Nava panchama yogam: 100 ఏళ్ల తర్వాత కేతువు, గురు గ్రహం ఈ రాశుల వారి జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు-jupiter and ketu transit will show their magic after 100 years ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Nava Panchama Yogam: 100 ఏళ్ల తర్వాత కేతువు, గురు గ్రహం ఈ రాశుల వారి జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు

Nava panchama yogam: 100 ఏళ్ల తర్వాత కేతువు, గురు గ్రహం ఈ రాశుల వారి జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు

Gunti Soundarya HT Telugu
May 14, 2024 02:18 PM IST

Nava panchama yogam: సుమారు 100 సంవత్సరాల తర్వాత కేతువు, గురు గ్రహం కొన్ని రాశుల జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. ఈ రెండు గ్రహాల శుభ స్థానాల వల్ల మంచి రోజులు వచ్చాయి.

కేతు గురు గ్రహ సంచారం
కేతు గురు గ్రహ సంచారం

Nava panchama yogam: జ్యోతిషశాస్త్రంలో కేతువు, బృహస్పతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి రెండూ విభిన్నమైన స్వభావాలు కలిగిన గ్రహాలుగా చెప్తారు. ఈ రెండు గ్రహాలు కలిసి సుమారు వంద సంవత్సరాల తర్వాత నవ పంచమ యోగం ఏర్పరుస్తున్నాయి.

కేతువు స్వభావం

కేతువుని నీడ గ్రహంగా పరిగణిస్తారు. క్రూరమైన గ్రహంగా భావిస్తారు. ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే సమస్యలు కలిగిస్తుందని చెప్తారు. హానికరమైన ప్రయోజనాలు ఇస్తుంది. ఇది ఎప్పుడూ తిరోగమన దశలోనే సంచరిస్తుంది. 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. అలా గతేడాది కన్యా రాశిలోకి ప్రవేశించిన కేతువు ఈ ఏడాది మొత్తం అదే రాశిలో ఉంటాడు. కేతువు ఎక్కువగా చెడు ప్రభావాలు ఇస్తాడని అంటారు. కానీ కొన్ని సార్లు కేతు అనుగ్రహంతో మోక్షం కూడా లభిస్తుంది.

బృహస్పతి స్వభావం

దేవ గురువుగా భావించే బృహస్పతిని శుభకరమైన గ్రహంగా పరిగణిస్తారు. వివాహ కార్యక్రమానికి గురు గ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకే గురు స్థానం బలంగా ఉండాలని చెప్తారు. అప్పుడే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి బృహస్పతి రాశిని మార్చుకుంటూ ఉంటాడు. అలా ఈ ఏడాది బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించాడు.

నవపంచమ యోగం

బృహస్పతి, కేతు స్థానాల వల్ల శుభకారమైన నవ పంచమ యోగం ఏర్పడుతుంది. కేతువు గత ఏడాది నుంచి కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ యోగం కొన్ని రాశుల వారికి మంచి రోజులను ఇవ్వనుంది. కేతువు, బృహస్పతి జాతకంలో తొమ్మిది, ఐదో ఇంట్లో ఉంటే నవ పంచమ యోగం ఏర్పడుతుంది ఈ రెండు గ్రహాలు కలిసి ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తాయో తెలుసుకుందాం. సుమారు వంద సంవత్సరాల తర్వాత ఇవి రెండు గ్రహాలు ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాయి.

మిథున రాశి

గురు, కేతువు సంచారం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విదేశీయులతో విలువైన వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు. మీరు ఎంత నిర్భయంగా ఉంటే అంత త్వరగా మిమ్మల్ని విజయం వరిస్తుంది.

వృషభ రాశి

రెండు గ్రహాల సంచారం వృషభ రాశి వారికి శుభ సమయంగా ఉంటుంది. కేతువు బృహస్పతి శుభస్థానంతో ఆగిపోయిన పనులన్నీ ప్రారంభమవుతాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు ఈ సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆనందం సంపద ప్రయోజనాలను పూర్తిగా పొందుతారు. అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

మకర రాశి

గురు, కేతువు సంచారం మకర రాశి వారికి శుభాలను తీసుకొస్తుంది. కార్యాలయంలో మీ స్నేహితుడు బాస్ నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. కొత్త పెట్టుబడి ఎంపికల గురించి ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

 

Whats_app_banner