Rahu nakshtra transit: రాహువు నక్షత్ర సంచారం.. ఈ ఏడాది మొత్తం వీళ్ళు పుష్కలమైన ప్రయోజనాలు పొందుతారు-rahu change nakshatra on july 8th these zodiac signs get full benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Nakshtra Transit: రాహువు నక్షత్ర సంచారం.. ఈ ఏడాది మొత్తం వీళ్ళు పుష్కలమైన ప్రయోజనాలు పొందుతారు

Rahu nakshtra transit: రాహువు నక్షత్ర సంచారం.. ఈ ఏడాది మొత్తం వీళ్ళు పుష్కలమైన ప్రయోజనాలు పొందుతారు

Gunti Soundarya HT Telugu
Jun 17, 2024 03:00 PM IST

Rahu nakshtra transit: రాహువు తన రాశిని మార్చుకోకపోయినా తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. జులై 8 నుంచి శని నక్షత్రంలో సంచరిస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి పుష్కలమైన ప్రయోజనాలు లభిస్తాయి.

రాహువు నక్షత్ర సంచారం
రాహువు నక్షత్ర సంచారం

Rahu nakshtra transit: అంతుచిక్కని గ్రహం రాహువు ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. గత సంవత్సరం మీన రాశిలో ప్రవేశించిన రాహువు 2025లో తన తదుపరి రాశి మార్పును చేస్తాడు. త్వరలో రాహువు నక్షత్రం మార్చుకోబోతున్నాడు.

ప్రస్తుతం రాహువు రేవతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. తిరోగమన దశలో సంచరిస్తూ జూలై 8న ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. దీని తరువాత రాహువు సంవత్సరం చివరి వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. ఈ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు.

ఉత్తర భాద్రపద నక్షత్రంలో రాహువు సానుకూల ప్రభావం ఉంటే ఆధ్యాత్మిక వృద్ధికి దోహదపడుతుంది. జీవితంలోని సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం మెరుగుపడుతుంది. క్లిష్టమైన సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుగొంటారు. ఈ నైపుణ్యం వల్ల అన్ని అడ్డంకులను అధిగమించగలుగుతారు. విజయాన్ని సాధించుకుంటారు. ఈ సమయంలో అధ్యాత్మికంగా బలపడతారు. ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తారు. శని క్రమశిక్షణా శక్తి రాహువు మీద కూడా ఉంటుంది. ఈ సమయంలో గణనీయమైన వ్యక్తిగత, ఆధ్యాత్మిక వృద్ధిని సాధించగలుగుతారు.

అదే రాహువు ఉత్తర భాద్రపద నక్షత్రంలో ప్రయికుల స్థానంలో ఉంటే సవాళ్ళు అధికం అవుతాయి. ఒక్కోసారి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారు. ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతాయి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మొత్తం శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది. ఒంటరితనం, అతిగా భావోద్వేగానికి గురవుతారు. మొండిగా ప్రవర్తిస్తారు. దీని వల్ల ఎదుగుదలలో ఆటంకాలు ఎదురవుతాయి. జీవిత సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతారు.

ప్రస్తుతం రాహువు శనికి చెందిన ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఏడాది పొడవునా రాహువు ఆశీర్వాదాలతో ఆనందంగా గడుపుతారు. అవి ఏ రాసులో తెలుసుకుందాం.

తులా రాశి

తులా రాశి వారికి రాహువు సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాన్ని పొందవచ్చు. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. రాహువు శుభ ప్రభావం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

వృషభ రాశి

రాహువు నక్షత్ర మార్పు వల్ల వృషభ రాశి వారికి ఈ ఏడాది మొత్తం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. అయితే కొద్దిగా ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువల్ల వాటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందించుకోవాలి. ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించడం చాలా శుభప్రదం. వైవాహిక జీవితం కూడా మధురంగా ​​ఉంటుంది.

వృశ్చిక రాశి

రాహు నక్షత్ర సంచారం వృశ్చిక రాశి వారికి లాభాలను ఇస్తుంది. గతంలో ఆగిపోయిన పని మళ్లీ పూర్తి చేసేందుకు పునః ప్రారంభిస్తారు. కెరీర్‌లో ప్రమోషన్ పొందడానికి మీరు చాలా ముఖ్యమైన పనులను చేయాల్సి వస్తుంది. మీరు బాగా పని చేయాల్సి ఉంటుంది. శ్రేయస్సు వస్తుంది. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు పిల్లల వైపు నుండి కూడా కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

WhatsApp channel