Rahu ketu transit: రాహు, కేతు సంచారం.. మరికొన్ని రోజులు ఈ రాశుల వారికి టెన్షన్ తప్పదు
Rahu ketu transit: రాహు కేతు సంచారం ఈ ఏడాది మొత్తం కొన్ని రాశుల వారికి టెన్షన్ ఇస్తుంది. జీవితాల్లో అలజడి సృష్టిస్తుంది. అవి ఏ రాశులో తెలుసుకుందాం.
Rahu ketu transit: రాహు, కేతువులు అంతు చిక్కని గ్రహాలుగా పరిగణిస్తారు. ఇవి చాలా నెమ్మదిగా కదులుతాయి. ఎప్పుడూ తిరోగమన దశలో తమ ప్రయాణం సాగిస్తాయి. 2023వ సంవత్సరం అక్టోబర్ లో రాహు, కేతువులు తమ రాశి చక్రాలను మార్చుకున్నారు. ఏడాదిన్నరకు ఒకసారి ఇవి రెండు రాశి చక్రాలను మార్చుకుంటాయి.
2023 అక్టోబర్ నెలలో రాహువు, కేతువు సంచారం జరిగింది. రాహువు మీన రాశిలోకి ప్రవేశిస్తే, కేతువు కన్యా రాశిలో కూర్చున్నాడు. 2025 సంవత్సరం వరకు రాహు కేతువులు తమ రాశి చక్రాలను మార్చుకోరు. ఇది మేష రాశి నుంచి మీన రాశి వరకు శుభ అశుభ ప్రభావాలను చూపుతుంది. 2024వ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి రాహు కేతువు అశుభ కోణం ఉంటుంది. ఈ కారణంగా వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. 2025 సంవత్సరంలో రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తారు. అప్పటివరకు ఈ రెండు గ్రహాల వల్ల ఏయే రాశుల వారు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
రాహు కేతువు సంచారం కర్కాటక రాశి వారికి అంతగా ప్రయోజనకరంగా ఉండదు. వృత్తిలో సహోద్యోగులతో గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మితిమీరిన ఖర్చులు మనసును కలచివేస్తాయి. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలి. మనసు చంచలంగా ఉంటుంది. ఏకాగ్రత తగ్గిపోతుంది. సంబంధాల్లో విభేదాలు రావచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఎక్కువగా శ్రమిస్తేనే విజయం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపడవద్దు.
కన్యా రాశి
రాహు కేతు సంచారం కన్యా రాశి వారికి లాభదాయకంగా ఉండదు. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రావచ్చు. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మనసులో నెగటివ్ ఫీలింగ్ కలుగుతుంది. భాగస్వామితో విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎక్కువవుతాయి. ఒకానొక సందర్భంలో ఆరోగ్యం క్షీణిస్తుంది.
వృషభ రాశి
రాహు, కేతు సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడదు. ఆర్థిక జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. మీరు జీవితంలో సవాళ్లను ఎదురుకోవాల్సి ఉంటుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ జీవితం కష్టాలతో నిండి ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
మకర రాశి
వృత్తిలో సవాళ్లు అధికమవుతాయి. సంతానం వైపు నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఆశించిన విధంగా కృషి ఫలించకపోవచ్చు. మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ జీవితంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.
మీన రాశి
ఆఫీస్ రాజకీయాలు మీ పనిపై ప్రభావం చూపుతాయి. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకూడదు. ఓపిక పట్టాలి. డబ్బుకు సంబంధించిన ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఈ సమయంలో పెట్టె పెట్టుబడులు ధన నష్టానికి దారి తీసే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది డబ్బుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది.