Radhika bride look: పెళ్లి దుస్తుల్లో మహారాణిలా మెరిసిపోయిన రాధిక మర్చంట్.. చెక్కిన శిల్పంలా అంబానీ కోడలు..-see bridal look of radhika marchant looks like a queen ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radhika Bride Look: పెళ్లి దుస్తుల్లో మహారాణిలా మెరిసిపోయిన రాధిక మర్చంట్.. చెక్కిన శిల్పంలా అంబానీ కోడలు..

Radhika bride look: పెళ్లి దుస్తుల్లో మహారాణిలా మెరిసిపోయిన రాధిక మర్చంట్.. చెక్కిన శిల్పంలా అంబానీ కోడలు..

Koutik Pranaya Sree HT Telugu
Jul 13, 2024 06:00 AM IST

Radhika bride look: రాధిక మర్చంట్ పెళ్లికూతురు లుక్ లో చెక్కిన శిల్పంలా కనిపించారు. ఈ లుక్ సంబంధించిన ఫొటోలు చూసేయండి.

పెళ్లికూతురుగా రాధిక మర్చంట్
పెళ్లికూతురుగా రాధిక మర్చంట్

రాధిక మర్చంట్ పెళ్లికూతురుగా ఎలా ముస్తాబవుతుందో అని అందరూ ఎదురు చూశారు. ప్రి వెడ్డింగ్ వేడుకల్లో, పెళ్లికి ముందు జరిగిన సాంప్రదాయ వేడుకలకే తన స్టైలింగ్ తో అందరినీ అబ్బురపరిచారామె. అలాంటిది పెళ్లి కూతురుగా తయారయ్యాక ఈ ముద్దుగుమ్మ ఎంత బాగుంటుందో అని అందరూ కుతూహలంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు పెళ్లికూతురు గెటప్ లో రాధిక మర్చంట్ ఫొటోలను తన స్టైలిస్ట్ రియా కపూర్ విడుదల చేశారు.

పెళ్లి కూతురు ముస్తాబులో రాధికను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. చెక్కిన శిల్పంలా కనిపిస్తున్నారామె. ఎరుపు, తెలుపు రంగు లెహెంగాలో మెరిసిపోయింది రాధిక. దాని మీద డబుల్ దుపట్టా వేసుకున్నారు. మెడలో పచ్చలు పొదిగిన నెక్ లేస్ ధరించారు. ప్రి వెడ్డింగ్ వేడుకలనుంచి అంబానీ కుటుంబం ప్రతి వేడుకలో పచ్చలను తమ నగల్లో ధరించిన విషయం తెలిసిందే.

రాధిక లుక్ వివరాలు:

రాధికా మర్చంట్ అనంత్ అంబానీతో తన వివాహ వేడుకకు అబూ జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన దుస్తులు ధరించింది. ఎరుపు, తెలుపు ధరించే వధువుల గుజరాతీ సంప్రదాయంగా వధువులు ధరించే ఎరుపు, తెలుపు రంగు మేళవింపుతో దీన్ని డిజైన్ చేశారు.

జర్దోసీ కట్ వర్క్ ఉన్న ఈ డిజైనర్ లెహెంగాకు రెండు దుపట్టాలున్నాయి. తల మీదున్న ముసుగు 5 మీటర్ల పొడవు ఉంది. లెహెంగాకు మూడు ఎరుపు రంగు అంచుల డిజైనింగ్ ఉంది. నక్షి, జర్దోసీ, సాది లాంటి పనితనాల మేళవింపు ఉన్న పూల డిజైన్లు ఈ లెహెంగాలో ఉన్నాయి. తలమీద వేసుకున్న కొంగు చాలా సున్నితమైన జాలితో డిజైన్ చేశారు. దాంతోపాటే 80 ఇంచుల పొడవు దుపట్టా మరోటి ఉంది.

 

 

Whats_app_banner