Animal statue vastu tips: ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలు ఉంచవచ్చు? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?-which animal idol is best for home as per vastu shastra what happens when animal statue in home ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Animal Statue Vastu Tips: ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలు ఉంచవచ్చు? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?

Animal statue vastu tips: ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలు ఉంచవచ్చు? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?

Gunti Soundarya HT Telugu

Animal statue vastu tips: ఇంట్లో కొన్ని జంతువుల విగ్రహాలు పెట్టుకోవడం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటుంది. సంపద పెరుగుతుంది. ఇంతకీ ఏ జంతువుల విగ్రహాల వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసా?

ఏ జంతువు విగ్రహం పెట్టుకుంటే మంచిది? (pixabay)

Animal statue vastu tips: ఇంటిని అందంగా అలంకరించుకోవడం అంటే మహిళలకు చాలా ఇష్టం. అందమైన బొమ్మలు, విగ్రహాలు కొనేసి షోకేసులో పెట్టేస్తారు. కొంతమంది జంతువుల బొమ్మలు కూడా పెట్టుకుంటారు. అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా అని జంతువుల బొమ్మలు పెట్టుకోవడం వాస్తు ప్రకారం సరైనది కాదని పండితులు చెబుతున్నాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక గ్రహంతో ముడి పడి ఉంటుంది. అందుకే మనం ఇంట్లో పెట్టుకునే జంతువుల విగ్రహాలు మనపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని జంతువుల విగ్రహాలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి పెరిగి ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం ఏ జంతువుల బొమ్మలు ఇంట్లో ఉంటే శుభం చేకూరుతుందో తెలుసా?

ఏనుగు

సామరస్యానికి గుర్తు ఏనుగు. ఇంట్లో ఏనుగు జతల బొమ్మలు పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. ఈ విగ్రహం పెట్టుకోవడం వల్ల కుటుంబంలో ఐక్యత, దాంపత్య జీవితం సంతోషంగాను ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగు ప్రతిమ పెట్టుకోవచ్చు.

తాబేలు

విష్ణుమూర్తి స్వరూపం తాబేలు. క్షీర సాగర మథనం చేస్తున్న సమయంలో శ్రీమహా విష్ణువు లోక రక్షణ కోసం కూర్మావతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. విషమూర్తి తాబేలు అవతారంలో ఉన్న ఏకైక దేవాలయం శ్రీకూర్మం. తాబేలు ప్రతిమ ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబం మీద ఉంటుందని నమ్మకం. తాబేలు విగ్రహాన్ని పెట్టేందుకు దిశ చాలా ముఖ్యం. ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో తాబేలు ప్రతిమ పెట్టడం వాలల సంపద పెరుగుతుంది.

చేప

నీటిలో ఉండే చేప సంపదకి చిహ్నంగా భావిస్తారు. రెండు చేపలు ఉన్న బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సంపదకి ఎటువంటి లోటు ఉండదని విశ్వసిస్తారు. ఇది శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేపల ప్రతిమ పెట్టుకోవచ్చు. ఇంటి ఈశాన్య లేదా తూర్పు దిశలో పెట్టుకుంటే ఆనందం, శ్రేయస్సు, సంపద మీ సొంతం అవుతాయి.

ఆవు

హిందువులు గోమాతని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. పురాణాల ప్రకారం ఆవులో అందరు దేవతలు ఉంటారని నమ్ముతారు. అందుకే ఇంటికి వచ్చిన ఆవుకి తప్పనిసరిగా ఆహారం పెట్టి పంపిస్తారు. ఆవు తోక వైపు పూజ చేస్తారు. ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు లభిస్తాయి.

ఒంటె

ఒంటె పోరాటానికి విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఒంటె విగ్రహం మీ ఇంట్లో ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్ వాయువ్య దిశలో ఒంటె ప్రతిమని పెట్టుకోవడం వల్ల వ్యాపారంలో రాణిస్తారు. కెరీర్ లో మంచి విజయాలు నమోదు చేస్తారు.

క్రూర మృగాలైన పులి, సింహం వంటి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు. చాలా మంది వాటి తలల బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటారు. అది ఇంటికి చెడు చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇవి ఉండటం వల్ల ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. హింసకి ఇవి ప్రతీకగా నిలుస్తాయి.