Shiva lingam: ప్రపంచం అంతాన్ని సూచించే శివలింగం.. ఎక్కడ ఉందో తెలుసా?-patal bhuvaneshwar shiv lingam that suggests the end of the world ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shiva Lingam: ప్రపంచం అంతాన్ని సూచించే శివలింగం.. ఎక్కడ ఉందో తెలుసా?

Shiva lingam: ప్రపంచం అంతాన్ని సూచించే శివలింగం.. ఎక్కడ ఉందో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Jun 26, 2024 03:02 PM IST

Shiva lingam: ఉత్తరాఖండ్ లోని పాతాళ భువనేశ్వర్ ఎన్నో వింతలు, విశేషాలకు నిలయంగా మారింది. ఇక్కడ ఉన్న శివలింగం గుహ పైకప్పును తాకితే కలియుగం అంతం అవుతుందని చెబుతారు.

శివలింగం( Representational image)
శివలింగం( Representational image) (pinterest)

Shiva lingam: భారతదేశం ఎన్నో ఆలయాలకు పెట్టింది పేరు. కొన్ని ఆలయాలలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. ఎంతో ఆశ్చర్యం కలిగించే ఆలయాలు గురించి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటిది ఒకటి ఈ ఉత్తరాఖండ్ లోని పాతాళ భువనేశ్వర్ గుహ.

ఇది అనేక విభిన్న రహస్యాలకు నిలయంగా పేరు గడిచింది. పేరులో ఉన్నట్టుగానే ఇది పాతాళాన్ని సూచిస్తుంది. సహజమైన సున్నపురాయితో ఉండే ఈ గుహ భౌగోళిక అద్భుతం మాత్రమే కాదు ప్రపంచంలో నలుమూలల నుంచి యాత్రికులకు ఆకర్షిస్తుంది. ఈ గుహ సాధారణ నేల స్థాయి కంటే చాలా దిగువన ఉంది. గుహ లోపల ప్రత్యేకమైన సహజమైన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గుహ గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ఆది శంకారాచార్యులు ధ్యానం చేసింది ఇక్కడే

ఈ గుహను మొదటగా కనుగొన్న వ్యక్తి రుతుపర్ణ రాజుగా చెప్తారు. ఒకనాడు రాజుకు కలలో జింకలు కనిపించాయి. తనని చంపొద్దు అని రాజును జింకలు వేడుకుంటున్నట్టు కనిపించాయి. మరుసటి రోజు రాజుకు నిజంగానే అడవిలో జింకలు కనిపించాయి. వాటిని వెతుక్కుంటూ ఈ గుహలోకి వెళ్ళాడు. అతను గుహలోకి ప్రవేశించినప్పుడు శేషనాగ్ స్వయంగా అతనిని ముందుకు నడిపిస్తాడు. రాజు రుతుపర్ణ లోపల ఉన్న దేవతలందరినీ చూస్తాడు. అయితే ఈ గుహ గురించి కలియుగం వరకు ఎవరికీ తెలియకుండా ఉండాలని అనుకున్నాడు. తర్వాత కలియుగంలో ఆది శంకరాచార్యులు ఈ గుహను మళ్ళీ సందర్శించారు. ఆయన ఇక్కడ ధ్యానం చేసినట్టు చెప్తారు. అప్పటి నుంచి ఇది భక్తులకు, యాత్రికులకు సందర్శన స్థలంగా మారింది.

గృహప్రవేశ ద్వారం ప్రమాదకరం

పాతాళ భువనేశ్వర్ కు ప్రయాణం దాదాపు 90 అడుగుల నిటారుగా దిగడంతో ప్రారంభమవుతుంది కిందికి వెళ్లే మార్గం చాలా ఇరుకుగా జారిపోయే విధంగా ఉంటుంది. ఇది చాలా సాహసోపేతమైన మార్గం. ప్రజలు పాతాళంలోకి ప్రవేశిస్తున్నారనడానికి ఈ ప్రయాణం ఒక చిహ్నంగా కూడా చెప్తారు.ఈ గుహలో అత్యంత ప్రత్యేకమైన విస్మయం కలిగించే కథలలో ఒకటి వినాయకుడు తల ఈ గుహలోనే ఉందని అంటారు. వినాయకుడి తలను దేవతలు సురక్షితంగా కాపాడుతున్నారని కానీ ఇప్పుడు అది సున్నపురాయితో పూర్తిగా కప్పబడి స్పష్టంగా కనిపించదని చెప్తారు.

శేషనాగు వెన్నెముక

ఈ గుహ గురించి ఉన్న మరొక రహస్యమైన విషయం ఏమిటంటే లోపలికి నడిచేటప్పుడు వాళ్ళు వెన్నెముక, పక్కటెముకలా కనిపించే ఒక ఆకారం కనిపిస్తుంది. ఈ వెన్నెముక చాలా పొడవుగా ఉంటుంది. అది సర్వశక్తివంతమైన సర్పమైన శేషనాగు వెన్నెముక అని పురాణాలు చెబుతున్నాయి. ఈ శేషనాగ వెన్నెముక గుహ పైకప్పుతో పాటు నేల మీద కూడా ఉంటుందని చెబుతారు.

గంగానది ప్రవాహాన్ని నియంత్రించడానికి శివుడు తన జటాయువుతో బంధించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అటువంటి సహజ నిర్మాణం ఈ గుహలో కూడా కనిపిస్తుంది. గుహపై భాగం నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. అయితే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయని విషయం మాత్రం ఎవరికీ తెలియదు.

ప్రపంచం అంతాన్ని సూచించే శివలింగం

గుహ లోపల మరొక ఆశ్చర్యకరమైన శివలింగం ఉంది. ఇది ప్రతిరోజు కొద్దికొద్దిగా పెరుగుతుందని నమ్ముతారు. ఈ శివలింగం గుహ పైకప్పును తాగినప్పుడు ప్రపంచం అంతమవుతుందని చెబుతారు. కొన్ని జానపద కథల ప్రకారం శివలింగం ప్రపంచంలోని చెడు పనులను కొలుస్తుందని అంటారు. దానికి అనుగుణంగా శివలింగం పెరుగుతుందని చెబుతారు. ప్రజల కర్మలు పరాకాష్టకు చేరుకున్న తర్వాత శివుడు ప్రపంచాన్నే అంతం చేసేందుకు సూచికగా దీన్ని భావిస్తారు.

పాతాళ భువనేశ్వర్ గుహలో సరస్వతి నది ప్రవహిస్తుందని చెబుతారు. అయితే ఇప్పుడు అది రాళ్లు తో కప్పబడి ఉందని అంటారు.

WhatsApp channel

టాపిక్