Anagaraka yogam: కుజుడు, రాహువు కలయికతో అశుభ యోగం.. ఈ రాశుల జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి
20 March 2024, 14:14 IST
- అంగారకుడు, నీడ గ్రహం రాహువుతో కలవడం వల్ల కొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలు, సమస్యలు ఎదురుకాబోతున్నాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడబోతుంది.
కుజుడు, రాహువు కలయికతో అశుభ యోగం
అన్ని గ్రహాలకు అధిపతి అంగారకుడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న కుజుడు ఏప్రిల్ లో మీన రాశిలో ప్రవేశించబోతున్నాడు. నలభై ఐదు రోజులకు ఒకసారి రాశి మారుస్తాడు. ఏప్రిల్ 23న మీన రాశి సంచారం చేస్తాడు. ఇప్పటికే అక్కడ నీడ గ్రహం రాహువు సంచరిస్తున్నాడు.
రాహు, కుజ కలయిక అంత శుభప్రదంగా భావించరు. ఈ రెండు గ్రహాల కలయికతో అంగారక యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో అంగారక యోగం అశుభంగా భావిస్తారు. ఈ యోగంలో శుభకార్యాలు చేయడం నిషేధం. కుజుడు ఉన్నత స్థానంలో ఉంటే ఏ జాతకుడికైనా శుభప్రదంగా పరిగణిస్తారు. కానీ కుజుడు నీడ గ్రహం రాహువుతో కలిస్తే మాత్రం అది హింసాత్మక ప్రతికూల పరిస్థితులను కలిగిస్తుంది. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ఏప్రిల్ నెల కొన్ని రాశుల వారికి సమస్యలతో సతమతమవుతారు.
అంగారక యోగం ఆర్థికపరంగా నష్టాలని ఇస్తుంది. కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు కలిగిస్తుంది. అప్పుల సమస్యలు వెంటాడతాయి. సొంతవారితోనే ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కుజుడు, రాహువు కలయిక ఉన్నప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
రాహువు, అంగారకుడు కలిసి విపరీతమైన ఇస్తారు. రాహువు ప్రభావంతో మనసు చంచలంగా ఉంటుంది. ఆర్థికంగా బలహీనపడతారు. ప్రమాదాలు జరుగుతాయి. మనసు గందరగోళంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత కృషి చేసినా కూడా విజయం వరించదు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. అంగారక యోగం వల్ల మూడు రాశుల వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
మేష రాశి
అంగారక యోగం మేష రాశి వారికి మంచిది కాదు. మీ పనులు ఆగిపోవచ్చు. డబ్బు నిలిచిపోతుంది. ఫలితంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యోగం కారణంగా డబ్బు లావాదేవీలు ఇబ్బందులు పడతాయి. వ్యాపారంలో చిక్కులు ఎదురవుతాయి.
కన్యా రాశి
అంగారక యోగం కన్యా రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. కోపం వల్ల సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగం చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి అంగారక యోగం వల్ల జీవితం పెను మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కోపం వల్ల ఇతరులతో మాటలు పడాల్సి వస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
అంగారక యోగం ఏర్పడినప్పుడు వ్యక్తి స్వభావం ఉగ్రరూపంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు త్వరగా కోపం వచ్చేస్తుంది. ఎటువంటి కారణం లేకుండానే గొడవలకు దిగుతారు. అంగారకుడి ప్రతికూల ప్రభావాలు నివారించాలనుకుంటే ఈ పరిహారాలు పాటించండి.
పరిహారాలు
‘ఓం అంగ అంగారకాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. మాంసాహారం, ఆల్కాహాల్ అలవాట్లు మానుకోవాలి. కోపాన్ని వీలైనంత వరకు అదుపులో ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. శివుడిని, హనుమంతుడిని పూజించాలి. ప్రియమైన వారితో, జీవిత భాగస్వామితో మర్యాదగా ప్రవర్తించాలి. కుజుడిని సంతోషపరిచే పనులు చేయాలి. కోపాన్ని నియంత్రించుకుని మాటల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి.