Lingashtakam: లింగాష్టకంలోని ఈ శ్లోకం పఠించడం వల్ల మీ చింతలన్నీ దూరం అవుతాయి-by reciting this hymn in lingastakam all your worries will go away ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lingashtakam: లింగాష్టకంలోని ఈ శ్లోకం పఠించడం వల్ల మీ చింతలన్నీ దూరం అవుతాయి

Lingashtakam: లింగాష్టకంలోని ఈ శ్లోకం పఠించడం వల్ల మీ చింతలన్నీ దూరం అవుతాయి

Gunti Soundarya HT Telugu
Jul 09, 2024 12:25 PM IST

Lingashtakam: శివుడిని ఆరాధించేందుకు లింగాష్టకం పఠించడం మంచి మార్గం. ఇందులోని శ్లోకాలు నిత్యం పారాయణం చేయడం వల్ల జీవితంలోని అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మరణం అనంతరం మోక్షం లభిస్తుంది.

లింగాష్టకం
లింగాష్టకం (pixabay)

Lingashtakam: సృష్టికర్త, వినాశక కర్త రెండూ శివుడే అని చాలా మంది నమ్ముతారు. శివుడి చేతిలో ఉంటే త్రిశూలం సృష్టి, సంరక్షణ, విధ్వంసం అనే మూడు శక్తుల నియంత్రణను సూచిస్తుంది. సోమవారం శివుడికి అంకితం చేసిన రోజుగా చెప్తారు. అందుకే ఎక్కువగా ఆరోజు శివారాధన చేస్తారు.

శివుడి కోపం భరించలేనిది. పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలు దరిచేరవని భక్తుల విశ్వాసం. శివలింగానికి బిల్వ పత్రాలు సమర్పించి స్వచ్చమైన నీటితో అభిషేకం చేస్తే భోళా శంకరుడు కనికరిస్తాడు. అందుకే అభిషేకం శివం ప్రియం అంటారు. శివుడిని ధ్యానించేందుకు ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి లింగాష్టక స్తోత్రం. నిత్యం ఈ స్తోత్రం పారాయణం చేయడం వల్ల అనంతమైన ఫలితాలు పొందుతారు.

లింగాష్టక స్తోత్రం

లింగాష్టకం అనేది శివలింగ రూపంలో ఉన్న శివుని గుణగణాలు, రూపాన్ని గురించి చెప్పే అద్భుతమైన భక్తి గీతం. ఇందులో ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి. వాటినే అష్టకాలు అని కూడా పిలుస్తారు. శివుని పట్ల తమకున్న ఆచంచలమైన భక్తిని వ్యక్తపరిచేందుకు భక్తులు ఈ స్తోత్రం పఠిస్తారు. శివలింగం వైభవాన్ని, శివుని అనేక రూపాలను ఇది వివరిస్తుంది. ఇందులోని శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి.

బ్రహ్మ మురారి సురార్చిత లింగం

లింగాష్టకం స్తోత్రంలోని మొదటి శ్లోకం ‘బ్రహ్మ మురారి సురార్చిత లింగం’ అనే పంక్తితో ప్రారంభమవుతుంది. శివలింగం ప్రాముఖ్యత గురించి ఇది తెలియజేస్తుంది. బ్రహ్మ, విష్ణువు ఏ విధంగా శివలింగానికి గౌరవం ఇస్తారో చెబుతుంది. ఈ విశ్వంలో సృష్టి, సంరక్షణ, విధ్వంసం ప్రాముఖ్యత గురించి ఈ వాక్యం తెలుపుతుంది.

నిర్మల భాషిత శోభిత లింగం

ఈ వాక్యం శివలింగం స్వచ్చత, పవిత్రతను చాటి చెబుతుంది. నిర్మల భాషిత అనే పద్యం వేద శ్లోకాల నుంచి వచ్చింది. లింగం శక్తితో నిండి ఉంటుందని సూచిస్తుంది. నిజమైన భక్తితో ఆరాధిస్తే శివుడు కనికరిస్తాడని అంటారు. చిత్తశుద్ధితో, పూర్వ మనసులో ఆరాధించాలని ఈ వాక్యం సూచిస్తుంది.

జన్మజ దుఃఖ వినాశక లింగం

ఈ స్తోత్రంలోని మూడో పంక్తి జన్మజ దుఃఖ వినాశక లింగం. గత జీవితంలో చేసిన దుఃఖాన్ని, పాపాలను ఎలా నాశనం చేయగలదో సూచిస్తుంది. జనన మరణ చక్రాల నుంచి ఆత్మను విముక్తి కలిగించడం శివుడి వల్లే సాధ్యమవుతుంది. శివలింగాన్ని ఆరాధించడం వల్ల భక్తులు తమ దుఃఖాలు, బాధల నుంచి విముక్తి పొందు మోక్షం వైపు పయనిస్తారని చెబుతారు.

తత్ ప్రణమామి సదా శివ లింగం

మొదటి అష్టకంలోని చివరి పంక్తి ఈ తత్ ప్రణమామి సదా శివ లింగం. నేను శివలింగానికి నమస్కరిస్తున్నాను అని తెలియజేయడం దీని అర్థం. భక్తులు తమని తాము శివుడికి సమర్పించుకోవడాన్ని ఇది సూచిస్తుంది. తత్ ప్రణమామి అని పలకడం వల్ల శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తున్నట్టు మన అంగీకారం తెలిపడం. ఈ లింగాష్టకంలోని శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మనసులో ఎటువంటి చికాకులు లేకుండా శివయ్య అనుగ్రహంతో ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా శివుడి అనుగ్రహంతో అవి తొలగిపోతాయని నమ్ముతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

WhatsApp channel