Jyestha purnima 2024: సనాతన ధర్మంలో ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దృక్ పంచాంగ్ ప్రకారం జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి 21 జూన్ 2024న జరుపుకుంటారు. ఈరోజే వట పౌర్ణమి వ్రతం, సంత్ కబీర్ దాస్ జయంతి కూడా జరుపుకుంటారు.
జ్యేష్ఠ పూర్ణిమ నాడు శ్రీమహా విష్ణువును పూజించడం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని మత విశ్వాసం. ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సు,సంతోషాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ శుభ యోగం, శుక్ల యోగంలో వస్తుంది.
ఇవే కాకుండా సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఎన్నో అద్భుతమైన కలయికలను సృష్టిస్తున్నారు. శుక్రాదిత్య యోగం, బుధాదిత్య రాజయోగం కూడా ఉన్నాయి. దీని వల్ల కొన్ని రాశుల వారికి జ్యేష్ఠ పూర్ణిమ నుండి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి. మీరు జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో సంపద, శ్రేయస్సు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభ రాశి వారికి జ్యేష్ఠ పూర్ణిమతో శుభకాలానికి నాంది పలుకుతుంది. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు. మీరు కెరీర్‌లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు. డబ్బు సంపాదించడానికి అనేక సువర్ణావకాశాలు లభిస్తాయి. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతిని సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా శుభ సమయం అవుతుంది. మీరు పోటీ పరీక్షలలో గొప్ప విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులు చక్కబెట్టుకుంటారు.
సింహ రాశి వారికి జ్యేష్ఠ పూర్ణిమ నుంచి సకల బాధలు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. ఊహించని ధనలాభం ఉంటుంది. కొంతమందికి పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సౌభాగ్యాలు కలుగుతాయి. కష్టపడి చేసే పనులు చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్థులకు మంచి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో మారాలి అనుకునే వారికి జ్యేష్ఠ పౌర్ణమి రోజు మంచి అవకాశాలు అందుతాయి. ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.
జ్యేష్ఠ పూర్ణిమ రోజు ధనుస్సు రాశి వారికి చాలా అదృష్టమని రుజువు చేస్తుంది. ఈ సమయంలో మీ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పని విజయవంతమవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు కెరీర్ కి సంబంధించిన శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో విస్తరణ ఉంటుంది. వివాహితులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.