Saturday remedies: శనివారం లవంగాలు, కర్పూరంతో ఈ చిన్న రెమిడీ చేయండి.. మీ ఇంట ధనలక్ష్మి నిలుస్తుంది-do these small remedies on saturday for bright future and goddess lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturday Remedies: శనివారం లవంగాలు, కర్పూరంతో ఈ చిన్న రెమిడీ చేయండి.. మీ ఇంట ధనలక్ష్మి నిలుస్తుంది

Saturday remedies: శనివారం లవంగాలు, కర్పూరంతో ఈ చిన్న రెమిడీ చేయండి.. మీ ఇంట ధనలక్ష్మి నిలుస్తుంది

Gunti Soundarya HT Telugu
Jun 08, 2024 08:36 AM IST

Saturday remedies: శనివారం రోజు సాయంత్రం కర్పూరం, లవంగాలతో మీ ఇంట్లో ఈ చిన్న రెమిడీ పాటించి చూడండి. మీ కష్టం ఏదైనా ఇట్టే తొలగిపోతుంది. సంపద పెరుగుతుంది. ధనలక్ష్మి ఇంట్లో నిలుస్తుంది.

శనివారం పాటించాల్సిన రెమిడీ
శనివారం పాటించాల్సిన రెమిడీ

Saturday remedies: వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంలో ఆనందం శ్రేయస్సును తీసుకొచ్చేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఆదాయాన్ని పెంచుకునేందుకు, ఇంటి మీద చెడు దృష్టి తొలగించుకునేందుకు, ఉద్యోగం సాధించేందుకు ఇలా అనేక శుభ ఫలితాలు పొందేందుకు ఒక చిన్న పని చేస్తే చాలు అంతా మంచే జరుగుతుంది. వాస్తు ప్రకారం కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చు.

పూజలో కర్పూరం, లవంగాలను తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిని ఇంట్లో కాల్చడం వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. ముఖ్యంగా శనివారం సాయంత్రం కర్పూరం, లవంగాలు కాల్చడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

సంపదను పెంచుకునేందుకు

అదృష్టం, సంపద మెరుగుపరుచుకునేందుకు ఈ ప్రక్రియ మీకు చాలా సహాయం చేస్తుంది. రాత్రిపూట కర్పూరం లవంగం కలిపి కాల్చాలి .ఇలా చేయడం వల్ల మీ ఇల్లు ధనంతో ఎప్పుడూ నిండి ఉంటుంది.  కర్పూరానికి కోరికలు తీర్చే శక్తి ఉంటుంది. మీ కోరిక మంచిదైతే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. 

ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు

ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలంటే శనివారం రాత్రి పడుకునే ముందు వెండి గిన్నెలో లవంగాలు, కర్పూరం వేసి కాల్చాలి. ఇలా చేయడం వల్ల డబ్బు కొరతను అధిగమించగలుగుతారు. 

నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టేందుకు

ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టేందుకు కర్పూరం, లవంగాలు, యాలకులు చక్కగా పనిచేస్తాయి. ఇవి ఇంటి నుంచి దుష్ట శక్తులను దూరం చేస్తాయి. ఒక గిన్నెలో కర్పూరం, ఐదు యాలకులు, ఐదు లవంగాలు తీసుకొని కాల్చాలి. వాటిని నుంచి వచ్చే పొగను ముందుగా పూజ గదిలో ధూపం వేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి మూలల్లో పొగ విస్తరించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి శాంతి లభిస్తుంది .చెడు దృష్టి తొలగిపోతుంది. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇంట్లోని వారి మీద చెడు దృష్టి ఉంటే అది తొలగిపోతుంది. వీటిని కాల్చడం వల్ల ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి శరీరం నుంచి ఆ సమస్యలు దూరం అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

సంతోషం శ్రేయస్సు కోసం

శనివారం సాయంత్రం ఇంట్లో లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు నిలుస్తాయి .కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. శత్రువులను వదిలించుకోవచ్చు. ప్రత్యర్ధుల మీద పై చేయి సాధించేందుకు ఈ రెమిడీ దోహదపడుతుంది. అలాగే లవంగాలు కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లో కలహాలు తొలగిపోతాయి. 

మంచి కెరీర్ కోసం

కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కెరీర్ లో సక్సెస్ కాలేరు. అటువంటి పరిస్థితుల్లో కర్పూరంతో ఈ రెమిడీ ప్రయత్నించి చూడండి. ఈ విధానం మీకు ఆశించిన విజయాన్ని అందిస్తుంది. మీరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కర్పూరం, లవంగాలు కాల్చడం మంచిది. అలాగే నోట్లో రెండు లవంగాలు వేసుకొని బయటకు వెళ్లాలి. ఇంటర్వ్యూ వెళ్ళే ముందు వాటిని ఊసేయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఉద్యోగం పొందగలుగుతారు. కెరీర్లో ముందుకు సాగుతారు. రెండు లవంగాలు ఆవ నూనెలో వేసి ఉదయాన్నే దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. 

వైవాహిక సమస్యలు అధిగమించేందుకు

వైవాహిక సంబంధంలో అవంతరాలు ఏర్పడుతున్నట్లయితే వెండి లేదా మరేదైనా గిన్నెలో కర్పూరం కాల్చాలి. గది మూలలో రెండు కర్పూరాలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే రాత్రిపూట కర్పూరం, లవంగాలను కాల్చడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను దూరం చేయవచ్చు. ఆరు కర్పూరం ముక్కలు 36 లవంగాలు తీసుకుని ఇంటికి దిష్టి తీసేసి వేయడం వల్ల మీ వైవాహిక జీవితంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. 

 

 

టాపిక్