Planet transit: ఈ రాశుల వారికి మే నెల ఒక వరం.. గ్రహాల సంచారంతో ధనవంతులు కాబోతున్నారు-may month horoscope these zodiac signs get fruit full benefits ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Planet Transit: ఈ రాశుల వారికి మే నెల ఒక వరం.. గ్రహాల సంచారంతో ధనవంతులు కాబోతున్నారు

Planet transit: ఈ రాశుల వారికి మే నెల ఒక వరం.. గ్రహాల సంచారంతో ధనవంతులు కాబోతున్నారు

Gunti Soundarya HT Telugu
Apr 29, 2024 05:03 PM IST

Planet transit: మే నెలలో నాలుగు పెద్ద గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి ఒక వరంగా మారుతుంది. రానున్న నెల రోజులు వీరికి సరదాగా గడుస్తుంది. గ్రహాల రాశుల మార్పుతో ధనవంతులు కాబోతున్నారు.

ఈ రాశుల వారికి మే నెల ఒక వరం
ఈ రాశుల వారికి మే నెల ఒక వరం (pixabay)

Planet transit: గ్రహాల మార్పుల సంచారం కారణంగా మే నెల చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. 2024 మే నెలలో దేవగురువు బృహస్పతి, సంపదనిచ్చే శుక్రుడు, గ్రహాల రాజు సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడు తమ రాశి చక్రాలను మార్చుకొనున్నాయి.

ఇది మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం దేవగురువు మే నెలలో రెండుసార్లు తన కదలికను మార్చుకోనున్నాడు. గురు గ్రహం మే 1వ తేదీన మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే మే 3వ తేదీన వృషభ రాశిలో అంస్తంగత్వ దశలోకి వెళతాడు.

మే 10 అక్షయ తృతీయ రోజు గ్రహాల రాకుమారుడు బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని తర్వాత శుక్ర గ్రహం మే 19న వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది. అలాగే త్వరలోనే సూర్యుడు కూడా వృషభ రాశిలో సంచరిస్తాడు. మే నెలలో నాలుగు ప్రధాన గ్రహాల సంచారం అద్భుతమైన యాదృశ్చిక సంఘటనలు జరగనున్నాయి. కొన్ని రాశుల వారు శుభ ఫలితాల నుండి విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. వృషభ రాశిలో సూర్యుడు, గురు గ్రహాలు కలయిక జరుగుతుంది. మే నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు గమనాన్ని మార్చడం వల్ల ఏయే రాశుల వారికి సమృద్ధి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మేష రాశి

గ్రహాల రాశి మార్పు వల్ల మేష రాశి వారికి ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. పెళ్లి ఫిక్స్ చేసుకోవచ్చు. సంతానం వైపు నుంచి ఊహించని శుభవార్తలు అందుతాయి. కెరీర్ లో ఆశించిన విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి. నూతన ఆదాయం మార్గాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది.

వృషభ రాశి

గ్రహాల సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో వృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బుకు సంబంధించిన వివాదాల నుంచి బయటపడతారు. మనసు సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. మే ఒకటి తర్వాత ఈ రాశుల వారికి విద్యాపరమైన పనులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. పురోగతికి బాటలు పడతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది.

సింహ రాశి

కెరీర్ అభివృద్ధికి ఎన్నో సువర్ణ అవకాశాలు లభిస్తాయి. కార్యాలయ నిర్వహణలో మీ గౌరవం పెరుగుతుంది. బాస్ సపోర్టుతో కెరీర్లో కొత్త పొజిషన్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా ఆదాయం పెరుగుతుంది. పాత పెట్టుబడిలో మంచి రాబడిని ఇస్తాయి. సంపద పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. విద్యాపరమైన పనులు కూడా ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తాయి.

మకర రాశి

గ్రహాల సంచారం మకర రాశి వారికి వృత్తి జీవితంలో ఎన్నో పెను మార్పులు తీసుకురాబోతుంది. కెరీర్ కి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. జీవితంలో ప్రతి రంగంలో ఆశించిన విజయాలను చేరుకుంటారు. ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది. పని ప్రాంతంలో మార్పు ఉండవచ్చు.

Whats_app_banner