Lingashtakam Lyrics: లింగాష్టకం.. 8 శ్లోకాలు గల ఈ అష్టకాన్ని చదివితే శివలోకాన్ని పొందుతారు-lingashtakam lyrics in telugu to attain shiva lokam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lingashtakam Lyrics: లింగాష్టకం.. 8 శ్లోకాలు గల ఈ అష్టకాన్ని చదివితే శివలోకాన్ని పొందుతారు

Lingashtakam Lyrics: లింగాష్టకం.. 8 శ్లోకాలు గల ఈ అష్టకాన్ని చదివితే శివలోకాన్ని పొందుతారు

HT Telugu Desk HT Telugu
Mar 08, 2024 11:14 AM IST

Lingashtakam Lyrics: 8 శ్లోకాలు గల ఈ లింగాష్టకాన్ని చదివితే శివలోకాన్ని పొందుతారు. బ్రహ్మాది దేవతలు కొలిచే సదాశివ లింగానికి నమస్కరిస్తున్నానంటూ ఈ లింగాష్టకం మొదలవుతుంది.

శివ లింగానికి పూజలు చేస్తున్న భక్తులు
శివ లింగానికి పూజలు చేస్తున్న భక్తులు (Bharat Bhushan Barnale )

లింగాష్టకం:

బ్రహ్మమురారి సురార్చిత లింగం

నిర్మల భాసిత శోభిత లింగమ్

జన్మజ దు:ఖ వినాశక లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్

తాత్పర్యం: బ్రహ్మ, విష్ణు మొదలగు దేవతలు అర్చించే లింగం, నిర్మలత్వం, శోభాయమానమైన లింగం, జన్మతో ముడిపడి ఉన్న దు:ఖాలను నశింపజేసే లింగం అయిన సదా శివ లింగానికి ప్రణామం చేస్తున్నాను.

 

దేవముని ప్రవరార్చిత లింగం

కామదహం కరుణాకర లింగమ్

రావణ దర్ప వినాశన లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్

తాత్పర్యం: దేవతులు, రుషులు అర్చించే లింగం, కోరికలను దహించి వేసే కరుణను కలిగి ఉన్న లింగం, రావణుడి దర్పాన్ని నాశనం చేసిన లింగమైన సదాశివ లింగానికి ప్రణామం చేస్తున్నాను.

 

సర్వ సుగంధ లేపిత లింగం

బుద్ధివివర్థన కారణ లింగమ్

సిద్ధసురాసుర వందిత లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్

తాత్పర్యం: సర్వ సుగంధాలతో పూజలు అందుకుంటున్న లింగం, బుద్ధి వికాసానికి కారణమైన లింగం, యోగులు, దేవతులు, రాక్షసుల వందనాలు అందుకుంటున్న సదాశివ లింగానికి ప్రణామం చేస్తున్నాను.

 

కనక మహామణి భూషిత లింగం

ఫణిపతివేష్ఠిత శోభిత లింగమ్

దక్ష సుయజ్ఞ వినాశన లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్

తాత్పర్యం: బంగారం, మణులతో అలంకారాలు పొంది, సర్పరాజుతో శోభితమై, దక్ష యజ్ఞం నాశనం చేసిన సదా శివ లింగానికి ప్రణామం చేస్తున్నాను.

 

కుంకుమ చందన లేపిత లింగం

పంకజహార సుశోభిత లింగమ్

సంచితపాప వినాశన లింగం

తత్ప్రణామి సదా శివ లింగమ్

తాత్పర్యం: కుంకుమ, గంధంలతో లేపితమైన లింగం, తామర పువ్వులను హారంగా ఉన్న లింగం, పాపాలను నాశనం చేసే సదాశివ లింగానికి ప్రణామం చేస్తున్నాను.

 

దేవగణార్చిత సేవిత లింగం

భావైర్భక్తిభిరేవ చ లింగమ్

దినకర కోటి ప్రభాకర లింగం

తత్ప్రణమామి సదాశివ లింగమ్

తాత్పర్యం: దేవగాణాలు భక్తిభావంతో పూజిస్తున్న లింగం, కోటి సూర్య సమానమైన శోభతో ఉన్న సదా శివ లింగానికి ప్రణామం చేస్తున్నాను.

 

అష్టదళో పరివేష్టిత లింగం

సర్వ సముద్భవ కారణ లింగమ్

అష్ట దరిద్ర వినాశన లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్

తాత్పర్యం: ఎనిమిది దళాలను కలిగి ఉన్న లింగం, సమస్త సృష్టికి కారణమైన లింగం, అష్ట దరిద్రాలను నశింపజేయగల లింగమైన సదాశివ లింగానికి నమస్కరిస్తున్నాను.

 

సురగురుసురవరపూజిత లింగం

సురవన పుష్పసదార్చిత లింగమ్

పరాత్పరం పరమాత్మక లింగం

తత్ప్రణమామి సదా శివ లింగమ్

తాత్పర్యం: దేవ గురువు బృహస్పతితో పూజలందుకుంటున్న లింగం, దేవతల పూతోటలోని పూలతో అర్చన అందుకుంటున్న లింగం, పరమాత్మ స్థాయిలో ఉన్న లింగం అయిన సదా శివ లింగానికి నమస్కరిస్తున్నాను.

 

లింగాష్టకం ఇదం పుణ్యం య: పఠేచ్ఛివసన్నిధౌ

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

తాత్పర్యం: లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన 8 శ్లోకాలను చదివిన వారు శివుడి కృపకు పాత్రులవుతారు. శివ లోకమును పొందుతారు.

WhatsApp channel