Rahu ketu transit: 2025 మే నుంచి రాహు, కేతు శుభ ప్రభావం.. ఈ రాశుల వారి కలలు సాకారం అవుతాయి
Rahu ketu transit: మే 2025 నుంచి రాహు కేతువులు తమ రాశులను మార్చుకుంటాయి. దీంతో మూడు రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. కలలు సాకారం చేసుకునే సమయం ఇది.
Rahu ketu transit: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను నీడ గ్రహాలు అని పిలుస్తారు. వాటిని అశుభమైనవిగా పరిగణిస్తారు. రెండు గ్రహాలు మానవ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కొందరు నమ్ముతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కేతువు, రాహువు ఒక వ్యక్తి జాతకంలో వారి వివిధ స్థానాల ఆధారంగా ఫలితాలను ఇస్తారు.
2023 సంవత్సరంలో రాశులు మార్చుకున్న రాహు కేతువులు 2025లో తదుపరి రాశి సంచారం చేస్తాయి. ఇవి ఎప్పుడు తిరోగమన దశలోనే సంచరిస్తాయి. పద్దెనిమిది నెలలకు ఒకసారి ఈ రెండు గ్రహాలు రాశులను మారుస్తాయి. ఛాయా గ్రహాలైన రాహు, కేతువుల సంచారం వచ్చే ఏడాది రెండు రాశుల జీవితాల్లో గణనీయమైన మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. రాహు-కేతు సంచారం ఎప్పుడు జరుగుతుందో మరియు ఏ రాశుల వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయో తెలుసుకోండి
రాహు-కేతు సంచారం ఎప్పుడు జరుగుతుంది?
ప్రస్తుతం రాహువు, కేతువులు మీనం, కన్యా రాశిలో సంచరిస్తున్నారు. రాహు, కేతువులు ఎప్పుడూ తిరోగమన దిశలో కదులుతాయి. వచ్చే ఏడాది మే వరకు ఈ రాశులలో ఉంటారు. మే 18వ తేదీ సాయంత్రం 04:30 గంటలకు రాహువు శని రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక కేతువు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏయే రాశులపై రాహు కేతు ప్రభావం ఉంటుందో చూద్దాం.
కుంభ రాశి
రాహు-కేతు సంచారం కుంభ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశికి అధిపతి శని. రాహువు ఈ కుంభ రాశిలోకే ప్రవేశిస్తాడు. రాహువు, శని మధ్య స్నేహ భావన ఉంది. కుంభ రాశి వారికి శని, రాహువులు కలిసి శుభ ఫలితాలను అందిస్తారు. ఈ కాలంలో భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్లో పెద్ద విజయాలు సాధిస్తారు. రాబోయే రెండున్నర సంవత్సరాలు కుంభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ కలలు కంటున్నారో వాటిని సాకారం చేసుకోగలరు.
సింహ రాశి
రాహు, కేతు రాశి మార్పు సింహ రాశి వారికి శుభప్రదం కానుంది. కేతువు సింహ రాశిలోకి అడుగు పెట్టి 18 నెలలు ఉంటుంది. మే 2025 నుండి వచ్చే రెండున్నర సంవత్సరాలు సింహ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. రాహు-కేతువుల ప్రభావం వల్ల మీరు మీ కెరీర్లో పురోగతిని పొందుతారు. ఉద్యోగస్తులకు ఆదాయం పెరగడంతో పాటు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. సంబంధాలు మెరుగుపడతాయి. వృత్తి, వ్యాపారంలో గణనీయంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. మీ ఆశయాలు నెరవేరతాయి.
వృషభ రాశి
రాహు-కేతు సంచారం వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మే 2025 నుండి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం అవుతుంది. రాహు-కేతువులు కలిసి వృషభ రాశి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతారు. ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. డబ్బు వస్తుంది. మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు. మొత్తం మీద ఈ సమయం మీకు వరం కంటే తక్కువ కాదు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.