Jagannath rathayatra 2024: జగన్నాథ రథయాత్రలో రథాన్ని లాగితే మోక్షం లభిస్తుంది
Jagannath rathayatra 2024: ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రథాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
Jagannath rathayatra 2024: అందరి దృష్టిని ఆకర్షించే మహత్తర యాత్ర జగన్నాథ రథయాత్ర. ఒడిశాలోని పూరీలో జరిగే ఈ యాత్ర తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఏటా ఆషాడ మాసంలో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. ఈ ఏడాది జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది.
రథయాత్ర ప్రారంభం కావడానికి ముందు జగన్నాథుడు జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి నుండి అమావాస్య వరకు అనారోగ్యానికి గురవుతాడు. పక్షం రోజుల పాటు ఆలయం తలుపులు మూసివేస్తారు. దీన్నే ఆలయ భాషలో అనసార్ అంటారు. ఈ సమయంలో దేవుని దర్శనం ఉండదు. దేవుడికి మూలికలతో చేసిన కషాయాలను అందిస్తారు. ఈ సంప్రదాయం వేలాది సంవత్సరాలుగా కొనసాగుతోంది. రథయాత్రకు ఒక రోజు ముందు నుంచి స్వామి వారు ఆరోగ్యంగా ఉంటారు. అప్పుడు వారిని ఆలయ గర్భగుడికి తిరిగి తీసుకువస్తారు.
జూలై 7 న జగన్నాథుడు, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కలిసి గుండిచా ఆలయానికి వెళ్తాడు. ఇక్కడ స్వామివారికి వివిధ రకాల వంటకాలు అందిస్తారు. స్వామి వారు తొమ్మిది రోజులు ఇక్కడే ఉంటాడ. ఆ తరువాత అతను తన అత్త ఇంటి నుండి తన ఆలయానికి తిరిగి వస్తాడు. ఈ రథయాత్ర జగన్నాథ్ ఆలయం నుండి ప్రారంభమై పూరీ పట్టణం గుండా వెళ్లి గుండిచా ఆలయానికి చేరుకుంటుంది. ఇక్కడ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు.
గుండిచా ఆలయం జగన్నాథుడు అత్త నివాసంగా చెప్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం దేవశిల్పి విశ్వకర్మ జగన్నాథ్, బలభద్ర, దేవి సుభధ్ర విగ్రహాలను నిర్మించారు. ఆషాడ మాసం పదవ రోజున అన్ని రథాలు మళ్ళీ ప్రధాన ఆలయం వైపు బయలుదేరుతాయి. రథాల ఉపసంహరణ కర్మను బహుదా యాత్ర అంటారు.
రథయాత్రకు సంబంధించి ప్రత్యేక విశేషాలు
పూరీలో రథయాత్ర కోసం జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర కోసం మూడు వేర్వేరు రథాలు తయారు చేస్తారు. బలభద్రుడి రథం ముందు వరుసలో ఉంటే మధ్యలో సుభద్ర అమ్మవారి రథం ఉంటుంది. ఇక వెనుక జగన్నాథుడి రథం ఉంటుంది. బలభద్ర రథాన్ని తలాధ్వజ్ అంటారు. దీని రంగు ఎరుపు, ఆకుపచ్చగా ఉంటుంది. ఇక సుభద్ర దేవి రథం పేరు పద్మ రథం లేడా దర్పాదలన్ అని పిలుస్తారు. ఇది నలుపు, ఎరుపు రంగులో ఉంటుంది. ఇక చివరిగా జగన్నాథుడి రథం పేరు గరుడ్వజ లేదా నందిఘోష అని పిలుస్తా రథం ఎరుపు, పసుపు రంగులో ఉంటుంది.
అన్ని రథాలు వేప చెక్కతో ఎటువంటి ఇనుము ఉపయోగించకుండా ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిని 'దారు' అంటారు. ఇందుకోసం జగన్నాథ్ ఆలయంలో ప్రత్యేక కమిటీ ఏర్పడుతుంది. జగన్నాథుడి రథం 45.6 అడుగుల ఎత్తు, బలభద్రుడి రథం 45 అడుగులు, సుభధ్రా దేవి రథం 44.6 అడుగుల ఎత్తు ఉంటుంది. రతయాత్రలో పాల్గొన్న భక్తులకు విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. జగన్నాథుడి రథయాత్రలో రథాన్నిలాగడం వల్ల మరణించిన తర్వాత ఆత్మకు ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. భక్తులు ఉపవాసం ఉండి ఈ రథాలను లాగుతారు.