Powerful mantralu: జీవితంలోని అనేక కష్టాలను ఎదిరించేందుకు ధైర్యం కూడగట్టుకునేందుకు, రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ దైవాన్ని ఆశ్రయిస్తారు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని తలచుకోవడం చేయకూడదు. నిత్యం దేవుడిని మంత్రాలు, శ్లోకాలతో కీర్తించడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
నిత్యం కొన్ని మంత్రాలు పఠించడం వల్ల మీ విజయానికి అడ్డే ఉండదు. కెరీర్ లో ఉన్న స్థానాలు అధిరోహించగలుగుతారు. ఈ మంత్రాలు రక్షణనిస్తూ, అడ్డంకులు తొలగించడంలో సహాయపడతాయి. విజయాన్ని సాధించడం కోసం ప్రతికూలతలను ఎదుర్కొంటూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటానికి ఇవి మీకు సహాయపడతాయి. జీవితంలో విజయాన్ని అందజేయడంలో సహాయపడే కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఇవి. వీటిని నిత్యం జపించడం వల్ల ఓటమికి భయపడి వెనుదిరుగరు. విజయం సాధించడం కోసం ఎంతైనా కష్టపడతారు. ఓటమిని చూసి క్రుంగిపోరు. ఆ మంత్రాలు, వాటి వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మంత్రం ఓం. విశ్వాన్ని సూచిస్తుంది. ఓం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక స్పష్టత వస్తుంది. ఓం జపించినప్పుడు మనసులో నెలకొన్న గందరగోళం తొలగించుకునేందుకు సహాయపడుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని పద్మాసనం వేసి ఓం జపించడం వల్ల మనసుక ఏంటో ఊరటగా అనిపిస్తుంది. కోరుకున్న ప్రతిదాన్ని అందుపుచ్చుకోగలుగుతారు. ఓం అనేది చాలా సరళమైన, శక్తివంతమైన మంత్రం. ఇది జీవితంలోని అనేక ఇబ్బందులను సమస్యలను తొలగించగల పవర్ ఫుల్ మంత్రం.
మంత్రం – ఓం భూర్ భువ స్వాహా, తత్ సవితుర్ వరేణ్యం, భర్గో దేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్
హిందూమతంలోని అత్యంత శక్తివంతమైన మంత్రాలలో గాయత్రీ మంత్రం ఒకటి. జ్ఞానం, జ్ఞానోదయం కోసం ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల శరీరం, మనసు శుద్ధి చేయబడతాయి. మన చుట్టూ ఉన్న అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయి. సానుకూల శక్తిని ఆకర్షించే సామర్థ్యం ఈ మంత్రానికి ఉంది. గాయత్రీ మంత్రం దైవిక శక్తులు ప్రేరేపిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. అడ్డంకులను అధిగమించడంలో మార్గం నిర్దేశం చేస్తుంది.
హనుమంతునికి అంకితం చేసిన హనుమాన్ చాలీసా పఠించడం బలం, ధైర్యం లభిస్తాయి. నిత్యం ఇందులోని శ్లోకాలను పఠించడం వల్ల హనుమంతుడి ఆశీర్వాదంతో భయాలను, అడ్డంకులను తొలగించుకోగలగుతారు. సవాళ్లను దీటుగా ఎదుర్కొంటారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఒకసారి కాకుండా అనేక సార్లు హనుమాన్ చాలీసా జపిస్తూ ఉండాలి.
మంత్రం - వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవా, సర్వ కార్యేషు సర్వదా.
విజయాన్ని సాధించడంలో గణేష్ మంత్రం కీలక పాత్ర ఉంటుంది. ఈ మంత్రం నిత్యం పారాయణం చేయడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగించేందుకు గణేషుడు ఎల్లప్పుడూ మీ ముందు ఉంటాడు. మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాడు. ఏదైనా కొత్త పని, వ్యాపారం లేదా వెంచర్ ప్రారంభించేముందు మంత్రాన్ని జపించడం వల్ల వినాయకుడి ఆశీర్వాదాలు లభిస్తాయి. దీంతో మీ పనులు హ్యాపీగా విజయవంతమైన మార్గంలో నడుస్తాయి.
మంత్రం-సర్వ మంగళ మాంగల్యే, శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్రయంబకే గౌరీ, నారాయణి నమోస్తుతే.
దుర్గాదేవి ఆశీర్వాదాలు కోరుకొంటూ ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం పఠించడం వల్ల ఐశ్వర్యం లభిస్తుంది. భక్తులకు అండగా నిలుస్తుంది. లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన శక్తిని, రక్షణను దుర్గామాత అందిస్తుందని నమ్ముతారు. విజయాన్ని సాధించడంలో సహాయపడే మరొక మంత్రం ఇది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.