ ఉన్నాయి. కళాత్మక అంశాలు, కుట్టు పద్దతులు, పాతకాలపు ఆకృతితో కూడిన వస్త్రాన్ని ఎంచుకున్నారు. పురాతన నాణేలు, పాతకాలపు అలంకారాలతో దీన్ని అందంగా రూపొందించారు.

భగవద్గీత శ్లోకం

శివశక్తి పూజ రోజు ధరించిన ఈ లెహంగా ఆధ్యాత్మికతను ప్రోత్సహించే విధంగా చేశారు. పూజకు సరిగా సరిపోయే విధంగా వేద మంత్రాలతో కూడిన డ్రెస్ ధరించి ఇషా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ లెహంగా అంచుల దగ్గర భగవద్గీతలోని శక్తివంతమైన శ్లోకాన్ని ముద్రించారు.

“కర్మణ్యే వాధికారస్తే, మా ఫలేషు కదా చన” అనే శ్లోకం ఈ లెహంగా అంచుల మీద కనిపిస్తుంది. దీని అర్థం “ఏదైన పని చేసే హక్కు మీకు ఉంది, కానీ ఆ చర్యల ఫలాలను పొందేందుకు అర్హులు కాదు” అని దీని అర్థం. ఈ సందేశం ఆధ్యాత్మికతను, సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంచుతుంది. శ్రేయస్సును సూచిస్తుంది. ఈ ప్రత్యేకమైన దుస్తులు వేద శ్లోకాల పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేశాయి. భారతీయ సంప్రదాయం అడుగడుగున కనిపించే విధంగా ఇది ఉండటం విశేషం.

4 వేల గంటలు

ఈ దుస్తులను తయారు చేయించేందుకు స్వయంగా ఇషా ప్రఖ్యాత స్టైలిస్ట్ అనైటా ష్రాఫ్ అడజానియాతో అనేక చర్చలు జరిపి ఫైనల్ గా ఇలా రూపొందించారు. ఈ లెహంగా పూర్తి చేసేందుకు సుమారు 4000 గంటల సమయం పట్టింది. శివశక్తి పూజ వేడుకలో ఇషా ఈ లెహంగాలో కనిపించి తన అద్భుతమైన అభిరుచిని, సంప్రదాయాన్ని తెలియజేసింది. ఆమె దుస్తులు భారతదేశ సాంస్కృతిక వారసత్వం, హస్తకళలను కూడా ప్రదర్శించాయి. లెహంగాకు సరిపోయే విధంగా ఇషా టెంపుల్ జ్యుయలరీ ధరించింది. నుదుట కుంకుమ ధరించి ఆధునికంగా ఉంటూనే సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచింది.

Whats_app_banner