Rahu ketu transit: 2025 లో రాహు కేతువు రాశుల మార్పు.. ఈ రెండు రాశుల వారికి వచ్చే ఏడాది స్వర్ణయుగం-rahu ketu transit in 2025 these two zodiac signs get golden days ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Rahu Ketu Transit: 2025 లో రాహు కేతువు రాశుల మార్పు.. ఈ రెండు రాశుల వారికి వచ్చే ఏడాది స్వర్ణయుగం

Rahu ketu transit: 2025 లో రాహు కేతువు రాశుల మార్పు.. ఈ రెండు రాశుల వారికి వచ్చే ఏడాది స్వర్ణయుగం

Gunti Soundarya HT Telugu
Published Jun 11, 2024 07:02 PM IST

Rahu ketu transit: రాహు కేతువులు 2025 లో తమ రాశులను మార్చుకుంటాయి. దీని ప్రభావంతో రెండు రాశుల వారికి స్వర్ణయుగం రాబోతుంది. వారి కలలన్నీ నెరవేరబోతున్నాయి.

2025 లో రాహు కేతువు రాశుల మార్పు
2025 లో రాహు కేతువు రాశుల మార్పు

Rahu ketu transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల ప్రభావం ఒక వ్యక్తి జీవితం మీద తప్పనిసరిగా ఉంటుంది. అంతు చిక్కని గ్రహాలైన రాహు, కేతువు పేరు వింటేనే భయపడి పోతారు. కానీ ఇవి అశుభ ఫలితాలు మాత్రమే కాదు శుభ ఫలితాలు కూడా ఇస్తాయి. రాహు, కేతువులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు పద్దెనిమిది నెలలు పడుతుంది.

2023 అక్టోబర్ 30న రాహు, కేతువుల సంచారం జరిగింది. 2025 మే 18 వరకు ఈ రాహువు మీన రాశిలో, కేతువు కన్యా రాశిలో ఉంటాయి. అయితే 2025 మే 19 నుంచి రాహువు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే రోజు కేతువు కూడా సింహ రాశిలోకి సంచరిస్తాడు. ఇవి రెండు ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తాయి. వచ్చే ఏడాది ఒకే రోజు రాశులను మార్చుకోవడం వల్ల రెండు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. ఈ రెండు రాశుల వాళ్ళు రాహు కేతుల ప్రభావంతో సంపదతో తులతూగపోబోతున్నారు.

కుంభ రాశి

కుంభ రాశిపై రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 2025వ సంవత్సరంలో రాహువు ఈ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రాశికి అధిపతి శని. రాహువు, శని మధ్య స్నేహభావం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో రాహువు ప్రభావం ఈ రాశి వారిపై ఎక్కువ స్వభావాన్ని చూపిస్తుంది. రాహు సంచారంతో వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. మే 19, 2025 నుంచి రాబోయే పద్దెనిమిది నెలలు కుంభ రాశి వారికి స్వర్ణ యుగంగా ఉంటుంది. ఈ సమయంలో మీ కలలు సాకారం అవుతాయి.

సింహ రాశి

సింహ రాశిపై కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మే 19, 2025 నుంచి కేతువు సింహ రాశిలోనే సంచరిస్తాడు .ఫలితంగా వీరికి రానున్న పద్దెనిమిది నెలలు ఎంతో శుభదాయకంగా ఉండబోతుంది. ఈ కాలంలో మీరు పనిలో విజయం, ఉద్యోగంలో పురోగతి పొందుతారు. ఈ సమయంలో ధన ప్రవాహం రెట్టింపు అవుతుంది.

రాహు కేతు శుభ ప్రభావాలు పొందే మార్గాలు

రాహువు శుభ ప్రభావంతో సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుంది. రాహువు అనుగ్రహం పొందేందుకు శనివారం నాడు ఉపవాసం ఆచరించవచ్చు. అలాగే జాతకంలో రాహువు అశుభ స్థానంలో ఉన్నవారు ఈ ఉపవాసం ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే రాహువుకు సంబంధించిన నీలం రంగు వస్త్రాలు ధరించడం మంచిది. నలుపు రంగు గొర్రెలు, ఇనుము, బంగారం, గోమేధ రత్నాలు వంటి వాటిని రాగితో చేసిన పాత్రలు, నువ్వులు నిండిన పాత్రను దానం చేయడం వల్ల అనేక దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శనివారం నాడు నల్ల నువ్వులను నీలం రంగు వస్త్రంలో చుట్టి దానం చేయడం శ్రేయస్కరం

జాతకంలోకి కేతువు అనుకూలంగా ఉంటే కీర్తి, ధైర్యం, జీవితంలో శాంతి లభిస్తుంది. అదే అశుభ స్థానంలో ఉంటే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దాని నుంచి బయట పడేందుకు శనివారం ఉపవాసం ఉండటం మంచిది. అలాగే అశ్వగంధ చెట్టు నాటాలి. కేతువుకు పరిహారంగా రుద్రాభిషేకాన్ని కూడా చేయవచ్చు.

Whats_app_banner