తెలుగు న్యూస్ / ఫోటో /
Ambani wedding: అంబానీల పెళ్లికి అందంగా ముస్తాబై, అట్టహాసంగా తరలి వచ్చిన సెలబ్రిటీలు
- Anant Ambani-Radhika Merchant wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహం జరిగింది. ఈ వేడుకలో ఉత్తమ దుస్తులు ధరించిన తారలను చూడండి.
- Anant Ambani-Radhika Merchant wedding: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు పెద్ద ఎత్తున సెలబ్రిటీలు తరలివచ్చారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహం జరిగింది. ఈ వేడుకలో ఉత్తమ దుస్తులు ధరించిన తారలను చూడండి.
(1 / 11)
చేతిలో వినాయకుడి బంగారు విగ్రహంతో కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేదిక వద్దకు వచ్చిన నీతా అంబానీ.
(2 / 11)
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహానికి అంబానీ కుటుంబ సభ్యులు ముకేశ్ అంబానీ, ఇషా అంబానీ, ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా, ఆనంద్ పిరమల్ లతో పాటు, అనన్య పాండే, జాన్ సీనా, సారా అలీ ఖాన్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో బెస్ట్ డ్రెస్ వేసుకున్న సెలబ్రిటీలు ఎవరో చూడండి. (HT Photo/Varinder Chawla)
(3 / 11)
తల్లిదండ్రులు నీతా అంబానీ, ముకేశ్ అంబానీలతో కొత్త పెళ్లి కొడుకు అనంత్ అంబానీ. వీరిలో నీతా అంబానీ పీచ్ సిల్క్ ఘాగ్రాను ధరించగా, ముకేశ్ అంబానీ బ్లష్ పింక్ షేర్వానీని ధరించారు. పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ఎరుపు, బంగారు రంగుల షేర్వానీని ఎంచుకున్నాడు, (HT Photo/Varinder Chawla)
(4 / 11)
ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ, ముకేష్ అంబానీ బ్లష్ పింక్ ఎంబ్రాయిడరీ సంప్రదాయ దుస్తులను ధరించారు. శ్లోకా ప్రకాశవంతమైన గులాబీ రంగు లెహంగాను ధరించింది. (HT Photo/Varinder Chawla)
(5 / 11)
అమెరికన్ నటుడు, ప్రొఫెషనల్ రెజ్లర్ జాన్ సెనా లేత నీలం రంగు బంధగల కుర్తా, తెలుపు రంగు ప్యాంట్ ధరించి వివాహ వేడుకలో ఫోజులిచ్చారు. టాన్ బ్రౌన్ డ్రెస్ షూస్ తో లుక్ ను డిజైన్ చేశాడు. (HT Photo/Varinder Chawla)
(6 / 11)
సున్నితమైన గోల్డెన్ సీక్విన్ ఎంబ్రాయిడరీతో అలంకరించిన పసుపు రంగు బ్రాలెట్, లెహంగా స్కర్ట్ సెట్ లో అనన్య పాండే ఈ వేడుకలో మెరిసింది. (HT Photo/Varinder Chawla)
(7 / 11)
పెళ్లి వేడుకలో ఖుషీ కపూర్ ఆకుపచ్చ రంగు లెహంగా ధరించింది. మెరిసే సెక్విన్స్ తో అలంకరించిన నెక్ బ్రాలెట్, లెహంగా స్కర్ట్ ను ఆమె ఎంచుకుంది. చోకర్, స్ట్రైకింగ్ గ్లామర్, లూజ్ లుక్స్ తో ఈ డ్రెస్ ను పూర్తి చేసింది. (HT Photo/Varinder Chawla )
(8 / 11)
పెళ్లి వేడుకలో అర్జున్ కపూర్ గోల్డ్ ఎంబ్రాయిడరీ కుర్తా, వ్రీమ్ సిల్క్ పైజామా ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఎరుపు రంగులో వీపు భాగంలో ఎంబ్రాయిడరీ చేసిన 'మేరే యార్ కీ షాదీ హై' అనే పదాలు ఆయన దుస్తుల్లో హైలైట్ గా నిలిచాయి. (HT Photo/Varinder Chawla)
(9 / 11)
సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ పెళ్లి వేదిక వద్ద ఫొటోలకు పోజులిచ్చారు. సారా బ్లష్ పింక్ సిల్క్ లెహంగా సెట్ ను ఎంచుకోగా, ఇబ్రహీం నలుపు రంగు బంధ్ గాలా జాకెట్, మ్యాచింగ్ ప్యాంట్, సూడ్ బూట్లు ధరించి అందంగా కనిపించాడు. (HT Photo/Varinder Chawla)
(10 / 11)
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహానికి హాజరైన పాత్రలేఖ, రాజ్ కుమార్ రావు. వీరిలో పాత్రలేఖ ఎరుపు రంగు లెహంగా సెట్ ధరించగా, రాజ్ క్రీమ్ కుర్తా, ఫ్లేర్డ్ ప్యాంట్, ఎంబ్రాయిడరీ షెర్వానీ జాకెట్ ధరించాడు. (HT Photo/Varinder Chawla)
ఇతర గ్యాలరీలు