Mysterious temple: ఈ ఆలయంలోకి రాజకీయ నాయకులు వెళ్లాలంటే భయపడతారట.. ఎందుకో తెలుసా?-brihadeshwara temple in thanjavur it is mysterious temple politicians afraid to enter this temple ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mysterious Temple: ఈ ఆలయంలోకి రాజకీయ నాయకులు వెళ్లాలంటే భయపడతారట.. ఎందుకో తెలుసా?

Mysterious temple: ఈ ఆలయంలోకి రాజకీయ నాయకులు వెళ్లాలంటే భయపడతారట.. ఎందుకో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Feb 17, 2024 06:36 PM IST

Mysterious temple: ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు తాము గెలవాలని కోరుకుంటూ రాజకీయ నాయకులు గుళ్ళు, గోపురాలు తిరిగేస్తారు. కానీ దేశంలో ఉన్న ఈ ఆలయం వైపుకి రావడానికి మాత్రం రాజకీయ నాయకులు సాహసం చేయరట. ఎందుకో తెలుసా?

బృహదీశ్వరాలయం
బృహదీశ్వరాలయం

Mysterious temple: భారతదేశంలో అలయాలకు కొదువ లేదు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఎన్నో విచిత్రమైన, రహస్యాలు కలిగిన ఆలయాలు కూడా భారత్ లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఆ ఆలయాల వెనుక ఉన్న రహస్యాలు ఏంటనేది శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కడం లేదు. అటువంటి ఒక అలయమే ఇప్పుడు మనం మాట్లాడుకునేది.

ఈ ఆలయం మొత్తం వింతలు, విశేషాలు, ఆశ్చర్యకరమైన విషయాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం. సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు కూడా వచ్చింది. ఇక్కడ శివుడిని పూజిస్తారు. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ ఆలయ విశేషాలు కూడా అంతే ఆశ్చర్యపరుస్తాయి. ఈ ఆలయం నీడ నేల మీద పడదు. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడకి వచ్చేందుకు రాజకీయ నాయకులు ధైర్యం చేయరని అంటారు. 1980 నుంచి ఈ నమ్మకం ప్రచారంలో ఉంది. ఈ ఆలయానికి తూర్పున ఉన్న ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తే అధికారం లేదా ప్రాణం పోతుందని నమ్ముతారు. అందుకే రాజకీయ నాయకులు ఈ ఊరు సందర్శించినా కూడా ఆలయం వైపు మాత్రం రారని అంటారు.

ఈ నమ్మకం వెనుక కారణాలు ఏంటంటే..

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఢిల్లీలోని తన అధికారిన నివాసానికి సమీపంలో హత్యకు గురైన విషయం అందరికీ తెలిసినటే అయితే ఆమె చనిపోవడానికి కొన్ని వారాల ముందు తంజావూరులోని ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత ఆమె హత్యకు గురయ్యారు. ఇది మాత్రమే కాదు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ అదే సంవత్సరం ఈ ఆలయం ప్రధాన ద్వారం గుండా వెళ్ళి దర్శించుకున్నారు. తర్వాత ఆయన కిడ్నీ సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడేళ్ళ పాటు చికిత్స తీసుకుని కోలుకున్న తర్వాత 1987 డిసెంబర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరణించారు.

ఈ నమ్మకం మరింత బలపడటానికి ఇంకొక కారణం కూడా చెబుతారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సెప్టెంబర్ 2010లో ఈ ఆలయాన్ని సందర్శించారు. అయితే ఆయన ఆలయ ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించలేదు. ఎవరో ఈ ఆలయ ప్రధాన ద్వారం నుంచి వెళ్ళడం సరికాదని చెప్పేసరికి పక్కగా ఉన్న మరొక గేటు నుంచి ఆలయంలోకి వెళ్లారని చెబుతారు. ఇలా ఈ ఆలయానికి సంబంధించి కొన్ని విచిత్రమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి.

ఆలయ చరిత్ర

ప్రపంచంలోనే గ్రానైట్ రాయితో కట్టిన అతిపెద్ద దేవాలయం ఇది. ప్రధాన ద్వర్యం గుండా లోపలికి వెళ్ళగానే పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే ఉన్న అతి పెద్ద ఏకశిలా విగ్రహం ఇదే. ఈ ఆలయంలో శివలింగం కొలువుదీరింది. 11వ శతాబ్ధంలో చోళులు నిర్మించారు. ఆలయ గర్భ గుడిలో 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగుల విస్తీర్ణంలో ఇక్కడ శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయంలో అన్ని దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. అందులో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు పెద్దవి. అష్ట దిక్పాలకులు విగ్రహాలు కలిగిన అరుదైన దేవాలయాలలో ఇదిఈ ఒకటి. అది మాత్రమే కాదు ఈ ఆలయం మీద 81 సంప్రదాయ భరతనాట్య భంగిమలు కలిగిన విగ్రహాలు చెక్కబడి ఉంటాయి.

WhatsApp channel