Shani dev effect: వచ్చే ఏడాదితో ఈ రెండు రాశుల వారికి అర్థాష్టమ శని ప్రభావం నుంచి మోక్షం లభిస్తుంది
19 June 2024, 17:08 IST
- Shani dev effect: శనికి సంబంధించి అనేక దశలు కొన్ని రాశుల మీద తప్పనిసరిగా ఉంటాయి. ఏలినాటి శని, అర్థాష్టమ శని ప్రభావాలు జాతకంలో ఉంటే ఆ వ్యక్తి జీవితం సమస్యల్లో ఉంటుంది. వాటి నుంచి బయటపడేందుకు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే మార్గం.
ఈ రాశుల వారికి అర్థాష్టమ శని ప్రభావం నుంచి విముక్తి
Shani dev effect: తొమ్మిది గ్రహాలలో శని దేవుడికి న్యాయమూర్తి హోదా ఉంది. మకర, కుంభ రాశులకు శని అధిపతి. శని తులా రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటే. మేష రాశిలో నిచ స్థితిలో ఉంటాడు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో ఉంది.
కుంభ రాశిలో శని ఉండటం వల్ల కర్కాటకం, వృశ్చిక రాశిపై శని దయ్యా ప్రభావం ఉంటుంది. దీనినే అర్థాష్టమ శని అని కూడా పిలుస్తారు. శని ధయ్యా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా శని మహాదశను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
శని ఒక క్రూర గ్రహం. కానీ జన్మ రాశిలో శని ఉచ్ఛ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను అందిస్తుంది. శనిని కర్మ దాత అని పిలుస్తారు. శని గ్రహం మంచి పనులు చేసే వారికి శుభఫలితాలను, చెడు కార్యాలు చేసే వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి శని దయ్యా నుండి ఉపశమనం ఎప్పుడు లభిస్తుందో తెలుసుకుందాం.
శని రాశి మార్పు ఎప్పుడు?
శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం. శని ఏ రాశిలో అయినా దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. అందుకే శని మొత్తం పన్నెండు రాశులను పూర్తి చేసేందుకు సుమారు 30 సంవత్సరాలు పడుతుంది. శని మకర రాశిని వదిలి జనవరి 17, 2023న కుంభ రాశిలోకి ప్రవేశించింది.
ఈ రెండు రాశులకు శని దేవుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అప్పటి నుండి శని కుంభ రాశిలోనే తన కదలికలు మార్చుకుంటే సంచరిస్తున్నాడు. ప్రస్తుతం ప్రత్యక్ష మార్గంలో ఉన్న శని జూన్ 30 నుంచి తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. నవంబర్ 15 వరకు ఇదే స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత సాధారణ స్థితికి వస్తాడు. ఇక శని వచ్చే ఏడాది తన రాశిని మార్చుకుంటాడు. శని గ్రహం కుంభ రాశిని వీడి మార్చి 29, 2025న మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.
అర్థాష్టమ శని అంటే ఏంటి?
శని జన్మ రాశి నుంచి నాలుగు లేదా ఎనిమిదో ఇంట్లో సంచరిచినప్పుడు అర్థాష్టమ శని ఏర్పడుతుంది. దీని కాలం రెండున్నర సంవత్సరాలు. దీని ఫలితం బాధలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాల్లో మార్పులు, ట్రాన్స్ ఫర్ వంటివి ఎక్కువగా జరుగుతాయి. అటు వ్యాపారులకు ఈ సమయం కష్టకాలంగానే ఉంటుంది.
శని దయ్యా నుంచి వీరికి విముక్తి
కర్కాటకం, వృశ్చిక రాశుల వారికి ప్రస్తుతం శని దయ్యా ప్రభావం ఉంది. 2025 సంవత్సరంలో శని రాశిని మార్చుకున్నప్పుడు ఈ ప్రభావం తగ్గి వేరే రాశుల మీదకు వెళ్తుంది. వచ్చే ఏడాది శని సంచారంతో సింహం, ధనుస్సు రాశుల వారికి అర్థాష్టమ శని కాలం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు శని దయ్యా నుంచి విముక్తి పొందుతారు.
వీరికి ఏలినాటి శని ప్రభావం
ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం మకర రాశిలో ఏలినాటి శని చివరి దశ జరుగుతోంది. కుంభ రాశిలో శనిదేవుడి సడే సతి రెండవ దశ జరుగుతోంది. ఇక మీన రాశిలో శనిదేవుని సడేసతి మొదటి దశ జరుగుతోంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.