తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mysterious Temples In India: భారతదేశంలో మహిమలు, అంతుచిక్కని రహస్యాలు కలిగిన ప్రముఖ ఆలయాలు ఇవే

Mysterious temples in india: భారతదేశంలో మహిమలు, అంతుచిక్కని రహస్యాలు కలిగిన ప్రముఖ ఆలయాలు ఇవే

HT Telugu Desk HT Telugu

09 February 2024, 15:22 IST

google News
    • Mysterious temples in india: భారతదేశంలో అంతు చిక్కని రహస్యాలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. వాటి విశిష్టత గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 
దేవాలయం(Representational image)
దేవాలయం(Representational image) (pixabay)

దేవాలయం(Representational image)

Mysterious temples in india: భారతదేశం దైవశక్తికి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. భారతదేశంలో అనేక దైవ క్షేత్రాలు, శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు, వైష్ణవ క్షేత్రాలు విరాజిల్లుతున్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మన భారతదేశంలో శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని విశేషమైన మహిమలు కలిగినటువంటి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలున్నాయని చిలకమర్తి తెలిపారు.

నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు

సనాతన హిందూ సాంప్రదాయంలో ఏ పూజలో అయినా వినాయకుడికి తొలి పూజలు అందించడం సంప్రదాయంగా ఉంది. విఘ్నేశ్వరుని ప్రముఖ మహిమాన్విత క్షేత్రాలలో అంతు చిక్కని మహిమలు కలిగిన, నిరంతర పెరుగుతున్న విగ్రహాలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి.

1.కాణిపాకం

2. యాగంటి బసవన్న

3. కాశీ విశ్వనాథ్

4. బెంగుళూరు బసవేశ్వర్‌ బిక్కవోలు లక్ష్మీగణపతి

రంగులు మారే ఆలయాలు

1. ఉత్తరాయణం, దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.

2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.

పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ. నెయ్యి వెన్నగ మారేది ఇక్కడే అని ప్రముఖ చిలకమర్తి తెలిపారు.

సంవత్సరానికి ఒకసారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు

1. నాగులాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం

2. కొల్లాపూర్‌ లక్ష్మి దేవస్థానం

3. బెంగళూర్‌ గవిగంగాధర్‌ దేవస్థానం.

4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం

5. మొగిలీశ్వర్‌

6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.

నిరంతరం జలం ప్రవహించే దేవాలయాలు:

1. మహానంది

2. జంబుకేశ్వర్‌

3. బుగ్గరామలింగేశ్వర్‌

4. కర్ణాటక మండల గణపతి

5. హైదరాబాద్‌ కాశీ బుగ్గ శివాలయం

6. బెంగళూర్‌ మల్లేశ్వర్‌

7. రాజరాజేశ్వర్‌ బెల్లంపల్లి శివాలయం

8. సిద్ధగంగా

నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి

2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్‌

3. మంజునాథ్‌

శ్వాస తీసుకునే ఆలయం : కాళహస్తీశ్వర

సముద్రమే వెనక్కి వెళ్లే ఆలయాలు

1. గుజరాత్‌ నిష్కళంక మహాదేవ్‌

2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.

స్త్రీల మాదిరిగా నెలసరి అయ్యే ఆలయాలు

1. అస్సాం కామాఖ్యా అమ్మవారు

2. కేరళ దుర్గామాత

స్వయంభువుగా వెలిసిన ఆలయాలు

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాథ్ ఆలయం

ఆరునెలలకు ఒకసారి తెరిచే ఆలయాలు:

1. బద్రీనాథ్

2. కేదార్ నాథ్‌ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)

3. గుహ్యకాళీమందిరం.

సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు

హాసంబా దేవాలయం, హాసన్‌ కర్దాటక. పెట్టిన అన్న ప్రసాదాలు సంవత్సరం తరువాత చెడిపోకుండా అలానే ఉంటాయి.

12 ఏళ్లకు ఒకసారి తెరిచే ఆలయాలు: పిడుగుపడి తిరిగి అతుక్కునే ఆలయం బిజిలి మహాదేవ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌.

స్వయంగా ప్రసాదం తినే ఆలయాలు:

1. కేరళ శ్రీకృష్ణ దేవాలయం

2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం.

ఒంటి స్తంభంతో ఉన్న ఆలయాలు

యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్‌. ఇక్కడ వేసవి వేడిలో కూడా నీరు చల్లగా ఊరుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

రూపాలు మారే ఆలయాలు : రోజులో మూడు రూపాలు మారే దారిదేవి ఆలయం ఉత్తరాఖండ్ లో ఉంది.

నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్‌ మాతాజీ మందిర్‌, మధ్యప్రదేశ్‌. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పిందని స్థల పురాణం చెబుతోంది. ఇప్పటికి అక్కడ దీపం నీటితోనే వెలిగిస్తారు.

మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు

1. హేమాచల నరసింహ స్వామి

2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

మనిషి వలె గుటకలు వేసే ఆలయం, పానకం తాగే పానకాల నరసింహ స్వామి.

అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.

ఛాయా విశేషం

1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.

2. హంపి విరూపాక్షేశ్వర్‌, గోపురం నీడ ఒక చోట పడుతుంది.

3. బృహదీశ్వరాలయం

4. నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది), నేపాల్‌

ఇంకా... తిరుమల వెంకటేశ్వర స్వామి, అనంత పద్మనాభ స్వామి, రామేశ్వర్‌, కంచి, చిలుకూరి బాలాజీ, పండరినాథ్‌, భద్రాచలం, అన్నవరం మొదలైనవి.

పక్షులు ఎగరని పూరీ దేవాలయం, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం. ఇవి తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమేనని ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం