వార ఫలాలు.. ఈ వారం అన్ని రాశుల వారికి అనుకూలమే, వ్యాపారంలో భారీ లాభాలు-weekly horoscope in telugu march 10th to march 16th rasi phalalu check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Weekly Horoscope In Telugu March 10th To March 16th Rasi Phalalu Check Zodiac Signs Result

వార ఫలాలు.. ఈ వారం అన్ని రాశుల వారికి అనుకూలమే, వ్యాపారంలో భారీ లాభాలు

HT Telugu Desk HT Telugu
Mar 10, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మార్చి 10వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

మార్చి 10 నుంచి 16 వరకు వార ఫలాలు
మార్చి 10 నుంచి 16 వరకు వార ఫలాలు (freepik)

రాశిఫలాలు (వార ఫలాలు) 10.03.2024 నుండి 16.03.2024 వరకు

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : మాఘము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. రోజువారీ పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఆరోగ్యం అనుకూలించును. శుభకార్య ప్రయత్నాలు కలసివచ్చును. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. మేష రాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. పెద్దల సహకారం పొందుతారు. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచిస్తున్నాను. ప్రయాణాలు కలసివస్తాయి. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. గొడవల నుండి బయటపడతారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. గతంతో పోలిస్తే ఈవారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలుంటాయి. రాబడి పెరుగుతుంది. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

వార ఫలాల ప్రకారం ఈ వారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉన్నది. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పని భారం పెరిగినా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. పై అధికారుల ఆదరణ ఉంటుంది. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం చేపడతారు. ఆరోగ్యం అనుకూలించును. స్థిరాస్తి ద్వారా ఆదాయం పొందుతారు. రాబడి పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం ఉంటుంది. శుభవార్త వింటారు. ఉద్యోగులకు మధ్యస్థ సమయం. పై అధికారులతో సామరస్యంగా వ్యవహరించాలి. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు నెరవేరతాయి. ధార్మిక కార్యక్రమాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు సకాలంతో పూర్తి చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి అవకాశం కలసివచ్చును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. విహార యాత్రలు చేస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి తగాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి. గతంలోని పెట్టుబడులకు ప్రతిఫలాలు లభిస్తాయి. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

వార ఫలాల ప్రకారం ఈ వారం కన్యారాశి వారికి మధ్యస్థ ఫలితాలున్నాయి. చేయవలసిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. నలుగురి సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి సమయం. వ్యాపారపరంగా భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం ఊరట లభిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. మంచివారితో పరిచయాలేర్పడతాయి. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. విదేశీ విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పారాయణ, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభించును. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. శత్రువులు మిత్రులుగా మారతారు. పలుకుబడితో పనులు నెరవేరతాయి. ప్రయాణాలు కలసివస్తాయి. ప్రతిష్ట పెరుగుతుంది. చాలా రోజుగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మానసిక ఆందోళనను అధిగమిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం అనుకూలం. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చికరాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. అధికారుల అందదండలుంటాయి. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయములు తలెత్తవచ్చును. కొత్త పరిచయాలేర్పడతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. కోర్టు పనుల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ప్రణాళికాబద్ధంగా బాధ్యతలు నిర్వర్తించి మెప్పు పొందుతారు. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబ సభ్యులతో ఆనందముగా గడిపెదరు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలించును. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులపై ఆసక్తి కనబరుస్తారు. మీ ఆలోచనలను ప్రణాళికబద్ధంగా అమలుచేస్తారు. ఆదాయానికి తగిన ఖర్చులుంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారస్తులకు కలసివచ్చే సమయం. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. బంధు మిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. రావలసిన సొమ్ము అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వాహన మరమ్మత్తులు ముందుకు రావచ్చు. అనుకున్న పనులు నేరవేరతాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశముంది. సహోద్యోగులతో కలసిమెలసి ఉంటారు. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆస్తి తగాదాలు తీరతాయి. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. పనుల్లో పట్టుదల అవసరం. భూలావాదేవీల్లో లాభాలు పొందుతారు. వ్యవసాయదారులకు మంచి సమయం. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ప్రయాణాలు కలసివస్తాయి. పలుకుబడితో పనులు నెరవేరతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel