హాయిగా నిద్రపట్టాలా? అయితే పడుకునే ముందు ఈ మంత్రాలు జపించండి, పీడకలల బాధే ఉండదు
22 July 2024, 12:35 IST
- కొందరికి పీడకలల వల్ల నిద్ర పట్టదు. రాత్రి అంతా భయపడుతూ నిద్ర సరిగా పోలేరు. ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల వల్ల కూడా నిద్ర ఉండదు. ఈ సమస్య నుంచి బయట పడేందుకు నిద్రపోయే ముందు ఈ మంత్రాలు జపించండి.
నిద్రపోయే ముందు పఠించాల్సిన మంత్రాలు
ఒత్తిడి, ఆందోళన, ఆలోచనలతో ఈరోజుల్లో కంటి నిండా నిద్ర అనేది చాలా మందికి ఉండటం లేదు. వీటి నుంచి బయట పడేందుకు ఉన్న ఏకైక మార్గం ధ్యానం, యోగా వంటివి చేయడం. వాటితో పాటు కొన్ని మంత్రాలు, శ్లోకాలు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సును కేంద్రీకరించి ఏకాగ్రతతో కొన్ని మంత్రాలు జపించడం వల్ల మీరు హాయిగా నిద్రపోగలుగుతారు. జపం చేయడం వల్ల మీ చుట్టూ సానుకూల శక్తులు ఉండేలా చేస్తుంది.
సందర్భాలకు తగినట్టుగా అనేక మంత్రాలు ఉన్నాయి. అలా రాత్రి వేళ మంచి నిద్రపోవడానికి గొప్ప ప్రయోజనాలు అందించే ఐదు మంత్రాలు ఉన్నాయి. నిద్రవేళకు ముందు ఈ మంత్రాలు పఠించడం వల్ల మనస్సు శాంతంగా ఉంటుంది. ఆందోళన తగ్గిపోతుంది. సానుకూల శక్తి ఆహ్వానించేందుకు సహాయపడుతుంది.
ఓం
పురాణాల ప్రకారం ఓం విశ్వం నుంచి వెలువడిన మొదటి శబ్ధం. దీనికి విశ్వశక్తి ఉంటుంది. నిద్రపోయే ముందు ఓం మంత్రాన్ని జపించడం వల్ల విశ్వశక్తితో మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఓం జపించడం వల్ల ఆత్మ శుద్ధి చేయడమే కాకుండా రోజంతా నెలకొన్న మానసిక ఆందోళనను తొలగిస్తుంది. చింతలను మనసులో నుంచి తీసివేస్తుంది. మనసుని శాంత పరుస్తుంది. మెదడును రిలాక్స్ మోడ్ లోకి తీసుకువెళ్లి నిద్రను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా హనుమంతుడికి అంకితం చేసిన మంత్రం. హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. అవసరమైన సమయాలలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల బలం, రక్షణ లభిస్తాయి. ఎవరైనా హనుమంతుడిని అత్యంత భక్తితో పిలిచినప్పుడు వేగంగా సమాధానం ఇస్తాడని చెబుతారు. చెడుకలలు, ప్రతికూల శక్తులుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల చాలా సహాయకరంగా ఉంటుంది. 'భూత్ పిసాచ్ నికత్ నహీ ఆవే, మహావీర్ జబ్ నామ్ సునావే’ అనే పంక్తులు పఠించడం వల్ల మనకు రక్షణగా నిలుస్తాయి. దుష్టశక్తులకు వ్యతిరేకంగా ఇది ఒక కవచంలా పనిచేస్తుంది. ఆటంకాలు లేకుండా ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది.
దుర్గా మంత్రం
మంత్రం - ‘యా దేవి సర్వ భూతేషు నిద్ర రూపేణ సంస్థిత, నమస్తస్యే నమస్తస్యే నమో నమః’
ఈ దుర్గా మంత్రం దైవిక స్త్రీ శక్తికి నిర్వచనం. రక్షణ, వైద్యం కోసం అంకితం చేయబడిన మంత్రం అనేక రూపాలలో ఉన్న దుర్గాదేవి రక్షకురాలిగా ఉంటుందని నమ్ముతారు. చెడు నుంచి తల్లి తన బిడ్డను రక్షించడానికి ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ మంత్రం పఠించడం వల్ల నిద్రపోతున్నప్పుడు కూడా మనల్ని అమ్మవారు కాపాడుతుంది. మనకు రక్షణగా దుర్గాదేవి ఉందని ధైర్యం లభిస్తుంది.
మహా మృత్యుంజయ మంత్రం
భయాన్ని అధిగమించేందుకు మహా మృత్యుంజయ మంత్రం ఉపయోగపడుతుంది. మృత్యు భయం బయటపడేందుకు ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన మంత్రం ఇది. ఓంతో ప్రారంభమయ్యే ఈ మంత్రం పదేపదే పఠించడం వల్ల శివుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. నిద్రపోయే ముందు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే అకాల మరణం అనే భయం నుంచి బయటపడతారు. శివుడు రక్షణగా ఉంటాడని నమ్ముతారు. వ్యక్తి చుట్టూ ఉన్న హానికరమైన అపవిత్ర శక్తుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పీడకలల నుంచి విముక్తి కలిగి మంచి నిద్ర వస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.